• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేంద్రం ఆధీనంలో టీటీడీ నిధులు: కాగ్ ద్వారా ఆడిట్‌కు సన్నాహాలు: ముహూర్తం కూడా ఫిక్స్?

|

తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల.. క్రమంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం బ్యాంకు అకౌంట్లు, నిధులను ఆడిట్ జరిపించడానికి జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. టీటీడీ అకౌంట్లను కాగ్ ద్వారా ఆడిట్ జరిపిస్తామంటూ ప్రభుత్వం ఇదివరకే ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇక కాగ్ ద్వారా ఆడిట్ జరిపించడానికి ముహూర్తం కూడా కుదిరినట్లు చెబుతున్నారు.

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్: ఇక వర్చువల్ ప్లాట్‌ఫామ్‌పై: ప్రయోగాల దిశగా టీటీడీ

నిధుల దారి మళ్లింపు ఆరోపణలపై..

నిధుల దారి మళ్లింపు ఆరోపణలపై..

తిరుమల తిరుపతి దేవస్థానం సహా కొన్ని ప్రముఖ ఆలయాలకు వివిధ రూపాల్లో వచ్చే ఆదాయ వ్యవయాలపై కాగ్ ద్వారా ఆడిట్ జరిపించాలనే డిమాండ్‌ను సుబ్రహ్మణ్యస్వామి చాలాకాలం నుంచి వినిపిస్తూ వస్తున్నారు. ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆలయాల నిధులను దారి మళ్లించినట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ధర్మపోరాట దీక్ష, నవనిర్మాణ దీక్ష వంటి పార్టీ కార్యక్రమాల కోసం ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను మళ్లించినట్లు వచ్చిన వార్తలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ సుబ్రహ్మణ్య స్వామి 2018లోనే ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు..

అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు..

విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులను పంపించింది. 2019 తరువాత ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం.. దానికి సమాధానం ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు, అకౌంట్లపై కాగ్ ద్వారా ఆడిట్ జరిపించడానికి కట్టుబడి ఉన్నామంటూ అఫిడవిట్‌ రూపంలో బదులు ఇచ్చింది. తాజాగా- దాన్ని అమలు చేయడానికి జగన్ సర్కార్ సన్నహాలు చేపట్టినట్లు చెబుతున్నారు. దీనికి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి..

కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి..

ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన ఆరంభం కాబోయే 2021-2022 ఆర్థిక సంవత్సరంలో టీటీడీ నిధులు, బ్యాంకు అకౌంట్లపై కాగ్ ఆడిట్ జరిపించడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రతి త్రైమాసికానికి సంబంధించి.. టీటీడీకీ భక్తుల నుంచి అందిన విరాళాలు, కానుకలకు సంబంధింంచిన నివేదికలను కాగ్‌కు అందజేసేలా ఏర్పాట్లు చేయబోతోన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న తప్పులను తమ ప్రభుత్వ హయాంలో అవకాశం ఇవ్వకూడదని జగన్ సర్కార్ కృతనిశ్చయంతో ఉన్నట్లు చెబుతున్నారు.

తిరుమల సహా మరిన్ని..

తిరుమల సహా మరిన్ని..

తిరుమల సహా మరి కొన్ని ప్రముఖ ఆలయాలను ఈ జాబితాలో చేర్చవచ్చని తెలుస్తోంది. భక్తుల నుంచి అందే విరాళాలు, హుండీ కానుకలు, టికెట్లు, తీర్థ ప్రసాదాలను విక్రయించడం, అద్దె లేదా లీజుల రూపంలో వచ్చే రాబడి.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని.. ఏటా కోట్లాది రూపాయల మేర ఆదాయం వచ్చే ప్రధాన ఆలయాలను ఈ జాబితాలో చేర్చవచ్చని అంటున్నారు. తిరుమలతో పాటు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వంటివి ఉంటాయని తెలుస్తోంది.

  Andhra Pradesh Deputy CM Responds On MLA Roja Crying Issue | Oneindia Telugu

  English summary
  BJP MP Subramanian Swamy says that the AP governement headed by Chief Minister YS Jagan Mohan Reddy has informed the High Court by affidavit on Notice in his PIL that all future TTD temple annual accounts will be audited by CAG.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X