తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫలించిన టీటీడీ ప్రయత్నం .. బ్యాంకులలో 5.15 కోట్ల చిల్లర నాణేల డిపాజిట్

|
Google Oneindia TeluguNews

తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి హుండీలో వచ్చే చిల్లర టిటిడికి పెద్ద సమస్యగా పరిణమించిన తరుణంలో టీటీడీ అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు . టన్నుల టన్నుల చిల్లరను స్టోర్ చేయడం టిటిడికి పెద్ద తలనొప్పిగా మారిన క్రమంలో తీసుకున్న ఆ నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుంది. టీటీడీ చిల్లర సమస్యను పరిష్కరించే ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టిసారించిన టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి ఒక తెలివైన ప్లాన్ వేసి బ్యాంకులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు . ఇక ఆ ఆఫర్ కు ఆకర్షితులైన బ్యాంకులు చిల్లర తీసుకోటానికి ముందుకు వస్తున్నాయి.

 పరకామణిలో పేరుకుపోతున్న చిల్లర డిపాజిట్ కోసం ఫలించిన టీటీడీ యత్నం

పరకామణిలో పేరుకుపోతున్న చిల్లర డిపాజిట్ కోసం ఫలించిన టీటీడీ యత్నం

పేరుకుపోతున్న చిల్లర కుప్ప లతో, టన్నుల, టన్నుల చిల్లర నాణేలతో పరకామణిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న టీటీడీ ఇక ఆ సమస్యకు చెక్ పెట్టడానికి తీసుకున్న నిర్ణయంలో తొలి అడుగు పడింది. టీటీడీ స్పెషల్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయం తో పరకామణి నుండి 5.15 కోట్ల చిల్లర నాణేలను తాజాగా బ్యాంకులలో డిపాజిట్ చేశారు టీటీడీ అధికారులు .అయితే ఏయే బ్యాంకులలో డిపాజిట్లు చేశారో మాత్రం ఇంకా వివరాలు వెల్లడించలేదు అధికారులు . గత కొన్నేళ్లుగా టిటిడి కి సంబంధించిన ఆదాయాన్ని పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నా బ్యాంకులు చిల్లర విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నాయి. చిల్లర ని తీసుకోవడానికి చాలా బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. కానీ తాజాగా టీటీడీ ఇచ్చిన ఆఫర్ రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన హామీ మేరకు బ్యాంకులు ముందుకు వచ్చాయి.

<strong>మీరన్న ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్ ను విశాఖ , విజయనగరానికి పంపించండి బాబు ...మంత్రి అవంతి వ్యంగ్యాస్త్రాలు </strong>మీరన్న ఆర్టిఫిషియల్ ఫ్లడ్స్ ను విశాఖ , విజయనగరానికి పంపించండి బాబు ...మంత్రి అవంతి వ్యంగ్యాస్త్రాలు

 మొత్తం చిల్లర 20.5 కోట్లు .. టీటీడీ ఆఫర్ తో చిల్లర సేకరణకు బ్యాంకుల ఆసక్తి

మొత్తం చిల్లర 20.5 కోట్లు .. టీటీడీ ఆఫర్ తో చిల్లర సేకరణకు బ్యాంకుల ఆసక్తి

ఇక నిన్నటి వరకు చిల్లర నాణాలు సేకరించడానికి ముందుకు రాని బ్యాంకులు ఇప్పుడు నాణేల సేకరణ కు ముందుకు వస్తున్నాయి. ఇక ఈ నిర్ణయంతో టీటీడీకి చిల్లర సమస్య కొంత తగ్గుతుంది అన్న భావన వ్యక్తం అవుతుంది. చిల్లర నాణేలు డిపాజిట్ చేసుకోకపోవడం వల్ల కలిగిన నష్టం ఇకముందు తగ్గనుంది.

ఇక ఇప్పటి వరకు చూసినట్లయితే టిటిడి కి సంబంధించిన చిల్లర నాణేల సేకరణ ఒక్క ఆంధ్ర బ్యాంక్ మాత్రమే చేసింది. ఇక ఇప్పుడు మరిన్ని బ్యాంకులు ముందుకు వచ్చాయి. మొత్తంగా తిరుమల శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన చిల్లర నాణేల డిపాజిట్‌ సమస్యకు చిక్కుముడి వీడుతోంది. గత రెండేళ్లుగా హుండీ ద్వారా వచ్చిన దాదాపు రూ.20.5 కోట్ల విలువచేసే చిల్లర నాణేలు టీటీడీ వద్ద పేరుకుపోయాయి. ఇప్పుడు వాటి నుండి 5.15 కోట్ల చిల్లర నాణేల డిపాజిట్ జరిగింది. ఇంకా మిగిలిన రూ.14.9 కోట్ల చిల్లర నాణేలను కూడా డిపాజిట్‌ చేసేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది.

 చెల్లని నాణేలను , నోట్లను కూడా ఖజానా నుండి తరలించే ఆలోచనలో టీటీడీ చర్చలు

చెల్లని నాణేలను , నోట్లను కూడా ఖజానా నుండి తరలించే ఆలోచనలో టీటీడీ చర్చలు


ఇక అంతేకాదు మరోవైపు చెల్లని నాణేలను కూడా ఖజానానుంచి తరలించడంపై కూడా టీటీడీ చర్చలు జరుపుతోంది. వాడుకలో లేని చిల్లర నాణేలను స్వీకరించేందుకు ఇప్పటికే స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముందుకు వచ్చినట్టు ఐదురోజుల క్రితం ధర్మారెడ్డి తెలియజేశారు . అలాగే విదేశీ కరెన్సీ, కట్‌నోట్లనూ మారకం చేసేలా చర్యలు తీసుకుంటున్నారని కూడా తెలుస్తుంది . మొత్తంమీద చిల్లర నిల్వల క్లియరెన్స్‌ ద్వారా టీటీడీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. అలాగే చెల్లని నాణేల విషయంలో కూడా నిర్ణయం తీసుకున్న టీటీడీ సాధ్యమైనంత క్లియరెన్స్ కు ప్రయత్నిస్తుంది.

English summary
coins in Swamivari Hundi at Tirumala Tirupati Temple are always a big problem. Tons of coins are a big headache for TTD. Against this backdrop, TTD is looking at alternative ways of solving the problem. TTD, has now come up with a clever plan to take deposits of the coins they offering banks a good deal . With the offer of TTD various banks deposited 5.15 crores of coins .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X