• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

Today News Updates:దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

|

మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొద్ది రోజుల క్రితం ఆయనపై కృష్ణా జిల్లా పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే తనపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తున్నందునే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసిందని కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేసిన న్యాయస్థానం దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేసింది.

Today News in Telugu 4th Aug 2021:Devineni Uma granted bail by AP HC

Newest First Oldest First
3:39 PM, 4 Aug
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు గా భావిస్తున్న సునీల్ యాదవ్ ను పులివెందుల కోర్టులో ప్రవేశ పెట్టిన సిబిఐ అధికారులు
1:54 PM, 4 Aug
శంషాబాద్ విమానాశ్రయంలో పీవీ సింధుకు ఘనస్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ ‌గౌడ్, సీపీ సజ్జనార్
1:51 PM, 4 Aug
హైదరాబాదుకు చేరుకున్న ఒలింపిక్ కాంస్య పతక విజేత పీవీ సింధు
1:15 PM, 4 Aug
బాక్సింగ్‌లో కాంస్య పతకం సాధించిన లవ్లీనాకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ
12:07 PM, 4 Aug
హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పల్ నర్సింగ పూర్ ,బోర్నపల్లి గ్రామాల్లో కలియతిరిగిన మంత్రి గంగుల కమలాకర్.చిలక వాగు పై బ్రిడ్జి నిర్మాణం, పెద్దమ్మ గుడి, బిరప్ప గుడి, ఇతర అభివృద్ధి, పింఛన్లు సమస్యలు మంత్రి కి ప్రజలు వివరించారు. జిల్లా మంత్రి గా నేనున్నా, కాబట్టి మీ సమస్యలు పరిష్కారం చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కి ఓటు వేయవద్దని , గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపు చేశారని ఆ పార్టీకి ఓటు వేయవద్దని మహిళలకు వివరించారు.
11:33 AM, 4 Aug
కృష్ణా జలాల వివాదంపై ఏపీ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
11:30 AM, 4 Aug
పెగాసస్ రిపోర్టుపై దద్దరిల్లిన రాజ్యసభ. మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడిన సభ
11:27 AM, 4 Aug
హైదరాబాదులోని ఖైరతాబాదు సిగ్నల్స్ దగ్గర పోలీసు ఎస్కార్ట్ వాహనం టాటా సుమోలో అకస్మాతుగా మంటలు చెలరేగాయి. మంటలు గమనించి లోపల ఉన్న వారు వెంటనే బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది
11:26 AM, 4 Aug
ఏపీ ఈఎస్ఐ స్కామ్‌లో సీఐడీ దూకుడు పెంచింది. ఈఎస్‌ఐ సూపరింటెండెంట్ రవికూమార్ ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
11:25 AM, 4 Aug
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన భారత మహిళా బాక్సర్ లవ్లీనా
11:23 AM, 4 Aug
టీడీపీ నేత దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

English summary
Former Minsiter and TDP leader Devineni Uma was granted bail by AP High court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X