తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హరిద్వార్ స్వరూపానందేంద్ర స్వామి ఆశ్రమంలో టీటీడీ ఛైర్మన్!

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం హరిద్వార్ కు వెళ్లారు. విశాఖ శారదా పీఠానికి చెందిన ఆశ్రమాన్ని సందర్శించారు. హరిద్వార్ లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతుకుముందు ఆయన న్యూఢిల్లీలో కేంద్రమంత్రులను కలిశారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూరకంగా కలుసుకున్నారు.

బ్యాంకునకు రూ.148 కోట్ల బకాయి: వైసీపీ నేత, నిర్మాత ఆస్తులు జప్తు: 14న వేలం! <br>బ్యాంకునకు రూ.148 కోట్ల బకాయి: వైసీపీ నేత, నిర్మాత ఆస్తులు జప్తు: 14న వేలం!

శ్రీవారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.

TTD Chairman YV Subba Reddy met Central Minister Nirmala Sitaraman and visits Haridwar

అనంతరం పౌర విమనయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీతో భేటీ అయ్యారు. రేణిగుంట నుంచి విజయవాడకు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావాలని కోరారు. తిరుమలలో వెలసిన శ్రీవెంకటేశ్వర స్వామికి సంబంధించిన విలువైన గ్రంధాలను డిజిటలైజేషన్‌ చేస్తున్నామని ఆయన వివరించారు. పదకవితా పితామహుడు అన్నమాచార్య కీర్తనలతో పాటు అనేక విలువైన తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన సాహిత్యాన్ని డిజిటలైజ్‌ చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు.

English summary
Tirumala Tirupati Devasthanams Chairman YV Subba Reddy has visits Haridwar on Friday. He went Vishakha Sri Sharada peetham Ashrama, Lord Balaji's temple, which is maintained by TTD. Earlier, YV Subba Reddy was met Union Ministers Nirmala Sitharaman and Hardeep Singh Puri, Lok Sabha Speaker Om Birla in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X