kkr v/s mi: గెలుపుపై ఇరు జట్ల ధీమా, ఫేవరెట్ మాత్రం..
ముంబై ఇండియన్స్‌తో కోల్ కతా నైట్ రైడర్స్ బుధవారం తలపడబోతోంది. ఈ రెండు జట్లలో ముంబై ఇండియన్స్ గెలుపు ఖాయమనే విశ్లేషకులు ఉన్నారు. గత టోర్నీ ఫెర్మార్మెన్స్ను బట్టి లెక్కగడుతున్నారు. అలాగనీ కోల్ కతా జట్టును తక్కువగా అంచనా వేయలేం. అసలే టీ 20 కావడంతో.. పరిస్థితి నిమిషాల్లో మారుతూ వస్తోంది. కానీ ముంబై ఇండియన్స్ జట్టు ఫేవరేట్ అని చాలా మంది అంటున్నారు.
2020 సీజన్‌ను ముంబై ఇండియన్స్ ఓటమితో ప్రారంభించింది. చెన్నై చేతిలో ఓటమిని చవిచూసింది. రెండో మ్యాచ్‌లో గెలిచి.. పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తోంది. టీమ్ కృషిగా ఆడాలనే ధృడ నిశ్చయంతో ఉంది. మరోవైపు ముంబై జట్టును ఎలాగైనా నిలువరించాలని కోల్ కతా చూస్తోంది. ఒక్కో జట్టు... ఎత్తులు, పై ఎత్తులతో మ్యాచులు జరుగుతున్నాయి. అయితే బుధవారం నాటి మ్యాచ్‌లో గెలవాలని ఇరుజట్టు కృతనిశ్చయంతో ఉన్నాయి. మరీ ఏ జట్టు విజయతీరాలకు చేరుతుందో చూడాలీ మరీ.