వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

RR VS KXIP: రెండో విజయంపై ఆర్ఆర్ కన్ను, రాహుల్ పైనే పంజాబ్ ఆశలు..

|
Google Oneindia TeluguNews

ఐపీఎల్‌లో ఇవాళ రాజస్తాన్ రాయల్స్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడబోతోంది. సీజన్‌లో ఆడిన ఒక మ్యాచ్ ఆర్ఆర్ గెలవగా.. రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓడిపోయింది. అయితే ఆదివారం జరిగే మ్యాచ్‌లో విజయం కోసం ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ తొమ్మిదవ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు షార్జా క్రికెట్ స్టేడియంలో జరగబోతోంది.

తొలి మ్యాచ్‌లో విజయం..

తొలి మ్యాచ్‌లో విజయం..


చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో ఆర్ఆర్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 20 ఓవర్లకు 6 వికెట్లకు 200 పరుగులు మాత్రమే చేసింది. రాయల్స్ బౌలర్ రాహుల్ ట్వేటియా 3 వికెట్లు తీశాడు.

ఓడిపోయింది ఇలా..

ఓడిపోయింది ఇలా..

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో పంజాబ్ రెండు పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది.

ఆర్సీబీపై ఘన విజయం..

ఆర్సీబీపై ఘన విజయం..


గురువారం రాత్రి కింగ్స్‌ ఎలెవెన్ పంజాబ్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఆర్సీబీపై పంజాబ్‌ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. 97 పరుగుల తేడాతో పంజాబ్ ఘన విజయం సొంతం చేసుకుంది. మ్యాచ్ అంతా వన్ మేన్ షో అన్నచందంగా సాగింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 14ఫోర్లు, 7 సిక్సర్లతో 132 పరుగుల భారీ స్కోరుతో జట్టుకు విజయం అందించాడు. రాహుల్ బౌండరీల సునామితో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

సమ ఉజ్జిలే..

సమ ఉజ్జిలే..


207 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్ష్య ఛేదనలో ఏ దశలోనూ పంజాబ్ జట్టు స్కోరును అందుకునే పరిస్థితి కనిపించలేదు. 17 ఓవర్లకే 109 పరుగులతో ఆలౌట్ అయింది. ఈ క్రమంలో ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ జట్లు ఆదివారం తలపడబోతున్నాయి. ఇరు జట్లు ఫామ్‌లో ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమ ఉజ్జీలుగా నిలుస్తున్నాయి. ఆర్ఆర్‌తో కూడా రాహుల్ ఎలా ఆడతారనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. అలాగే స్టీవ్ స్మిత్ అండ్ కో ఫామ్ కంటిన్యూ అవుతోందా లేదా అనే విషయం మరికొన్ని గంటల్లో తేలనుంది.

English summary
today ipl match is RR VS KXIP. two teams Confidence the victory
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X