తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దెబ్బకు దెబ్బ: ఇదీ దెబ్బంటే, ఏం చేయలేనిస్థితి.. చంద్రబాబుకు గట్టి షాకిచ్చిన జగన్

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో బుధవారం నిర్వహించిన వైసీపీ సమర శంఖారావంలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాకిచ్చారు. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా వ్యవహరించారు. జగన్ ప్రకటించిన నవరత్నాలను అధికార టీడీపీ కాపీ చేసి అమలు చేస్తోందని వైసీపీ విమర్శిస్తోంది.

అంతలోనే ఇలా.. చంద్రబాబుకు షాక్!: వైసీపీలోకి కడప టీడీపీ కీలక నేత, ఎందుకంటే?అంతలోనే ఇలా.. చంద్రబాబుకు షాక్!: వైసీపీలోకి కడప టీడీపీ కీలక నేత, ఎందుకంటే?

జగన్ నవరత్నాలు

జగన్ నవరత్నాలు

ఈ నేపథ్యంలో తాజాగా, తిరుపతి శంఖారావ సభలో జగన్ వృద్ధులకు పింఛన్ విషయంలో కీలక ప్రకటన చేశారు. వారికి నెలకు రూ.3వేల వృద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పారు. నవరత్నాల్లో భాగంగా వృద్ధాప్య పింఛన్ రూ.2వేలు ఇస్తామని జగన్ గతంలో ప్రకటించారు. పింఛన్ల వయస్సును 65 నుంచి అరవయ్యేళ్లకు తగ్గిస్తామన్నారు.

చంద్రబాబుకు దెబ్బకు దెబ్బ

చంద్రబాబుకు దెబ్బకు దెబ్బ

వికలాంగులకు పింఛన్‌ను రూ.3వేలు చేస్తామని జగన్ వనరత్నాల్లో భాగంగా ప్రకటించారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైయస్సార్ చేయూత కింద మొదటి ఏడాది తర్వాత దశలవారీగా రూ.75వేలు ఆయా కార్పోరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఇందులో నవరత్నాల్లోని వృద్ధాప్య పింఛనును టీడీపీ కాపీ కొట్టిందని, అందుకే రూ.1000 నుంచి రూ.2 వేలు చేసిందని వైసీపీ విమర్శించింది. దీంతో ఇప్పుడు జగన్ దెబ్బకు దెబ్బ అన్నట్లుగా మరో రూ.వెయ్యి పెంచి రూ.3వేలు ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ దానిని రూ.3వేలు చేయలేని పరిస్థితి. ఎందుకంటే మళ్లీ పెంచలేరు. అలాంటి ప్రకటన చేసినా కాపీ చేస్తున్నారనే విమర్శలు తీవ్రమవుతాయి. దీంతో ఇదీ జగన్ దెబ్బ అంటే అని వైసీపీ కార్యకర్తలు సంబరపడిపోతున్నారు.

ఎన్నికల తర్వాత కేంద్రంలో మద్దతు

ఎన్నికల తర్వాత కేంద్రంలో మద్దతు

ఇక, పొత్తుల విషయంలోను పదేపదే క్లారిటీ ఇస్తున్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉందని అధికార తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆడినట్లుగా జగన్ ఆడుతున్నారని చెప్పింది. అలాగే జనసేనతో పొత్తుకు అవకాశాలున్నాయని కూడా ప్రచారం సాగింది. ఈ ప్రచారం నేపథ్యంలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని పునరుద్ఘాటించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుండానే పోటీ చేయనున్న జగన్.. ఆ తర్వాత ఎన్నికల అనంతరం మాత్రం కేంద్రంలో ఏదో ఒక పార్టీకి మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి మద్దతిస్తామని చెబుతున్నారు.

English summary
YSR Congress party chief YS Jagan Mohan Reddy slams CM Chandrababu Naidu at Samara Sankharavam public meeting in Tirupati on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X