విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

97 మంది టీచర్లకు కరోనా, వైరస్‌తో ఓ టీచర్ మృతి.. విద్యార్థులను కూడా వదలని వైరస్..

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ కలవరానికి గురిచేస్తోంది. అయితే పాఠశాలల్లో గల విద్యార్థులు/ టీచర్లకు వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల వైరస్ సోకగా.. బుధవారం మరోసారి కేసులు బయటపడ్డాయి. మరో చోట టీచర్ చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో స్కూల్స్ మూసివేయాలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలే శీతకాలం కావడంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.

Recommended Video

AP Corona Update : 2618 New Covid Cases Reported In Andhra Pradesh | Oneindia Telugu
 97 మంది టీచర్ప్..

97 మంది టీచర్ప్..

కృష్ణా జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. 97 మంది ఉపాధ్యాయులు, 27 మంది విద్యార్థులకు వైరస్‌ వచ్చింది. జిల్లాలో ఒక్కరోజులో 124 కేసులు నమోదవడం తీవ్ర కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లాలో మరో 8 మంది విద్యార్థులకు వైరస్ సోకింది. ఓ ఉపాధ్యాయుడు కరోనాతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

ఓ టీచర్ మృతి

ఓ టీచర్ మృతి

ముమ్మిడివరం మండలం సీహెచ్‌ గున్నేపల్లి జడ్పీ హైస్కూల్‌లో గాలిదేవర త్రినాథరావు (45) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కరోనా వైరస్‌తో బుధవారం చనిపోయాడు. ఇటీవల ఆయనకు వైరస్‌ సోకగా.. కొన్నిరోజులుగా అమలాపురం కిమ్స్‌ కొవిడ్‌ సెంటర్‌లో చికిత్స తీసుకున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందారు.

విద్యార్థులకు కరోనా

విద్యార్థులకు కరోనా

అంబాజీపేట మండలం కె పెదపూడి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, తొండంగి మండలం ఏవీ నగరం ఉన్నత పాఠశాల, కాట్రేనికోన మండలం చెయ్యేరు హైస్కూల్‌లలో ఒక్కో విద్యార్థికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కె గంగవరం మండలం కుందూరు ఉన్నత పాఠశాలలో నలుగురు విద్యార్థులు, దంగేరు ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థికి కూడా కరోనా వైరస్ సోకింది.

కాస్త తగ్గుముఖం

కాస్త తగ్గుముఖం

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. వరుసగా మూడోరోజు బుధవారం 2 వేలలోపే కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,405 శాంపిల్స్‌ను పరీక్షించగా 1,732 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం వైరస్ సోకిన వారి సంఖ్య 8,47,977కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1,761 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 8,20,234కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,915 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల రాష్ట్రంలో మరో 14 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 6,828కి చేరింది.

English summary
97 teachers are infected coronavirus in andhra pradesh krishna. one teacher died due to virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X