• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

TTD: కల్యాణ మండపాలు ఎందుకు లీజుకు ఇస్తున్నారో పక్కా క్లారిటీ ఇచ్చిన టీటీడీ, తప్పుడు ప్రచారం చేస్తే !

|

తిరుమల/ తిరుపతి: హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా భ‌క్తులు అతి చేరువ‌లో స్వామివారి సేవ చేసుకునే భాగ్యం క‌ల్పించ‌డం కోసం, వినియోగం మెరుగుప‌డే దిశ‌గా టీటీడీ క‌ల్యాణ‌మండ‌పాలు లీజుకు ఇవ్వాల‌ని తీసుకున్న‌ నిర్ణ‌యంపై కొంద‌రు అవాస్త‌వ ఆరోప‌ణ‌లు చేసి భ‌క్తుల మ‌నోభావాల‌తో ఆడుకునే పద్ధ‌తి మానుకోవాల‌ని టీటీడీ హిత‌వు పలికింది. వినియోగంలో లేని టీటీడీ క‌ల్యాణ‌మండ‌పాలు, భ‌వ‌నాలు, భూముల‌ను లీజుకు ఇచ్చే ప్రక్రియ ఈనాటిది కాదని టీటీడీ వివరణ ఇచ్చింది. శ్రీవెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ప్రవర్తించే వారిని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.

TTD: టీటీడీ ఆధ్వర్యంలో మైసూరు దత్తపీఠంలో చతుర్వేద హవనం, శ్రీవారు అవతరించిన శ్రావణ మాసంలో !TTD: టీటీడీ ఆధ్వర్యంలో మైసూరు దత్తపీఠంలో చతుర్వేద హవనం, శ్రీవారు అవతరించిన శ్రావణ మాసంలో !

 జీఓ నెంబర్ తో సహ వివరించిన టీటీడీ

జీఓ నెంబర్ తో సహ వివరించిన టీటీడీ

టీటీడీ ఆస్తులను వినియోగంలోకి తేవ‌డంతోపాటు సంర‌క్షించుకోవ‌డం కోసం జీఓఎంఎస్‌. నెంబ‌రు : 311- ( తేది 09-04-1990), రూల్ నంబ‌రు 138 ప్ర‌కారం కొన్నేళ్లుగా టీటీడీ లీజు విధానాన్ని అమ‌లు చేస్తోందని టీటీడీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా టిటిడికి చెందిన 29 క‌ల్యాణ మండ‌పాలు హిందూ ధార్మిక సంస్థ‌లు, ఆల‌యాలు, ట్ర‌స్టులు, హిందూ మ‌తానికి చెందిన వ్య‌క్తుల‌కు ఇదివ‌ర‌కే లీజుకు ఇవ్వ‌డం జ‌రిగిందని టీటీడీ గుర్తు చేసింది. వీటి నిర్వ‌హ‌ణ‌, నిబంధ‌న‌ల అమ‌లుకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.

 365 రోజులు వినియోగంలో ఉండాలని

365 రోజులు వినియోగంలో ఉండాలని

దేశ‌వ్యాప్తంగా టీటీడీ ఆస్తుల వినియోగం మెరుగుప‌ర‌చ‌డం, భ‌క్తుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు అందుబాటులో ఉంచ‌డానికి ఈ లీజు ప్ర‌క్రియ చేప‌ట్ట‌డం జ‌రిగిందని టీటీడీ స్పష్టం చేసింది. ఇందులో ముఖ్యంగా 365 రోజులు క‌ల్యాణ‌మండ‌పాల వినియోగం ఉండేలా, హిందూధ‌ర్మ‌ప్ర‌చారానికి వేదిక‌లుగా క‌ల్యాణ‌మండ‌పాల‌ను భ‌క్తుల వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌డానికి ఈ ప్ర‌క్రియ దోహ‌ద‌ప‌డుతుందని టీటీడీ తెలిపింది.

 మేధావులతో ప్రత్యేక కమిటీ

మేధావులతో ప్రత్యేక కమిటీ

టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఏ విధంగా ఉప‌యోగంలోకి తేవాల‌నే అంశంపై ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి సుదీర్ఘంగా చ‌ర్చించి మేధావుల‌తో క‌మిటీ ఏర్పాటు చేసింది. ఇందులో గౌహ‌తి హైకోర్టు మాజీ యాక్టింగ్‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ కెఎస్‌.శ్రీ‌ధ‌ర్‌రావు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ మంధాట సీతారామ‌మూర్తి, శృంగేరి శార‌దాపీఠం ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి డా. విఆర్‌.గౌరీశంక‌ర్‌, టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ కృష్ణ‌మూర్తి వైద్య‌నాథ‌న్‌, ప్ర‌త్యేక ఆహ్వానితులు శ్రీ గోవింద‌హ‌రి, సోష‌ల్ రీఫార్మ‌ర్ మెంబ‌ర్ శ్రీ బ‌య్యా శ్రీ‌నివాసులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు డాక్ట‌ర్ కొండుభ‌ట్ల రామ‌చంద్ర‌మూర్తి స‌భ్యులుగా ఉన్నారు. ఈ క‌మిటీ టీటీడీ ఆస్తుల జాబితాను ప‌రిశీలించి వినియోగంలో లేని ఇలాంటి అనేక క‌ల్యాణ‌మండ‌పాలతోపాటు, భ‌వ‌నాలు, భూములను కూడా వినియోగంలోకి తేవాల‌ని సిఫార‌సు చేసిందని టీటీడీ గుర్తు చేసింది.

