• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుపతిలో మద్యం నిషేధం: తిరుమలలో ప్లాస్టిక్ కనపడకూడదు: అధికారిక నిర్ణయమే మిగిలింది..!

|

ప్రపంచ ప్రఖ్యత పుణ్యక్షేత్రం తిరుపతిలో మద్య నిషేధం దిశగా తొలి అడుగు పడింది. టీటీడీ అంటే తిరుమల ఒక్కటే కాదని.. తిరుపతి సైం పుణ్యక్షేత్రంలో భాగమైనందున కొండ తరహాలోనే తిరుపతి నగరంలోనూ మద్యనిషేధం అమలు చేయలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే, వ్యక్తిగతంగా ఇప్పటికే సుబ్బారెడ్డి స్వయంగా ప్రభుత్వానికి ఈ మేరకు అభ్యర్ధన చేసారు. దీంతో..ఈ నెల 30న జరిగే కేబినెట్ సమావేశంలో టీటీడీ సిఫార్సుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.

అదే సమయంలో తిరుమలలో పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధిస్తూ టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుపతి నగరంతో పాటుగా చుట్టు పక్కల పది కిలో మీటర్లు దూరంతో మద్య నిషేధం అమలు చేయాలని బోర్డు సిఫార్సు చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం..గతంలో ఎవరూ చేయని విధంగా ఇప్పుడు ఈ నిర్ణయం అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే దీని పైన అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

TTD board Reccomanded Ap Govt to ban on liquor in Tirupati and surrounding 10 kms area

తిరుపతితో సహా చుట్టుపక్కల సైతం..

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో కూడా పూర్తిస్థాయిలో మద్యపాన నిషేదం విధించాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు పాలకమండలి వెల్లడించింది. టీటీడీ అంటే తిరుమల మాత్రమే కాదని, తిరుమల-తిరుపతి కలిసి ఉంటాయని స్పష్టం చేసింది.టీటీడీ పాలకమండలి బుధవారం సమావేశమై పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం మీద తిరుమల పుణ్యకేత్రం కేంద్రంగా అనేక ఆరోపణలు వెలువెత్తాయి.

అయితే, ఇప్పుడు ప్రభుత్వం తిరుపతిలో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా..బోర్డు సిఫార్సు మేరకు తిరుపతితో పాటుగా చుట్టు పక్కల పది కిలో మీటర్ల పరిధిలో మద్యపాన నిషేధం దిశగా అడుగులు పడనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా సంపూర్ణ మద్య పాన నిషేధం దిశగా చర్యలు మొదలు పెట్టింది. ఇక, తిరుపతితో సహా చుట్టు పక్కల పది కిలోమీటర్ల పరిధిలో మద్య పాన నిషేధం పైన ప్రభుత్వం ఈ నెల 30న జరిగే కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీని ద్వారా భక్తుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా సానుకూల ప్రభావం పడుతుందోని..తిరుమల పవిత్రత కాపాడుతున్న ప్రభుత్వంగా గుర్తింపు దక్కనుంది.

TTD board Recommended Ap Govt to ban on liquor in Tirupati and surrounding 10 kms area

తిరుమలో ప్లాస్టిక్ కనిపిస్తే అంతే..

ఇక, టీటీడీ పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఇక ఎక్కడా ప్లాస్టిక్ కనిపించకూడదని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక పాటు కల్యాణకట్ట కార్మికులు, ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసేందుకు బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది. శ్రీవారి బ్రహ్మోహ్సవాలను విజయవంతంగా నిర్వహించినందుకు టీటీడీ అధికారులు, ఉద్యోగులకు పాలకమండలి ధన్యవాదాలు తెలిపింది.

గత ప్రభుత్వ హయాంలో తిరుపతిలో గరుడ వారధి నిర్మించాలని భావించారు. అయితే, గరుడ వారధి ఎక్కువ భక్తులకు ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో.. దాని నిర్మాణ ప్లాన్‌ను రీ డిజైన్ చేయాలని బోర్డు తీర్మానించింది. రీ టెండర్లు పిలవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే ఈ వారధి నిర్మాణానికి తొలివిడతగా రూ 100 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదముద్ర వేసింది. ఇక శ్రీ వెంకటేశ్వర ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌) ఆసుపత్రిని అధీనంలోకి తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయ్యాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. టీటీడీ అటవీశాఖలో 162 మంది సిబ్బంది ని రెగ్యులర్ చేసి, మిగిలిన వారికి టైమ్ స్కేల్ ఇవ్వాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTD board Reccomanded Ap Govt to ban on liquor in Tirupati and surrounding 10 kms area. Govt may approve this reccommandation in next cabet meet. At The same time TTD board order to ban on plstic in Tirumala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more