విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడు నాలుగు సార్లు జగనే సీయం...! ఖడ్గ చాలనం కాదు...కరచాలనం చేద్దామన్న కేసీఆర్..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

మూడు, నాలుగు సార్లు జగనే CM!! - KCR | Oneindia Telugu

విజయవాడ/హైదరాబాద్ : కొద్ధి క్షణాల క్రితమే రాజ్యాంగ బద్ధమైన పదవీ ప్రమాణం స్వీకరించి, సర్వమత పెద్దల ఆశిశులు స్వీకరించి, ప్రజల ఆశీస్సులతో యువ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ ప్రజల పక్షాణ హృదయ పూర్వకమైన ఆశీస్సులు తెలియ జేస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరై ఆయన మాట్లాడారు.

జగన్ వయస్సు చిన్నది..! బాద్యత పెద్దది అన్న కేసీఆర్..!!

జగన్ వయస్సు చిన్నది..! బాద్యత పెద్దది అన్న కేసీఆర్..!!

దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు పరస్పరం ముందుకు సాగేందుకు ఈ ఘట్టం భీజం వేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ వయస్సు చిన్నది కానీ బాధ్యత పెద్దదని తెలిపారు. ఆ బాధ్యతను సమర్ధవంతంగా వైఎస్ రాజశేకర్ రెడ్డి కొడుకుగా నిర్వహిస్తారని ఆకాంక్షిస్తున్నాని అన్నారు. గత తొమ్మిది సంవత్సరాలల్లో మీకు తండ్రి నుంచి వచ్చిన శక్తి ఉందన్నారు. ప్రజలు సుభీక్షంగా ఉండాలని అన్నారు.

చరిత్రలో నిలిచిపోవాలి..! రాజశేఖర్ రెడ్డిని మరిపించాలన్న ఉద్యమ నేత..!!

చరిత్రలో నిలిచిపోవాలి..! రాజశేఖర్ రెడ్డిని మరిపించాలన్న ఉద్యమ నేత..!!

రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కరజాలనం చేయాలని పేర్కొన్నారు. ఆత్మీయతతో సాగాలని అన్నారు. గోదావరి జలాల నీరు అండదండలు, సహాయ సహకారాలు అందించుకోవాలని తెలిపారు. అద్బుతమైన అవకాశం ఇచ్చారని, చరిత్రలో నిలిచిపోవాలని అన్నారు. మూడు నాలుగు టర్ముల వరకు జగన్ సీఎంగా ఉండాలన్నారు. చంద్రశేఖర్ రావు కి అనంతరం జగన్ ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ నుండి పూర్తి సహాకారం..! జగన్ కు ప్రత్యేక అభినందనలు తెలిపిన కేసీఆర్..!!

తెలంగాణ నుండి పూర్తి సహాకారం..! జగన్ కు ప్రత్యేక అభినందనలు తెలిపిన కేసీఆర్..!!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణం చేశారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభావేదికపై తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, కేసీఆర్ అభినందనలు తెలిపారు. చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ జగన్‌కు తెలంగాణ ప్రభుత్వం తరపున అభినందనలు.

కత్తులు దూసుకోవడం కాదు..! కరచాలనం చేసుకోవాలన్న టీ సీఎం..!!

కత్తులు దూసుకోవడం కాదు..! కరచాలనం చేసుకోవాలన్న టీ సీఎం..!!

ఇదొక ఉజ్వలమైన ఘట్టం. తెలుగు ప్రజలందరూ ప్రేమానురాగాలతో పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుంది. సీఎం జగన్‌ వయసు చిన్నది..బాధ్యత పెద్దది. శక్తి, సామర్థ్యం, స్థైర్యం, ధైర్యం మీకుందని గత 9ఏళ్లలో ప్రస్పుటంగా నిరూపించారు. మనం చేయాల్సింది కత్తులు దూసుకోవడం కాదు..కరచాలనం. గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవాలి. జగన్‌.. మీ నాన్న పేరు నిలబెట్టాలి. ఒక్కసారి కాదు..మూడునాలుగు సార్లు .. జగన్‌ రాష్ట్రాన్ని పాలించాలని దీవిస్తున్నాను అని చంద్రశేఖర్ రావు తన ప్రసంగాన్ని ముగించారు.

English summary
3,4 terms jagan will be the cm..will go ahead with friendly nature says kcr..!!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X