• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

శ్రీవారి భూములు అమ్మాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? టీటీడీని సూటిగా ప్రశ్నించిన పవన్ కళ్యాణ్..!!

|

అమరావతి/హైదరాబాద్ : ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మర్తల మండలిని టార్గెట్ చేసారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలనే టీటీడి నిర్ణయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. సోమవారం ఉదయం ట్విటర్ ద్వారా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, టి.టి.డి.కి పలు ప్రశ్నలు వర్షం కురిపించారు. స్వామి వారి భూములు అమ్మడం అంటే భక్తులను అవమానించడమేనని, ఇలాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసేముందు ప్రభుత్వం పునరాలోచించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

విష వాయువు పరిష్కారం ఎప్పుడు.?దాంతో కూడా సహజీవనం చేయమంటారా.?మరోసారి ప్రశ్నించిన పవన్..!

శ్రీవారి భూములతో చెలగాటం వద్దు.. ప్రభుత్వం పునరాలోచించాలన్న పవన్ కళ్యాణ్..

శ్రీవారి భూములతో చెలగాటం వద్దు.. ప్రభుత్వం పునరాలోచించాలన్న పవన్ కళ్యాణ్..

శ్రీవారి ఆస్తుల అమ్మకాల అంశంలో తిసుకున్న నిర్ణయం పట్ల అన్ని హిందూ ధార్మిక సంఘాలు, సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానం వైపు తమ దృష్టి సారిస్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సంపన్నమైన ధార్మిక సంస్థ అయిన టి.టి.డి. ఒక మంచి ఉదాహరణగా మిగిలిపోయే ఉత్తమ విధానాలతో ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలవాలి గాని అవే సంస్థలు విస్మయాన్ని వ్యక్తం చేసే కార్యక్రమాలు చేయకూడదని. అందుకు ప్రభుత్వం తరుపున సహకారం అందించకూడదని పవన్ కళ్యాణ్ సూచించారు. ఒకవేళ టి.టి.డి. తమ భూములను అమ్మిన క్రమంలో ఆ ప్రక్రియ గతంలో ఎన్నడూలేని ఒక చెడు సంప్రదాయంగా మారి, ఇతర హిందూ ధార్మిక సంస్థలు కూడా దీన్నే ప్రామాణికంగా తీసుకొని అనుసరించే ప్రమాదం ఉందని పవన్ ఆందోళన వ్యక్తం చేసారు.

ధార్మిక సంస్థలకు టిటిడి ఆదర్శంగా నిలవాలి.. ఆర్ధిక పరిపుష్టికి ఇలాంటి చర్యల వల్ల ఉపయోగం ఉండదన్న పవన్..

ధార్మిక సంస్థలకు టిటిడి ఆదర్శంగా నిలవాలి.. ఆర్ధిక పరిపుష్టికి ఇలాంటి చర్యల వల్ల ఉపయోగం ఉండదన్న పవన్..

అంతేకాకుండా, కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు, విశ్వాసాలు ఇలాంటా చర్చల వల్ల ఘోరంగా దెబ్బ తింటాయని జనసేనాని ఆవేదన వ్యక్తం చేసారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ భారీగా నష్టపోయిందని, రాజధాని నిర్మాణం కూడా అసంపూర్తిగానే మిగిలిపోయిందని, దానిపై అతిపెద్ద ప్రతిష్టంభన కొనసాగుతోందని పవన్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బలహీనం ఉందని, ఈ సందర్భంలో ఉద్యోగ కల్పన జరగాలన్నా, ఆర్థిక పరిస్థితి పుంజుకోవాలన్నా ఏపీకి పెట్టుబడిదారుల అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఉత్తమ విధానాలతో అన్ని ధార్మిక సంస్థలకు టి.టి.డి. ఆదర్శంగా నిలవాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.

శ్రీవారి ఆస్థులు అమ్మడం ఎందుకు.. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న జనసేనాని..

శ్రీవారి ఆస్థులు అమ్మడం ఎందుకు.. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్న జనసేనాని..

అంతే కాకుండా రాష్ట్రాలకు ప్రధానమైన ఆదాయ వనరు ప్రభుత్వ భూములేనని అన్నారు. భూములు ఉంటే పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చని, అలాగే భూముల ద్వారా రాష్ట్ర విలువ పెంచుకోవచ్చని, భూములు సంపదను సృష్టిస్తాయని, అందుకోసం ప్రభుత్వ ఆస్తులను ముఖ్యంగా భూములను కాపాడేందుకు, వాటిని భద్రంగా చూసుకొనేందుకు ఉన్న అన్ని మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితులలో వైయస్సార్ సీపీ ప్రభుత్వం టి.టి.డి.కి భూముల అమ్మకాలకు అనుమతి ఇచ్చినట్లయితే, అది భక్తుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బ తీయడం మాత్రమే కాకుండా రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక అవకాశాలను ప్రమాదంలో పడేసే తీవ్రమైన తప్పిదంగా మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేసారు పవన్ కళ్యాణ్.

టిటిడి భూములను ఎందుకు అమ్ముతోంది.. తెలుసుకొనే హక్కు భక్తులకుందన్న పవన్ కళ్యాణ్..

టిటిడి భూములను ఎందుకు అమ్ముతోంది.. తెలుసుకొనే హక్కు భక్తులకుందన్న పవన్ కళ్యాణ్..

ఇదిలా ఉండగా టీటీడికి స్వామివారి భూములను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఉన్న భూములను లీజుకు ఇవ్వడం ద్వారా కానీ లేదా వాణిజ్య పరమైన అవసరాలకు ఉపయోగించే విధంగా గానీ అభివృద్ధి చేసి, యాజమాన్య హక్కులు పోగొట్టుకోకుండా ఆదాయవనరులు పొందేందుకు టి.టి.డి. ఎందుకు ప్రయత్నం చేయలేకపోతోందని పవన్ కళ్యాణ ప్రశ్నిచారు. ఈ భూముల అమ్మకాల ద్వారా టిటిడి ఎంత వరకు ఆర్ధిక పరిపుష్టి సాధిస్తుందో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ నిలదీసారు. అంతే కాకుండా ఈ భూములను అమ్మడం ద్వారా టిటిడి తన ధార్మిక లక్ష్యాలకు, విలువలకు అదనంగా చేరువయ్యే అంశం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. కోట్లాదిమంది భక్తుల ద్వారా, ప్రజల ద్వారా టి.టి.డి.కి భారీగా విరాళాలు అందుతున్నాయి. టిటిడి తమ భూములను ఎందుకు అమ్మి వేస్తోందో తెలుసుకొనే హక్కు భక్తులకు ఉందన్నారు పవన్.

English summary
Janasena chief Pawan Kalyan, who is constantly blaming government policies, has recently targeted the Tirumala Tirupati Temple, a board of trustees. Janasena president Pawan Kalyan has reacted strongly to the TTD's decision to sell their assets by auctioning off Tirumala Sri Venkateswara Swamy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more