తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్! సమర్థత లేకుంటే దిగిపోండి.. ఎన్నికలకు వెళ్లండి: రైతు బజార్‌లో పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Pawan Kalyan Challenges AP CM Jagan For Re Elections || Oneindia Telugu

తిరుపతి: రాయలసీమలో పర్యటన కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుపతిలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన రాయలచెరువు రోడ్డులోని రైతు బజార్‌ను సందర్శించారు. అక్కడ రైతులు, ప్రజలతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఉల్లి ధరలు పెరగడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు ప్రజలు ఆయనకు తెలిపారు.
నాణ్యమైన ఉల్లి సరఫరా లేకనే ధరలు పెరిగాయని విక్రయదారులు చెప్పారు.

తెలుగు సినీ హీరోలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు: జగన్ సర్కారుకు హెచ్చరికతెలుగు సినీ హీరోలపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు: జగన్ సర్కారుకు హెచ్చరిక

ప్రభుత్వ వైఫల్యమే..

ప్రభుత్వ వైఫల్యమే..

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లతాడుతూ.. రూ. 20 ఉండే ఉల్లి ఇప్పుడు వంద దాటడం ఏంటని ప్రశ్నించారు. ఉల్లి కష్టాలు ప్రభుత్వ వైఫల్యేమేనని అన్నారు. జగన్ సర్కారు భవంతులు కూలగొట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజల కష్టాలపై పెట్టి ఉంటే బాగుండేదని అన్నారు. ఇసుక కోసం ఎన్ని కష్టాలు పడ్డారో.. ఇప్పుడు ఉల్లి కోసం కూడా ప్రజలు అంతే కష్టపడుతున్నారని చెప్పారు. కనీసం రూ. 40కి కిలో ఉల్లి గడ్డలు లభించేటట్లయినా చేయండని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ కోరారు.

జగన్.. సమర్థత లేకపోతే దిగిపోండి..

జగన్.. సమర్థత లేకపోతే దిగిపోండి..

ప్రజలను పాలించే సమర్థత లేకపోతే అధికారం నుంచి దిగిపోయి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. భారతదేశంలో ఏమీ లేకున్నా.. రెండు ఎర్రగడ్డలు, నాలుగు పచ్చి మిర్చి ఉంటే రోజులు గడిచిపోతాయన్నారు.

లాభాలు ఎవరికి?

లాభాలు ఎవరికి?

పండించే రైతుకు ఎలాంటి లాభం రావడం లేదని.. అలాగే కొనుగోలు చేసే ప్రజలకు కూడా కష్టంగా ఉందని.. మధ్యల ఉండేవారే లాభాలు పొందుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. రైతులు, ప్రజలు పడుతున్న కష్టాలను చూస్తుంటే ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని తెలుస్తోందని అన్నారు.

నిర్వహణ లోపం వల్లే.. రెచ్చగొట్టడం లేదు..

నిర్వహణ లోపం వల్లే.. రెచ్చగొట్టడం లేదు..

ప్రభుత్వ నిర్వహణలోపం వల్లే ఇవన్నీ సమస్యలని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నామని తెలిపారు. రెచ్చగొట్టే రాజకీయాలు చేయమని అన్నారు. జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు రాయలసీమ యువత సిద్ధమవ్వాలని పవన్ కళ్యాణ్ అన్నారు. రైతు ఆనందంగా ఉండాలని.. రైతు కడుపుకోత తీరాలని ఆయన అన్నారు.

English summary
You should Ready for Re Elections, says Pawan Kalyan to YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X