తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ‌డ్డీకాసుల వాడి నిధుల‌కు టీటీడీ ఎస‌రు! ఫిక్స్డ్ డిపాజిట్లలో భారీ కోతః రూ.79 కోట్లే

|
Google Oneindia TeluguNews

తిరుప‌తిః తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి వివిధ బ్యాంకుల్లో జ‌మ చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల మొత్తం ఏటేటా దారుణంగా ప‌డిపోతోంది. మూడేళ్లుగా ఇదే ప‌రిస్థితి టీటీడీలో కొన‌సాగుతోంది. శ్రీ‌వారికి హుండీ రూపంలో వ‌చ్చే న‌గ‌దులో క‌నీసం 60 శాతం మొత్తాన్ని వివిధ బ్యాంకుల్లో టీటీడీ బోర్డు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ల‌ను చేస్తారు. మూడేళ్ల నుంచి అంటే.. 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచీ ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా చేయాల్సిన నిధుల మొత్తం పావు శాతానికి క్షీణించింది. ఒక‌వైపు హుండీ ద్వారా వ‌చ్చే రాబ‌డి భారీగా పెరుగుతున్న‌ప్ప‌టికీ.. ఫిక్స్డ్ డిపాజిట్ల మొత్తం ప‌డిపోతుండ‌టం అనుమానాల‌కు తావిస్తోంది. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, అధికార పార్టీ అవ‌స‌రాల‌కు నిధుల‌ను మ‌ళ్లిస్తున్నారనే ఆరోప‌ణ‌ల‌కు ఆస్కారం ఇచ్చిన‌ట్టవుతోంది.

హుండీ న‌గ‌దులోనూ దుబారేనా?

హుండీ న‌గ‌దులోనూ దుబారేనా?

శ్రీవారి దివ్య‌మంగ‌ళ రూపాన్ని తిల‌కించ‌డానికి దేశం న‌లుమూల‌ల నుంచీ తిరుమ‌లకు వ‌స్తుంటారు భ‌క్తులు. మొక్కులు మొక్కుకుని ముడుపులు క‌డుతుంటారు. స్వామివారి ద‌ర్శ‌న భాగ్యం క‌లిగిన వెంట‌నే వెంట తెచ్చుకున్న‌ముడుపుల‌ను హుండీలో వేస్తారు. స్వ‌యంగా స్వామివారికి స‌మ‌ర్పించిన‌ట్టేన‌ని భావిస్తారు. అందుకే- అనేక మార్గాలుగా టీటీడీకి కోట్ల రూపాయ‌ల ఆదాయం వ‌స్తున్న‌ప్ప‌టికీ.. హుండీ ద్వారా జ‌మ అయ్యే న‌గ‌దు, ఇత‌ర కానుక‌ల‌ను టీటీడీ ప‌విత్రంగా భావిస్తుంది. హుండీ ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌కు వినియోగించ‌కూడ‌దు. ఈ విష‌యాన్ని టీటీడీ నిబంధ‌న‌ల్లో అతి ప్ర‌ధాన‌మైన‌ది కూడా. హుండీ ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని టీటీడీ కార్ప‌స్ ఫండ్‌గా భావిస్తుంది. ఇత‌ర‌త్రా అవ‌స‌రాల‌కు ఖ‌ర్చు చేయ‌డానికి అనేక రూపాల్లో వ‌చ్చే కోట్ల రూపాయ‌ల ఆదాయం ఉన్నందు.. హుండీ రాబ‌డిని అస్స‌లు ముట్టుకోదు. దీన్ని కార్ప‌స్ ఫండ్ గా భావించి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంది. సుమారు రెండున్న‌రేళ్లుగా హుండీ ఆదాయానికి కూడా చిల్లు ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. దీనికి నిద‌ర్శ‌నం ఏటేటా క్షీణిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్లే.

రెండేళ్లుగా భారీగా చిల్లు

రెండేళ్లుగా భారీగా చిల్లు

శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించే కానుకులను టీటీడీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. టీటీడీ పాల‌క‌మండ‌లి త‌న‌కు తానుగా రూపొందించుకున్న నిబంధనల ప్ర‌కారం.. హుండీ ఆదాయంలో కనీసం 60 శాతం నిధులను తప్పనిసరిగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా చేయలి. రెండేళ్లుగా టీటీడీ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కోత పెడుతోంది. 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో 757 కోట్ల రూపాయ‌లను ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాల్సి ఉండగా, అందులో 282 కోట్ల రూపాయ‌ల‌ను త‌గ్గించింది. 475 కోట్ల రూపాయ‌ల‌ను మాత్రమే డిపాజిట్ చేసింది. ఆ త‌రువాతి ఆర్థిక సంవ‌త్స‌రంలోనూ ప‌రిస్థితిలో మార్పు రాలేదు. పైగా మ‌రింత దిగ‌జారింది. 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రంలో 533 కోట్ల రూపాయ‌ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉండ‌గా, 268 కోట్ల రూపాయ‌ల‌కే ప‌రిమితం చేసింది. 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రానికి వ‌చ్చే స‌రికి ప‌రిస్థితి అత్యంత దారుణంగా త‌యారైంది. 516 కోట్ల రూపాయ‌ల మేర ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాల్సి ఉండ‌గా.. ఆ మొత్తం ఈ సారి మూడంకెల‌ను కూడా అందుకోలేక‌పోయింది. కేవ‌లం 79 కోట్ల రూపాయ‌ల వ‌ద్దే నిలిచిపోయింది. ఇంత త‌క్కువ మొత్తంలో డిపాజిట్ చేయ‌డం ఇదే మొద‌టిసారి.

నిధులు ఏమౌతున్న‌ట్లు?

