• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీటీడీ మరో కీలక నిర్ణయం .. భక్తుల సంఖ్య పెంచేలా, స్థానిక ఆలయాలపై విస్తృత ప్రచారం

|

టీటీడీ పరిధిలోని స్థానిక ఆలయాల ప్రాశస్త్యాన్ని అందరికీ తెలియజేసి భక్తుల సంఖ్యను పెంచాలని టిటిడి కసరత్తులు చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని స్థానిక ఆల‌యాల ప్ర‌శ‌స్త్యాన్ని భక్తులందరికీ తెలియజేస్తూ, స్థ‌ల పురాణాన్ని విస్తృత ప్ర‌చారం చేసి టూరిజం, ఆర్టీసీ శాఖ‌లను స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌క్తుల సంఖ్య పెంచేలా ప్ర‌ణాళిక‌లు త‌యారు చేయాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

  TTD Sarva Darshan టోకెన్లు 15 వేలకు కుదింపు... ఆర్జిత సేవలు వాయిదా ! Covid Guidelines || Oneindia

  తిరుమల శ్రీవారి ఆలయ భద్రతకు యాంటీ డ్రోన్ సిస్టమ్ .. దేశానికి డ్రోన్ల దాడుల భయంతో అలెర్ట్ అయిన టీటీడీతిరుమల శ్రీవారి ఆలయ భద్రతకు యాంటీ డ్రోన్ సిస్టమ్ .. దేశానికి డ్రోన్ల దాడుల భయంతో అలెర్ట్ అయిన టీటీడీ

  స్థానిక ఆలయాలపై ప్రచారం సాగించనున్న టీటీడీ

  స్థానిక ఆలయాలపై ప్రచారం సాగించనున్న టీటీడీ

  టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలో స్థానిక ఆల‌యాల కార్య‌క‌లాపాల‌పై అధికారుల‌తో సమీక్ష జరిపిన ఈవో స్థానిక ఆలయాలపై ప్రధానంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. టిటిడి స్థానిక ఆలయాలకు సంబంధించిన స్థల పురాణాన్ని, ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ టిటిడి వెబ్సైట్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా తిరుపతిలోనూ, తిరుమలలోనూ భక్తులు బస చేసే నివాసాల వద్ద టిటిడి పరిధిలోని స్థానిక ఆలయాల గురించి ప్రచార ఏర్పాట్లు చేయాలని, హోర్డింగ్స్ పెట్టాలని సూచించారు.

   హోర్డింగులు, బుక్ లెట్లతో ప్రచారం

  హోర్డింగులు, బుక్ లెట్లతో ప్రచారం

  ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఆలయాల గురించి భక్తులకు తెలిసేలా ప్రచార ఏర్పాట్లు చేయాలని చెప్పారు. టూరిజం, ఆర్టీసీ అధికారులతో సంప్రదింపులు జరిపి ప్యాకేజీ టూర్లను ఏర్పాటు చేయించాలని సూచించారు. ఇదే సమయంలో స్థానిక ఆలయాల అవసరాలను బట్టి సేవలు ప్రవేశపెట్టాలని కూడా భావిస్తున్నారు. ప్రతి ఆలయానికి సంబంధించి ఒక బుక్ తయారు చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఈవో జవహర్ రెడ్డి సూచించారు

   చిత్తూరు జిల్లాలో చాలా పురాతన దేవాలయాలు .. వాటి ప్రాముఖ్యత తెలిసేలా ప్రచారం

  చిత్తూరు జిల్లాలో చాలా పురాతన దేవాలయాలు .. వాటి ప్రాముఖ్యత తెలిసేలా ప్రచారం

  చిత్తూరు జిల్లాలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి, ఇవి యాత్రికులకు పెద్దగా తెలియదు. ఇక అలాంటి వాటికి ప్రాధాన్యత కలిగేలా స్థానిక దేవాలయాలను ప్రధాన తీర్థయాత్రలుగా మార్చడానికి టీటీడీ కొత్త ప్రయత్నం చేస్తోందని ఈ నిర్ణయం ద్వారా తెలుస్తోంది. భక్తుల సౌలభ్యం కోసం శ్రీనివాస మంగాపురం, అప్పలాయగుంట ఆలయంలో కల్యాణకట్టలు ఏర్పాటు చేయాలని టిటిడి భావిస్తోంది. టీటీడీ అనుబంధ విలీన ఆలయాలకు సంబంధించిన వ్యవసాయ భూములను ఖాళీగా ఉంచరాదని ఎప్పటికప్పుడు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది.

  స్థానిక ఆలయాల ఆదాయం పెరిగేలా .. భక్తులు ఎక్కువగా వచ్చేలా ప్రణాళిక

  స్థానిక ఆలయాల ఆదాయం పెరిగేలా .. భక్తులు ఎక్కువగా వచ్చేలా ప్రణాళిక

  ఆలయాలకు కానుకగా వచ్చే గోవుల సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని, ఇదే సమయంలో ఆలయ భూములకు సంబంధించి వ్యవసాయం చేస్తున్న రైతులతో మాట్లాడి తిరుమల ఆలయ ప్రసాదాల తయారీకి పంటలను అందించేలా చూడాలని పేర్కొన్నారు.ఆలయాల ఆదాయం భక్తుల సంఖ్యను బట్టి గ్రేడ్లుగా విభజించాలని సూచించారు. స్థానిక విలీన ఆలయాలకు సంబంధించి మంజూరు చేసిన అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు. తిరుమల టూరిజం అభివృద్ధికి, భక్తులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా స్థానిక దేవాలయాలకు ఉన్న ప్రాముఖ్యత తెలియజేస్తే స్థానిక ఆలయాలకు సైతం భక్తుల సంఖ్య పెరుగుతుందని టిటిడి భావిస్తోంది.

  English summary
  The TTD Executive Officer Dr KS Jawahar Reddy has instructed the HoDs of TTD local temples to improve footfalls by coordinating with Tourism and RTC and taking up wide publicity on the significance and heritage of all temples. Reviewing the functioning of the local temples with officials at his chambers in TTD Administrative Building, the EO said both the TTD website and SVBC should popularise the glory of these ancient local temples.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X