• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుమల ఆలయ చరిత్రలోనే ఎప్పుడూ ఇలా జరగలేదు: తొలిసారిగా: గోవిందుడి నామస్మరణతో

|

తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల సరికొత్త శోభను సంతరించుకుంది. గోవిందుడి నామస్మరణతో మారుమోగిపోతోంది. తిరుమల ఆలయ చరిత్రలో ఇప్పటిదాకా ఎప్పుడూ లేనివిధంగా తొలిసారిగా ఉత్తరద్వారాన్ని 10 రోజుల పాటు తెరచి ఉంచనున్నారు. భక్తులకు ఉత్తరద్వార దర్శనం గుండా శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే భాగ్యాన్ని కల్పించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులకు పరిమితంగా దర్శనానికి అనుమతి ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ సంఖ్యను పెంచారు.

  TTD - Vaikunta Ekadasi 2020 : 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం... టీటీడీ కొత్త రూల్స్ : TTD EO

  వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

  రోజూ 20 వేల మందికి..

  రోజూ 20 వేల మందికి..

  రోజూ 20 వేలమంది భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. తెల్లవారు జామున 3:30 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం ప్రారంభమైంది. ఉత్తర ద్వారం గుండా భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకుంటున్నారు. శుక్ర‌వారం అర్ధరాత్రి దాటిన తరువాత 12.05 గంటల నుంచి ఒకటిన్నర వరకు తిరుప్పావైని నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారిని తిరుప్పావైతో మేల్కొలపడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు.

  నిజపాద దర్శనం రద్దు..

  నిజపాద దర్శనం రద్దు..

  2.30 గంట‌ల వ‌ర‌కు ఏకాంతంగా అభిషేకించారు. ఈ సందర్భంగా స్వామివారి నిజ‌పాద ద‌ర్శ‌నాన్ని రద్దు చేశారు. అభిషేకానంతరం ఏకాంతంగా తోమాల సేవ‌, అర్చ‌న నిర్వ‌హించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ ఉదయం 9 గంటలకు శ్రీవారిని బంగారు రథంపై ఊరేగించనున్నారు. 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగుతారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవను నిర్వహిస్తారు.

   రేపు చక్రస్నానం..

  రేపు చక్రస్నానం..

  అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో క‌లిసి తిరుచ్చిపై నాలుగుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. శనివారం వైకుంఠ ద్వాదశి పర్వదినం సందర్భంగా చక్రస్నానం నిర్వహిస్తారు. తెల్లవారు జామున 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు శ్రీ చక్రత్తాళ్వార్లను నాలుగుమాడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. వరాహస్వామి ఆలయం చెంత గ‌ల‌ స్వామివారి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు.

  ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

  ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

  వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల నేప‌థ్యంలో ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేశారు. గురు, శుక్ర, శనివారాల్లో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత‌సేవ‌ల‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. 3వ తేదీ వరకు ఉత్తరద్వార దర్శనాన్ని కల్పించడానికి అవసరమైన టికెట్లను ఇదివరకే విక్రయించారు. రోజూ 20 వేల మంది భక్తులకు అనుమతి ఇచ్చారు.

  సర్వదర్శనం టోకెన్లు లభించే కేంద్రాలివే..

  సర్వదర్శనం టోకెన్లు లభించే కేంద్రాలివే..

  సర్వదర్శనం టోకెన్లను తిరుపతివాసులకు మాత్రమే జారీ చేయనుంది టీటీడీ. దీనికోసం తిరుపతిలో అయిదు కేంద్రాల్లో టోకెన్ కౌంటర్లను నెలకొల్పింది. మహతి ఆడిటోరియం, రామచంద్ర పుష్కరిణి, మున్సిపల్ కార్యాలయం, బైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్ పాఠశాల, ఎంఆర్ పల్లి కొత్త మార్కెట్‌లో టోకెన్లను జారీ చేస్తున్నారు. తిరుపతివాసులు తమ ఆధార్ కార్డులను చూపించి టోకెన్లను తీసుకోవచ్చు.

  English summary
  For the first time ever in the known history of Srivari temple, TTD is organising a ten-day Vaikunta Dwara Darshan to devotees commencing on Vaikunta Ekadasi day December 25 up to January 3. As part of the festivities on December 25, Tiruppavai parayanams will be held in the temple between 12.05 am and 1.30 am.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X