విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు: బెయిల్ పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం

|
Google Oneindia TeluguNews

ఏసీబీ కోర్టులో మాజీమంత్రి అచ్చెన్నాయుడుకి చుక్కెదురైంది. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు కొట్టివేసింది. గత ప్రభుత్వ హయాంలో టెలీ హెల్త్ సర్వీసెస్‌కు కాంట్రాక్ట్ ఇవ్వడంలో నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు వచ్చాయి. అప్పటి కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ప్రమేయంతోనే రూ.150 కోట్ల స్కాం జరిగిందని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతన్ని జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి జైలుకు తరలించారు.

 అచ్చెన్నాయుడి హత్యకు ప్రభుత్వం కుట్ర: కోర్టు ఆదేశాలు ధిక్కరణ, సోమిరెడ్డి, ఆలపాటి ఫైర్.. అచ్చెన్నాయుడి హత్యకు ప్రభుత్వం కుట్ర: కోర్టు ఆదేశాలు ధిక్కరణ, సోమిరెడ్డి, ఆలపాటి ఫైర్..

నో బెయిల్..

నో బెయిల్..


ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ చేసే ఒక రోజు ముందు అచ్చెన్నాయుడికి ఫైల్స్ సర్జరీ జరిగింది. అయితే మరునాడే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి విజయవాడ తీసుకొచ్చారు. కారులో 12 గంటలపాటు తీసుకురావడంతో ఆయనకు రక్తస్రావమయ్యింది. తర్వాత కోర్టు ఆదేశాల మేరకు జీజీహెచ్‌లో మరోసారి శస్త్రచికిత్స చేశారు. తర్వాత కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసి విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాలని అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

హైకోర్టు తీర్పు..

హైకోర్టు తీర్పు..


ఇటు అచ్చెన్నాయుడిని ఆస్పత్రికి తరలించే అంశంపై హైకోర్టులో వాదనలు ముగియగా.. శనివారం తీర్పిస్తామని హైకోర్టు తెలిపింది. అచ్చెన్నాయుడుకు రెండోసారి శస్త్రచికిత్స జరిగిందని అడ్వకేట్ కోర్టు దృష్టికి తెచ్చారు. చికిత్స తర్వాత పరిస్థితి ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడుకు మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలని లాయర్‌ విజ్ఞప్తి చేశారు. అయితే అతనికి పూర్తిస్థాయిలో చికిత్స అందించామని ప్రభుత్వ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. అచ్చెన్నాయుడికి మెరుగైన వైద్యం అవసరం లేదని తెలిపారు.

Recommended Video

Sushant Singh Rajput : సుశాంత్ కేసు లో Rhea Chakraborty పై కేసు వేసిన Sushant అభిమాని
రూ.150 కోట్ల స్కాం

రూ.150 కోట్ల స్కాం

నిబంధనలు ఉల్లంఘించి టెలీ హెల్త్ సర్వీస్‌కు కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని ఏసీబీ వాదిస్తోంది. అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడి ప్రమేయంతోనే కుంభకోణం జరిగిందని, అభియోగం మోపింది. ఇటీవల అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రిమాండ్‌లో ఉన్నారు. అనారోగ్యం వల్ల జీజీహెచ్‌లో చికిత్స తీసుకున్నారు.

English summary
acb court dismiss ex minister Atchannaidu bail petition on esi scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X