ఎందుకు లీజుకు ఇస్తున్నారంటే !

ఎందుకు లీజుకు ఇస్తున్నారంటే !

ఈ సిఫార‌సుల‌పై ధ‌ర్మక‌ర్త‌ల మండ‌లి విస్తృతంగా చ‌ర్చించి వినియోగంలో లేని టీటీడీ ఆస్తులు ఆక్ర‌మ‌ణ‌ల‌కు, అసాంఘిక కార్య‌క్ర‌మాల‌కు నిల‌యాలుగా మార‌కూడ‌ద‌నే ఉద్దేశంతో క‌ఠిన నిబంధ‌న‌లు రూపొందించి లీజుకు ఇవ్వ‌డానికి ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు నిబంధ‌న‌లు త‌యారుచేసి క‌ల్యాణ‌మండ‌పాల లీజుకు సంబంధించి నోటిఫికేష‌న్ ఇవ్వ‌డం జ‌రిగింది. హిందూ ధార్మిక సంస్థ‌లు, ఆల‌యాలు, ట్ర‌స్టులు, హిందూ మ‌తానికి చెందిన వ్య‌క్తుల‌కు మాత్ర‌మే వీటిని లీజుకు ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

హిందువులకు మాత్రమే అవకాశం

హిందువులకు మాత్రమే అవకాశం

వీటిలో హిందూ మ‌తానికి చెందిన వివాహాలు, అన్న‌ప్రాస‌న, ఉప‌న‌య‌నం, బార‌సాల‌, ష‌ష్టిపూర్తి, స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తం వంటి హిందూ మ‌తానికి చెందిన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకోవ‌డానికి మాత్ర‌మే అనుమ‌తించ‌డం జ‌రిగింది. నిబంధ‌న‌ల అమ‌లు ప‌ర్య‌వేక్ష‌ణ కోసం టీటీడీలోని అధికారుల‌తో నాలుగు టాస్క్‌ఫోర్స్ టీమ్ లు ఏర్పాటుచేయ‌డం జ‌రిగింది. ఈ క‌ల్యాణ‌మండ‌పాలు వినియోగంలోకి తెస్తే త‌మ‌కు అందుబాటులో ఉండి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకోవ‌డం కోసం ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఎంతోమంది భ‌క్తులు త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

 టీటీడీ ధర్మకర్తల మండలికి ఆ అధికారం ఉంది

టీటీడీ ధర్మకర్తల మండలికి ఆ అధికారం ఉంది


క‌ల్యాణ‌మండ‌పాలు లీజుకు ఇచ్చి వాటి ద్వారా ఆదాయం పొందాల‌నే ఉద్దేశం టీటీడీకి లేదు. టీటీడీకి సంబంధించి వినియోగంలో లేని ఆస్తులు వినియోగంలోకి తేవ‌డం, వాటిని ప‌రిర‌క్షించ‌డంతోపాటు సంస్థ‌కు మేలు జ‌రిగే మ‌రియు భ‌క్తుల మ‌నోభావాలు సంర‌క్షించ‌డం కోసం ఎలాంటి నిర్ణ‌య‌మైనా తీసుకునే అధికారం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లికి ఉంది.

మరో కోణంలో చూడకూడదని టీటీడీ మనవి

మరో కోణంలో చూడకూడదని టీటీడీ మనవి

ఇటువంటి నిర్ణ‌యం తీసుకున్న త‌రుణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న టీటీడీ యాజ‌మాన్యం కేవ‌లం భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా ఉండ‌డం కోస‌మే ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తున్నామని టీటీడీ తెలిపింది. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆస్తులు ప‌రిర‌క్షించి, హిందూ మతానికి చెందిన ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగప‌డేలా చేయ‌డం కోసం జ‌రుపుతున్న మంచి ప్ర‌య‌త్నాన్ని మ‌రో కోణంలో చూడ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నామని టీటీడీ తెలిపింది.

పక్కా క్లారిటీ ఇచ్చిన టీటీడీ

పక్కా క్లారిటీ ఇచ్చిన టీటీడీ

ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఛైర్మ‌న్‌, అధికారుల స‌మ‌ర్థ‌త‌ను త‌క్కువ చేసేలా అరోప‌ణ‌లు చేయ‌డాన్ని ఖండిస్తున్నాం. హిందూయేత‌రులు ఈ లీజు ద్వారా క‌ల్యాణ‌మండ‌పాలు పొంది ఇత‌ర మ‌తాల‌కు చెందిన కార్య‌క్ర‌మాలు, అసాంఘిక కార్య‌క్ర‌మాలు చేస్తే ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని కొంద‌రు ఆరోప‌ణ‌లు చేశారు. బాధ్య‌తాయుత ప‌ద‌వుల్లో ఉన్న‌వారు సోష‌ల్ మీడియా, ప‌త్రిక‌ల్లో వ‌చ్చే స‌మాచార‌మే పూర్తిగా నిజ‌మ‌ని న‌మ్మి వాస్త‌వాలు తెలుసుకోకుండా ధార్మిక సంస్థ మీద అవాస్త‌వ ఆరోప‌ణ‌లు చేయ‌డం వారిస్థాయికి త‌గ‌ని ప‌ని. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి లీజు నిబంధ‌న‌లు చ‌దివి అర్థం చేసుకోగ‌లిగితే ఇలాంటి చౌక‌బారు ఆరోప‌ణ‌ల‌కు దిగ‌జార‌రని తెలియ‌జేస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది.

English summary
TTD: The TTD management has announced to lease out its kalyana mandapams to like-minded Hindu religious organisations for a period of five years. TTD detailed clarification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X