• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

Today News Updates:సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

|

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఆగష్టు 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదలయ్యాయి. ఇక విద్యార్థులంతా తమ ఫలితాలను సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌(cbseresults.nic.in మరియు cbse.gov.inను సందర్శించి ఫలితాలు తెలుసుకోవచ్చు. డిజిలాకర్ అకౌంట్ ద్వారా కూడా సీబీఎస్‌ఈ బోర్డు పరీక్ష ఫలితాలు తెలుసుకోవచ్చు.

Today News in Telugu 3rd Aug 2021:CBSE 10th results 2021 declared

Newest First Oldest First
2:29 PM, 3 Aug
పెగాసస్ స్పైవేర్ స్కాండల్‌పై విచారణ జరిపించాలంటూ ఎడిటర్స్ గిల్డ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ స్కాండల్‌పై విచారణ జరపాలని కోరుతూ ఇందుకోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ (సిట్‌)ను ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోరింది. అంతేకాదు స్పైవేర్ కాంట్రాక్టు, జాబితాలో ఉన్న పేర్లకు సంబంధించిన సమాచారం కూడా ప్రభుత్వం నుంచి తెప్పించుకోవాలని జడ్జీలను ఎడిటర్స్ గిల్డ్ కోరింది. ఎడిటర్స్ గిల్డ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం మరింత చర్చనీయాంశమైంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పెగాసస్ స్పైవేర్‌పై విచారణ జరిపించాలంటూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
1:40 PM, 3 Aug
మెరిసిన సెన్సెక్స్
రికార్డు స్థాయిలో సెన్సెక్స్ 53,500 మార్కును దాటగా, ప్రస్తుతం 53,509.04 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఒకేసారి 558.41 పాయింట్ల మేరా పెరిగింది
1:38 PM, 3 Aug
తమ రాష్ట్రంలోకి కేరళ ప్రజలు అడుగుపెట్టాలంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకుంది కర్నాటక. ఈ నిర్ణయంపై కేరళకు చెందిన మంజేశ్వర్ ప్రాంత ప్రజలు నిరసన వ్యక్తం చేశారు
1:27 PM, 3 Aug
నాగార్జున సాగర్ డ్యాం.. సమాచారం. పూర్తి స్థాయి నీటి మట్టం...590 అడుగులు.. ప్రస్తుతం..587.20 అడుగులు.. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం..312.టీఎంసీలు. ప్రస్తుతం.305.5050 టీఎంసీలు. ఇన్ ఫ్లో.2,96,345 క్యూసెక్కలు.. ఔట్ ఫ్లో..2,94,345 క్యూసెక్కులు.. 18 గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటి విడుదల.
1:05 PM, 3 Aug
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది కేవలం ఉద్యోగుల సమస్య కాదు, 5 కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవ సమస్య అని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. 32 మంది ప్రాణాల త్యాగ ఫలితమే విశాఖ స్టీల్ ప్లాంట్. గౌతులచ్చన్న, అమృతరావు, తెన్నేటి విశ్వనాథం, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహానుభావులు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకోసం అలుపెరుగని పోరాటం చేసారని గుర్తు చేశారు. తెలుగు ప్రజల భవిష్యత్తు , భరోసా కోసం, ఉపాధి ఉద్యోగాల కోసం ప్రధానులను సైతం ఒప్పించి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామని చెప్పిన రామ్మోహన్ రావు...రాజకీయాలకు అతీతంగా మరోసారి భుజం భుజం కలిపి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్నారు. మనం పన్నులు కడితే, మనం ఓట్లు వేస్తే నడిచే కేంద్రం మన స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. ఢిల్లీ లో ఏసీ గదులలో కూర్చొని, తమకు హక్కు ఉందని కేంద్ర ప్రభుత్వం అమ్మడానికి ప్రయత్నం చేస్తే తెలుగు ప్రజలు సహించరని హెచ్చరించిన రామ్మోహన్ నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల ఆస్తి అని తెలిపారు.
12:47 PM, 3 Aug
YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల‌ రాజ‌న్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ నియోజకవర్గం, కోనరావుపేట మండలం, గొల్లపల్లె గ్రామంలో ఉద్యోగం రాలేద‌నే మ‌న‌స్తాపంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్న మ‌హేంద‌ర్ యాద‌వ్ కుటుంబాన్ని పరామ‌ర్శించి, అదే గ్రామంలో ఒక రోజు “నిరుద్యోగ నిరాహార దీక్ష“ చేపట్టారు.
12:42 PM, 3 Aug
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీ లు సైకిళ్లపై పార్లమెంట్ కు హాజరయ్యారు. అందులో భాగంగా సైకిల్ పై పార్లమెంట్ కు వచ్చిన రాహుల్ గాంధీ,టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
12:34 PM, 3 Aug
సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

English summary
CBSE 10th results 2021 are declared. Students can visit the website and know the results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X