తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు: టీటీడీ సంచలన నిర్ణయం

|
Google Oneindia TeluguNews

తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. తిరుమలేశుడి దర్శనం కోసం గంటల కొద్దీ వేచి ఉంటోన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తోన్నారు.

వరుస సెలవులతో..

వరుస సెలవులతో..

భక్తుల రద్దీ భారీగా పెరగడానికి వరుస సెలవులు కారణం అయ్యాయి. వారాంతపు రోజులు దీనికి తోడయ్యాయి. శని, ఆది, సోమవారాల్లో వరుసగా సెలవులు ఉండటం వల్ల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. వరుస సెలవులను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారులు స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అటు దక్షిణమధ్య రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు.

కంపార్ట్‌మెంట్లు రద్దీ..

కంపార్ట్‌మెంట్లు రద్దీ..

తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్లన్ని కిటకిటలాడుతున్నాయి. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో క్యూలైన్లల్లో వందలాదిమంది భక్తులు వేచి ఉన్నారు. గోగర్భం డ్యామ్ వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉంటోన్నారు. ఈ నెల పొడవునా ఇదే పరిస్థితి ఉండొచ్చని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా తక్షణ నిర్ణయాలను తీసుకుంటోన్నారు.

 సర్వదర్శనానికి 30 గంటలు..

సర్వదర్శనానికి 30 గంటలు..

శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పట్టే పరిస్థితి ఏర్పడిందంటే.. శ్రీవారి దర్శనానికి భక్తల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ నెల 21వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలు ఉండబోవని స్పష్టం చేశారు. వీఐపీల సిఫారసు లేఖలపై ఈనెల 21 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు చెప్పారు.

రూ.4 కోట్లకు పైగా..

రూ.4 కోట్లకు పైగా..

కాగా- శనివారం ఒక్కరోజే 83,422 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 50,100 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఒక్కరోజే 50 వేలమందికి పైగా భక్తులు తలనీలాలను సమర్పించుకోవడానికి రావడంతో అటు కల్యాణకట్ట కూడా క్రిక్కిరిసిపోయింది. ఇక మరోసారి శ్రీవారికి హుండీ రూపంలో భారీ ఆదాయం లభించింది. ఒక్కరోజే 4.27 కోట్ల రూపాయల ఆదాయం అందింది.

రికార్డుస్థాయి హుండీ రెవెన్యూ..

రికార్డుస్థాయి హుండీ రెవెన్యూ..


కిందటి నెలలో హుండీ ద్వారా మాత్రమే 139.45 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందిన విషయం తెలిసిందే. హుండీ ద్వారా ఈ స్థాయిలో రెవెన్యూ రావడం తిరుమల చరిత్రలో అదే తొలిసారి. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా కోట్ల రూపాయల మేర రాబడి సాధించింది. కోట్లాదిమంది భక్తులు శ్రీవారికి హుండీ ద్వారా సమర్పించే కానుకల విలువ కొన్ని నెలలుగా 100 కోట్ల రూపాయల మార్క్‌ను అధిగమిస్తోంది. జులైలో అది మరింత పెరిగింది.

English summary
TTD has cancelled VIP Break darshan at hill shrine Tirumala till August 21 due to an unprecedented pilgrim rush due to the series of holidays.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X