విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్య తల నరికి... వాగులో పడేసి: పక్కా ప్లాన్..కర్కశంగా : తలలు పట్టుకుంటున్న పోలీసులు..!!

|
Google Oneindia TeluguNews

ఏరి కోరి కావాలని చేసుకున్న భార్య పైన కర్కశంగా దాడి చేసి..తల నరికి..వాగులో పడేసి.. ఎటువంటి టెన్షన్ లేకుండా కనిపించిన ఆ వ్యక్తి భార్య కుటుంబంలో విషాదం నింపాడు. ఈ కేసులో భార్య మణిక్రాంత్రి తల నరికిన భర్త ప్రదీప్ పోలీసుల అదుపులో ఉన్నాడు. మణిక్రాంతి తల కోసం ఇప్పుడు పోలీసులు..ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెతుకుతున్నారు. తల దొరకకుండా పోస్టుమార్టం చేయలేని పరిస్థితి ఏర్పడింది. తప పడేసిన వాగులో ఎంత వెతికినా..దొరకటం లేదు. ఇదే సమయంలో మణిక్రాంతి సోదరి పూజారాణి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదీప్ ను వదిలేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

<strong>వరంగల్‌ మరో దారుణం....9వ తరగతి విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్... అవమానం భరించలేక ఆత్మహత్య </strong>వరంగల్‌ మరో దారుణం....9వ తరగతి విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్... అవమానం భరించలేక ఆత్మహత్య

పక్కా ప్లాన్..కర్కశంగా..

పక్కా ప్లాన్..కర్కశంగా..

విజయవాడలో తాను ఇష్టపడి కావాలని చేసుకున్న భార్యను కర్కశంగా నరికి తన చేతితో పట్టకొని రోడ్డు మీద ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తూ నేరుగా పోలీసులకు లొంగి పోయాడు. విజయవాడ సత్యనారాయణ పురంలో జరిగిన ఈ మర్దర్ కేసు ఇప్పుడు పోలీసులకు సవాల్ గా మారింది. కాల్వలో పడేసిన తల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెలిపాడు. తల కోసం ఏలూరు కాలువలో ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలిస్తున్నారు. బుడమేరు కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గాలింపుకు ఆటంకం ఏర్పడుతుంది. కులాలు వేరైనా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని..కొన్నాళ్లు సజావుగానే ఉన్నారు. ఆ తరువాత మొదలైన కలతలు కేసుల వరకు వెళ్లాయి. నిందితుడి తరఫు వారు రూ.4లక్షలు అడిగితే తాము రూ.లక్ష వరకు ఇచ్చామని మణిక్రాంతి తల్లి లక్ష్మి చెబుతోంది. నిందితుడు ప్రదీప్‌ కుమార్‌పై, అతడి సోదరి, బావమరిది, తదితరులపై ఆమె పలు స్టేషన్లలో మొత్తం 7 కేసులు పెట్టింది. చివరసారిగా శనివారం రాత్రి మృతురాలు మణిక్రాంతి సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌కు వచ్చింది. మళ్లీ ఫిర్యాదు చేసింది. ప్రదీప్‌ తనను వేధిస్తున్నాడని.. అరెస్టు చేయమని అడిగింది. ఏడు కేసులతో పాటు, ఇంకా చాలాసార్లు మణిక్రాంతి ఫిర్యాదు చేసిందని, వాటిని కేసులు కట్టకుండా సర్దిచెప్పి పంపించామని పోలీసులు చెబుతున్నారు. భార్య, భర్తల గొడవ కావడం.. ఏడు సంవత్సరాల శిక్ష పడే కేసు కావడంతో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు.

బెదిరించిందనే తల నరికి..

బెదిరించిందనే తల నరికి..

కోర్టులో కేసులో ఉన్న భార్య భర్తలిద్దరి మధ్య గొడవైందని.. భార్య ..భర్తను బెదిరించి..సంగతి తేలుస్తానని హెచ్చరించిందని ప్రదీప్ పోలీసుల విచారణతో వెల్లడించాడు. దీంతో పాటు కేసుల మీద కేసులు వేయడం, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆమెను కడతేర్చేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. హత్య చేసిన నిందితుడు తలను, చంపేందుకు ఉపయోగించిన కత్తిని ఏలూరు కాలవలో పడేశాడు. అనంతరం గవర్నమెంట్‌ ప్రెస్‌ సమీపంలోని గంగానమ్మ గుడి వద్ద ఉన్న టీస్టాల్‌ వద్ద తాపీగా టీ తాగాడు. ఈ విషయాన్ని స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నాడని వారు పోలీసులకు చెప్పారు.
నిందితుడిని నున్న స్టేషన్‌కు తరలించారు. తలను, కత్తిని వెతికేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగింది. ఏలూరు కాలువలో గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించేందుకు కూడా పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. ఎన్ని కేసులు పెట్టినా పోలీసులు సరిగా స్పందించలేదని, దీని వల్లనే తన కుమార్తె హత్య జరిగిందని తల్లి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతదేహాన్ని కదిలించేందుకు ఒప్పుకోనని తెగేసి చెప్పింది. తన కళ్ల ముందే కుమార్తెను నరికి చంపాడని బోరున విలపించింది. నిందితుడు స్టేషన్‌కు వచ్చి లొంగిపోలేదని, రక్తపు మరకల దుస్తులతో రోడ్డుపై తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో వెళ్లి అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు.

తల..కత్తి దొరక్కపోతే కేసు ముందుకెలా..

తల..కత్తి దొరక్కపోతే కేసు ముందుకెలా..

నిందితుడు తానే తన భార్య తల నరికానని చెబుతున్నా..ఆధారాల సేకరణ ఇప్పుడు పోలీసులకు ఇబ్బందిగా మారింది. పోలీసులే కాదు..ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం గాలింపు చర్యలు ప్రారంభించారు. డాక్టర్లు సైతం తాము పోస్టుమార్టం చేయాలంటే తల ఉంటేనే పక్కా నివేదిక ఇవ్వగలుగుతామని చెబుతున్నారు. పోలీసులు మాత్రం ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని చెబుతున్నారు. ఇదే సమయంలో భాదిత కుటుంబ సభ్యులు మాత్రం తాము నిందితుడిని వదిలేది లేదని ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు.

English summary
A husband in Vijayawada cruelly mureder wife and surrendedred in police station.Now this murder became sensation in Krihsna District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X