తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీటీడీ ఆదాయ, వ్యయాలు కాగ్ ద్వారా ఆడిట్ ... టీటీడీ సంచలన నిర్ణయం.. బీజేపీ ఎంపీ హర్షం

|
Google Oneindia TeluguNews

తిరుమల తిరుపతి దేవస్థాన ఆదాయ వ్యయాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తో ఆడిట్ చెయ్యాలని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. టిటిడిలో జరుగుతున్న ఆడిట్ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కాగ్ ద్వారా ఆడిట్ చేయించాలని పాలకమండలి ఏపీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది . అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా దీనిపై సానుకూలంగా ఉన్నారని సమాచారం.

 స్టేట్ ఆడిట్ నిర్వహించినా .. కాగ్ తో టీటీడీ నిధుల ఆడిట్

స్టేట్ ఆడిట్ నిర్వహించినా .. కాగ్ తో టీటీడీ నిధుల ఆడిట్

2014 - 2019 మధ్య టీటీడీ నిధుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, దీనిపై కాగ్ ద్వారా ఆడిట్ జరిపించాలని ఇప్పటికే బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, సత్యపాల్ సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. 2014 నుండి 2020 వరకు స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ టిటిడి ఆదాయ వ్యయాలపై ఆడిట్ నిర్వహించింది. అయినప్పటికీ విమర్శలు వస్తున్న నేపథ్యంలో కాగ్ ద్వారా ఆడిట్ జరిపించాలని పాలకమండలి ప్రభుత్వాన్ని కోరింది.

 ఆరోపణల నేపధ్యంలో కాగ్ ఆడిట్ కు పాలకమండలి తీర్మానం

ఆరోపణల నేపధ్యంలో కాగ్ ఆడిట్ కు పాలకమండలి తీర్మానం


గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రాజకీయ సభల నిర్వహణకు టీటీడీ నిధులను దారి మళ్లించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఈ నేపధ్యంలో టీటీడీ ఆదాయ వ్యయాలపై పారదర్శకత కోసం , అవినీతి రహిత పాలన కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు గా టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కాగ్ ద్వారా ఆడిట్ జరిపిస్తే భక్తులలో కూడా టిటిడి ఆదాయ వ్యయాలపై ఒక క్లారిటీ ఉంటుందని , భక్తులకు విశ్వాసం కల్పించటానికి అవకాశముంటుందని పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు.

టీటీడీ ఆదాయ వ్యయాలపై కాగ్ తో ఆడిట్ పై ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి హర్షం

టీటీడీ ఆదాయ వ్యయాలపై కాగ్ తో ఆడిట్ పై ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి హర్షం

మరోవైపు కాగ్ తో టీటీడీ ఆడిట్ జరిపించాలన్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయమని బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు .ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని , టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డిని అభినందించారు. బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఉన్న ఐదేళ్లలో టీటీడీలో నిధుల దుర్వినియోగం జరిగిందని, వ్యయానికి ఆడిట్ చేయించడంతో పాటు, భవిష్యత్తులో కూడా అదే విధంగా కాగ్ తో ఆడిట్ చేయించాలని కోరారు.

Recommended Video

Sadineni Yamini పై కేసు వేసిన TTD అధికారులు.. కారణం ఇదే!!
 కాగ్ ఆడిట్ పై సానుకూలంగా ఏపీ సర్కార్ .. పారదర్శక పాలనే లక్ష్యం

కాగ్ ఆడిట్ పై సానుకూలంగా ఏపీ సర్కార్ .. పారదర్శక పాలనే లక్ష్యం

టీటీడీ ఆదాయ వ్యయాలన్నీ పూర్తి పారదర్శకంగా ఉండాలని, టీటీడీకి దాతలు, భక్తులు ఇస్తున్న విరాళాలు, స్వామివారికి చెల్లించుకున్న ముడుపులు లెక్కల నిర్వహణ సక్రమంగా ఉండాలని ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి . ఈ నేపథ్యంలోనే ఆగస్టు 28న సమావేశమైన టీటీడీ పాలకమండలి ఆదాయ వ్యయాలను కాగ్ తో ఆడిట్ చేయించడానికి తీర్మానాన్ని ఆమోదించింది. కాగ్ తో ఆడిట్ కోసం తీర్మానప్రతిని ప్రభుత్వానికి పంపింది. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నారని, పారదర్శక, అవినీతి రహిత పాలన పట్ల సిఎం ఎంతో నిబద్ధతతో ఉన్నారంటూ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి ఈ నిర్ణయం హర్షించదగిన నిర్ణయమని పలువురు పేర్కొన్నారు.

English summary
TTD has made a sensational decision to audit the revenue expenditure of the Tirumala Tirupati Temple with the Comptroller and Auditor General. The governing body recommended to the AP government that the audit be conducted by the CAG in the wake of criticism over the ongoing audit in TTD. However, Chief Minister Jagan Mohan Reddy is also reported to be positive about this. BJP MP Subramanian Swami hailed the decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X