తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా: తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం: పూర్తి వివరాలివే..

|
Google Oneindia TeluguNews

తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలలో వెలిసిన శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదలైంది. శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఉన్న ఆస్తులపై ఓ పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల కావడం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పటిదాకా ఎప్పుడూ ఆ శ్రీనివాసుడి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల కాలేదు. స్వామివారి ఆస్తిపాస్తుల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని టీటీడీ భావించింది. భక్తులు సమర్పించిన కానుకలపై పారదర్శకంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొద్దిసేపటి కిందటే ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.

Aung San Suu Kyi: నిర్బంధం నుంచి జైలుకు: మాజీ అధ్యక్షుడికీ కారాగార శిక్షAung San Suu Kyi: నిర్బంధం నుంచి జైలుకు: మాజీ అధ్యక్షుడికీ కారాగార శిక్ష

విమర్శలు, వివాదాలకు చెక్..

విమర్శలు, వివాదాలకు చెక్..

భక్తులు సమర్పించిన కానుకలపై పారదర్శకంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రెండు పేజీల శ్వేతపత్రాన్ని ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కొద్దిసేపటి కిందటే దీన్ని విడుదల చేశారు. శ్రీవారి ఆస్తులపై ఇదివరకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన వివాదానికి టీటీడీ పాలక మండలి చెక్ పెట్టినట్టయింది. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం.. ఈ శ్వేతపత్రాన్ని రూపొందించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

శ్రీవారి పేరు మీద ఉన్న మొత్తం ఆస్తులు..

శ్రీవారి పేరు మీద ఉన్న మొత్తం ఆస్తులు..

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న మొత్తం ఆస్తుల సంఖ్య 1,128. మొత్తంగా 8,088 ఎకరాల 89 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. దీన్ని వ్యవసాయం, వ్యవసాయేతర భూములు స్థలాలుగా విభజించింది. వ్యవసాయ అవసరాల కోసం వినియోగిస్తోన్న సంఖ్య 233. ఇందులో 2,085 ఎకరాలు 41 సెంట్ల భూమి స్వామివారి పేరు మీద ఉంది. వ్యవసాయేతర ఆస్తుల సంఖ్య 895. ఈ కేటగిరీలో ఉన్న స్థలాలు 6,003 ఎకరాల 48 సెంట్లు ఉన్నట్లు టీటీడీ తన శ్వేతపత్రంలో పొందుపరిచింది.

 141 ఆస్తుల విక్రయం..

141 ఆస్తుల విక్రయం..

1974 నుంచి 2014 వరకు మొత్తంగా 141 ఆస్తులను విక్రయించినట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. మొత్తంగా 335 ఎకరాల 23 సెంట్ల స్థలాన్ని విక్రయించినట్లు పేర్కొన్నారు. ఇందులో వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే ఆస్తుల సంఖ్య 61. మొత్తంగా 293 ఎకరాల 02 సెంట్లను అమ్మేశారు. అలాగే- 42.21 సెంట్ల వ్యవసాయేతర ఆస్తులను విక్రయించారు. దీనివల్ల టీటీడీ పాలక మండలికి 6 కోట్ల 13 లక్షల రూపాయల ఆదాయం వ

గత ఏడాది నవంబర్ నాటికి ఉన్న ఆస్తులు ఇవే..

గత ఏడాది నవంబర్ నాటికి ఉన్న ఆస్తులు ఇవే..

గత ఏడాది నవంబర్ 28వ తేదీ వరకు మదింపు చేసిన ఆస్తుల సంఖ్య 987. 7,753 ఎకరాల 66 సెంట్లు టీటీడీ ఆధీనంలో ఉన్నాయి. ఇందులో 172 వ్యవసాయ అవసరాలకు వినియోగించే భూమి. మొత్తంగా 1,792.39 సెంట్ల వ్యవసాయ భూమి ప్రస్తుతం పాలక మండలి ఆధీనంలో ఉంది. 5,961 ఎకరాల 27 సెంట్ల వ్యవసాయేతర స్థలాలు టీటీడీ వద్ద ఉన్నాయి. ఈ వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి శ్వేతపత్రాన్ని www.tirumala.orgలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

English summary
TTD Releases white paper on its Properties. The white paper released by the TTD Chairman YV Subba Reddy. Check the assets and properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X