విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడియో: టిఫిన్ చేయకుండా కోవిషీల్డ్ వ్యాక్సిన్: విజయవాడ హెల్త్ వర్కర్‌కు ఏమైందో తెలుసా?

|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడలోని ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో ఈ ఉదయం ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఓ చిన్న అపశృతి దొర్లింది. వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేయించుకున్న ఓ మహిళా హెల్త్ వర్కర్ స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. కళ్లు తిరిగి కిందపడ్డారు. వ్యాక్సిన్ వేయించుకున్న కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కలకలం చెలరేగింది. డాక్టర్లు ఆమెకు వైద్య పరీక్షలను నిర్వహించారు. బ్లడ్ ప్రెషర్, షుగర్ పరీక్షలను చేశారు. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి.

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తొలి వ్యక్తి ఎవరో తెలుసా?: చరిత్ర సృష్టించిన సామాన్యుడుకరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తొలి వ్యక్తి ఎవరో తెలుసా?: చరిత్ర సృష్టించిన సామాన్యుడు

నీరసంగా ఉండటం వల్లే ఆమె అనారోగ్యానికి గురైనట్లు నిర్ధారించారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా ఈ ఉదయం వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా- విజయవాడ జీజీహెచ్‌లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని పర్యవేక్షించారు. తొలి టీకాను వైద్య, ఆరోగ్యశాఖలో స్వీపర్‌గా పనిచేస్తోన్న బీ పుష్ప కుమారి అందుకున్నారు. ఆ తరువాత.. తమ పేర్లను నమోదు చేసుకున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు టీకాను ఇచ్చారు.

A health worker who was vaccinated at GGH, Vijayawada, develops a minor illness and collapsed

వారిలో రాధ అనే హెల్త్ వర్కర్‌ కూడా ఉన్నారు. అందరితో పాటు ఆమెకు వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఆమెకు వేశారు. ఇంజెక్షన్ వేసుకున్న కొద్ది సేపటికే ఆమె స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. తొలుత చలి వేస్తున్నట్లు చెప్పిన రాధా.. ఆ వెంటనే కళ్లు తిరిగి కింద పడ్దారు. డాక్టర్లు, తోటి హెల్త్ వర్కర్లు ఆమెను బెడ్‌పైకి తీసుకెళ్లారు. సపర్యలు చేశారు. కొద్దిసేపటి తరువాత రాధ స్పృహలోకి వచ్చారు. ఆమెకు వైద్య పరీక్షలను నిర్వహించగా.. అన్నీ నార్మల్ రిపోర్టులు వచ్చాయి.

వ్యాక్సిన్ వేయించుకునే హడావుడిలో తాను టిఫిన్ చేయలేదని రాధ తెలిపారు. టిఫిన్ చేయకపోవడం, వ్యాక్సిన్ వేయించుకుంటున్నాననే ఉద్వేగానికి లోనుకావడం, ఇంజెక్షన్ అనంతరం భయాందోళనలకు గురి కావడం వంటి కారణాల వల్ల స్పృహ తప్పినట్లు చెబుతున్నారు. ఆమె ప్రస్తుతం ఆమె సాధారణ స్థితికి చేరుకున్నారని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివశంకర్ తెలిపారు.

English summary
Radha, a health worker who was vaccinated at GGH, Vijayawada, develops a minor illness and collapsed immediately after being vaccinated. Health team taking care of her. Radha was apparently feeling weak since she skipped her breakfast and also has fear of injections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X