నిధులు ఏమౌతున్న‌ట్లు?

స్వామి వారి హుండీ నిధుల ప‌ర్య‌వేక్ష‌ణ మొత్తం టీటీడీ ఆధీనంలో ఉంటుంది. ఒక్క రూపాయి వ్య‌యం చేయాల‌న్నా టీటీడీ పాల‌క‌మండ‌లి అనుమ‌తి త‌ప్పనిస‌రిగా తీసుకోవాల్సి ఉంటుంది. హుండీ నిధుల‌ను `లిక్విడ్ అమౌంట్` గా భావిస్తున్న‌ది టీటీడీ. ఏరోజుకారోజు క‌నీసం కోటి రూపాయ‌ల‌కు త‌గ్గ‌కుండా హుండీ రూపంలో ఆదాయం వ‌స్తున్నందున‌..వ‌చ్చిన మొత్తాన్ని వ‌చ్చిన‌ట్టే దుబారా ఖ‌ర్చుల‌కు వినియోగిస్తోందా? అనే అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్సానికి టీటీడీ 3,116 కోట్ల రూపాయ‌ల వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌తిపాదించ‌గా.. అందులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాల్సిన నిధులు కేవ‌లం 79 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రానికి ఆ నిధులు కూడా ఉండ‌వేమోన‌ని అధికారులు `ఆఫ్ ది రికార్డ్‌`గా చెబుతున్నారు. దీనికి కార‌ణం..ఇత‌ర ఖ‌ర్చుల‌కు నిధుల‌ను మ‌ళ్లిస్తుండ‌ట‌మేన‌ని అంటున్నారు.

స్మార్ట్ సిటీ కోస‌మేనా?

స్మార్ట్ సిటీ కోస‌మేనా?

తిరుప‌తి న‌గ‌రాన్ని కేంద్రం స్మార్ట్‌సిటీగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. స్మార్ట్ సిటీ నిధుల‌ను కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వం, స్థానిక కార్పొరేష‌న్ నిధుల‌ను పంచుకుంటాయి. శ్రీవారి హుండీ ఆదాయం మీద క‌న్నేయ‌డం వ‌ల్లనేమో? రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న త‌ర‌ఫున గానీ, స్థానిక కార్పొరేష‌న్ త‌ర‌ఫు నుంచి గానీ ఒక్క రూపాయి కూడా స్మార్ట్ సిటీ కోసం విదిలించ‌లేదు. దీనికి సంబంధించిన జీవోలు కూడా ఏనాడూ విడుద‌ల కాలేదు. స్మార్ట్ సిటీ ఖ‌ర్చు భారం మొత్తం టీటీడీ మీదే ప‌డింద‌ని అధికారులు చెబుతున్నారు. ప్ర‌భుత్వ వంతుగా, స్థానిక కార్పొరేష‌న్ వాటాగా రావాల్సిన నిధులు రావ‌ట్లేద‌ని అంటున్నారు. ఫ‌లితంగా- స్మార్ట్ సిటీకి అయ్యే ఖ‌ర్చు మొత్తాన్ని హుండీ నుంచి బ‌ద‌లాయించాల్సి వ‌స్తోంద‌ని అధికారులు వాపోతున్నారు. ప‌లుమార్లు ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ‌ల దృష్టికి తీసుకెళ్లిన‌ప్ప‌టికీ.. ఫ‌లితం రాలేద‌ని చెబుతున్నారు. పాల‌క మండ‌లే దీన్ని అడ్డుకుంటోంద‌ని అధికారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

రూ.500 కోట్లు ఎక్క‌డ‌? రూ.79 కోట్ల ఎక్క‌డ‌?

రూ.500 కోట్లు ఎక్క‌డ‌? రూ.79 కోట్ల ఎక్క‌డ‌?


ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం నాటికి ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయ‌లేమ‌ని అంటున్నారు. 500 కోట్ల రూపాయ‌ల‌కు పైగా మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సి ఉండ‌గా.. దాన్ని కేవ‌లం 79 కోట్లకే ప‌రిమితం చేయ‌డం ప‌ట్ల టీటీడీ సిబ్బందిలోనూ ఆందోళ‌న వ్య‌క్త‌మౌతోంది. వివిధ బ్యాంకుల్లో టీటీడీ బోర్డు పేరు మీద సుమారు 10 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. దీనికి వ‌డ్డీ రూపంలో సుమారు 900 కోట్ల రూపాయ‌లు అందుతున్నాయి. అలాంటిది ఈ మొత్తానికంత‌టికీ కోత ప‌డిన‌ట్ట‌యింద‌ని, భ‌విష్య‌త్తులో అవ‌స‌రాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ల‌ను కూడా వినియోగించుకోవాల్సిన దుస్థితి వ‌స్తుందేమోన‌ని చెబుతున్నారు అక్క‌డి సిబ్బంది. తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలోనే ఈ ప‌రిస్థితి దాపురిస్తుంద‌ని టీటీడీ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ.. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌తీసారీ టీటీడీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంద‌ని చెబుతున్నారు.

English summary
Prestigious Board Tirumala Tirupathi Devasthanam drastically reduced the amount of Fixed Deposits, which is came by Lord Balaji's Hundi. TTD Board Rules says, Totally or, at least 60 percent of amount came by the Hundi should be deposit as Fixed in various Nationalized Banks. But, TTD drastically reduced the amount. In 2016-17 Financial Year, TTD Fixed deposited the amount Rs 475 Crores against Rs. 757 Cr. In the Next FY 2017-18, TTD Fixed deposited the amount of Rs.268 Crores against Rs.533 Cr. Now, This Financial Year, the amount limited at only Rs. 79 Crores against Rs. 516 Crore. This will be raises eyebrows of the devotees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X