• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

33 రోజులుగా టీటీడీ పుణ్యక్షేత్రం బంద్..! సుమారు 120కోట్ల ఆదాయం గోవిందా... గోవిందా....!!

|

అమరావతి/హైదరాబాద్ : వివిధ దేశాల ఆర్ధిక మూలాలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా దెబ్బతో ఆర్థికంగా చాలా దేశాలు ఛిన్నాభిన్నం అయిపోతున్నాయి. పరిశ్రమలు, ప్రజారవాణా, సాఫ్ట్ వేర్, విద్యా, ఎక్సైస్, మాల్స్, రెస్టారెంట్స్, సినిమా హాల్స్ వంటి రంగాలు పూర్తిగా నిలిచిపోవడంతో రాష్ట్రాల ఆదాయానికి భారిగా గండిపడినట్టు తెలుస్తోంది. దీంతో చాలా రంగాలు ఆర్దికంగా చితికిపోయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రపంచ ప్రసిద్ది గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా గత 33రోజులుగా మూసివేయడంతో ఆలయానికి సమకూరే ఆదాయం గణనీయంగా పడిపోయినట్టు తెలుస్తోంది.

 గత 33రోజులుగా టీటీడి సేవలు బంద్..

గత 33రోజులుగా టీటీడి సేవలు బంద్..

ప్రపంచంలోలేనే ప్రసిద్ది పొందిన తిరుమల తిరుపతి దేవస్ధానం మునుపెన్నడూ లేని విధంగా ఆదాయాన్ని కోల్పోయింది. కోవిడ్-19 వైరస్ ప్రభావంతో భారత దేశం మొత్తం షట్ డౌన్ అయ్యింది. లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో దేశంలోని ప్రసిద్ద దేవాలయాలను, దర్గాలను, చర్చిలను తాత్కాలికంగా మూసివేసిన పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ప్రపంచ దేవాల్లోనే అత్యంత సంపన్న దేవుడుగా, కలియుగ దైవంగా గుర్తింపు పొందిన తిరుమల తిరుపతి దేవస్దానాన్ని గత 33రోజులుగా మూసిఉంచారు. దీంతో నిత్యం జగగాల్సిన అనేక ఆర్జిత సేవలు, స్వామి వారి కైంకర్యలు తాత్కాలికంగా రద్దు చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

 ప్రపంచ ప్రసిద్ద దేవాలయం..

ప్రపంచ ప్రసిద్ద దేవాలయం..

ప్రపంచ ప్రసిద్ది పొందిన తిరుమల తిరుపతి దేవస్ధానానికి వివిధ సేవలు, దర్శనాలు, కాటేజీలు, కొండమీద వివిధ షాపులు, చందాలు, కానుకలు, లడ్డూ విక్రయాలే కాకుండా ఆన్ లైన్ బుకింగ్ ల పేరుతో టీటీడి కి ఆదాయం సమకూరుతుంది. ప్రతిరోజు స్వామివారిని లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. స్వామి వారి దర్శనం కోసం ఒక్కోసారి 24గంటలు క్యూలైన్లలో వేచి ఉండే పరిస్థితులు నెలికొంటాయి. అయినప్పటికి భక్తులు ఏమాత్రం అసహనానికి గురి కాకుండా వెంకన్న సంపూర్ణ దర్శనాన్ని చేసుకుని సంతృప్తిగా వెనుతిరుగుతారు భక్తులు. ప్రపంచంలోని అనేక దేశాల నుండి స్వామివారి దర్శనం కోసం తిరుమల కొండమీదకు చేరుకుంటారు భక్తులు.

 అన్ని రకాల ఆదాయం కోల్పోయిన వెంకన్న..

అన్ని రకాల ఆదాయం కోల్పోయిన వెంకన్న..

ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమల కొండమీదకు చేరుకున్న భక్తులు ఒక్కసారిగా స్వామి వారి దర్శనం చేసుకోగానే అన్ని ఇబ్బందులను ఇట్టే మర్చిపోతారు. మనస్పూర్తిగా తమకు తోచినంత కానులకు స్వామివారిక సమర్పించడం కూడా ఏడుకొండల మీద నిత్యం జరిగే తంతు. ఏడుకొండల వెంకన్నను దర్శించుకోవడానికి ఎంత ఇష్టపడతారో అక్కడ లభించే ప్రసాదం, లడ్డూను సొంతం చేసుకోవడానికి కూడా భక్తులు అంతే పోటీ పడతారు. ఎంత ఖర్చైనా సరే సాద్యమైనన్ని ఎక్కువ లడ్డూలు కొని ఇంటి చుట్టుపక్కల వారికి పంచడం కూడా వెంకన్న భక్తుల ఆనవాయితీగా మారింది. లడ్డూల రూపంలో కూడా తిరుమల వెంకన్నకు గణనీయమైన ఆదాయం సమకూరనున్నట్టు తెలుస్తోంది.

  Coronavirus : Telangana Government Decided To Take Corona Samples @ Home
   వెంకన్న ఆలయాన్ని ఇన్ని రోజులు మూసివేసిన సందర్బం లేదు..

  వెంకన్న ఆలయాన్ని ఇన్ని రోజులు మూసివేసిన సందర్బం లేదు..

  ఇక కరోనా మహమ్మారి కోవిడ్-19 ప్రభావంతో తిరుమల ఆలయాన్ని గత 33రోజులుగా మూసివేసారు. దీంతో ఆలయానికి సమకూరాల్సిన ఆదాయం కోట్లలో కోల్పోయినట్టు తెలుస్తోంది. సుమారు 120 నుండి 130కోట్ల రూపాయల ఆదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కోల్పోయినట్టు నిర్ధారణ జరుగుతొంది. భక్తులకు అందుబాటులో ఉండే వివిధ సేవల ద్వారా వచ్చే ఆదాయం కూడా దేవస్ధానం కోల్పోవడం చరిత్రలో ఇదే మొదటిసారని ఆలయ ప్రధాన అర్చకులు చెప్పుకొస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల ప్రకారం మరో 13 రోజులు ఇదే లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగనుండడంతో స్వామి వారి ఆదాయానికి మరింత గండిపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  English summary
  Tirumala Temple has been closed for the past 33 days under the influence of Corona Pandemic Covid-19. This has resulted in a loss of revenue to the temple in quotes. The Tirumala Tirupati Temple is estimated to have lost around Rs 120 to Rs 130 crore in revenue.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X