తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్: టీటీడీలో తొలి కరోనా మరణం: శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు కన్నుమూత:

|
Google Oneindia TeluguNews

తిరుపతి: పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలను ప్రాణాంతక కరోనా వైరస్ కమ్మేసింది. 160 మందికి పైగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, సిబ్బంది, శ్రీవారి ఆలయ అర్చకులు కరోనా వైరస్ బారిన పడిన వేళ.. తొలి మరణం నమోదైంది. శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకుడిని కరోనా బలి తీసుకుంది. వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

Recommended Video

Tirumala Darshans Should Stop : Ramana Deekshitulu - ఆపాల్సిన అవసరం ఏముంది ? YV Subba Reddy
ఆలయంలో భక్తుల ప్రవేశంపై వివాదం నడుస్తోన్న వేళ..

ఆలయంలో భక్తుల ప్రవేశంపై వివాదం నడుస్తోన్న వేళ..


కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. శ్రీవారి ఆలయంలో భక్తులకు కల్పిస్తోన్న దర్శనాలపై టీటీడీ అధికారులు, ఆలయ అర్చకుల మధ్య విభేదాలు నడుస్తోన్న ప్రస్తుత సమయంలో.. మాజీ ప్రధాన అర్చకుడు మరణించడం సంచలనం రేపుతోంది. దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. భక్తులకు కల్నిస్తోన్న శ్రీవారి దర్శనాలపై టీటీడీ అధికారులు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయి.

నిర్బంధ పదవీ విరమణ చేసి..

నిర్బంధ పదవీ విరమణ చేసి..

శ్రీనివాస దీక్షితులు.. 2018లో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమితులు అయ్యారు. పుట్టా సుధాకర్ యాదవ్ సారథ్యంలోని అప్పటి టీటీడీ పాలక మండలి ఆయనను ప్రధాన అర్చకుడిగా నియమించింది. ఆలయంలో పింక్ డైమండ్, శ్రీవారి పోటులో తవ్వకాలు, రాయలవారి నగలు మాయం అయ్యాయంటూ అప్పట్లో వివాదాస్పద ప్రకటనలను చేసిన నాటి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుతో సహా శ్రీనివాసమూర్తి దీక్షితులు నిర్బంధ పదవీ విరమణను ఎదుర్కొన్నారు.

65 సంవత్సరాల నిబంధనతో తప్పనిసరి పదవీ విరమణ..

65 సంవత్సరాల నిబంధనతో తప్పనిసరి పదవీ విరమణ..


65 సంవత్సరాలు నిండిన అర్చకులకు నిర్బంధ పదవీ విరమణ నిబంధనను అప్పటి పాలక మండలి అమలు చేయడం ద్వారా రమణ దీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నరసింహ దీక్షితులు, నారాయణ దీక్షితులు ప్రధాన అర్చక హోదా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కొంతకాలంగా శ్రీనివాసమూర్తి దీక్షితులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీనితో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈ ఉదయం కన్నుమూశారు.

కరోనా నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు..

కరోనా నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు..

ఆయన భౌతిక కాయాన్ని టీటీడీ సంప్రదాయాల ప్రకారం.. అంత్యక్రియలను నిర్వహించాల్సి ఉండగా.. కరోనా నిబంధనలు అడ్డుపడుతున్నాయి. ఆయన భౌతికకాయాన్ని చివరికి కుటుంబ సభ్యులకు కూడా అప్పగించే పరిస్థితి లేదు. కరోనా వైరస్ సోకి మరణించిన వారి మృతదేహాలను ఖననం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే అంత్యక్రియలను చేపడతారు. శ్రీనివాసమూర్తి దీక్షితులు మరణం పట్ల టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దిగ్భ్రాంతినిక వ్యక్తం చేశారు.

English summary
Tirumala Tirupati former head priest Srinivasa Murthy Deekshitulu dies of Coronavirus on Monday. He was appointed as principle priest for TTD in 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X