• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Pawan Kalyan: బ్లాక్ షర్ట్‌తో జనసేన అధినేత: జగన్ సర్కార్‌పై ఇక దండయాత్రే

|

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి రాజకీయంగా ఫుల్ యాక్టివ్ అయ్యారు..ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నట్లుగా భావిస్తోన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై దండయాత్ర చేయడానికి సమాయాత్తమౌతోన్నారు. సుదీర్ఘ విరామం అనంతరం ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. పలు కీలక నిర్ణయాలను ఆయన తీసుకోనున్నారు.

Pic talk: టీఆర్ఎస్ టు కాంగ్రెస్..వయా టీడీపీ: సింగిల్ ఫ్రేమ్‌లో రేవంత్ పొలిటికల్ జర్నీPic talk: టీఆర్ఎస్ టు కాంగ్రెస్..వయా టీడీపీ: సింగిల్ ఫ్రేమ్‌లో రేవంత్ పొలిటికల్ జర్నీ

బ్లాక్ షర్ట్‌తో పవన్ కల్యాణ్..

బ్లాక్ షర్ట్‌తో పవన్ కల్యాణ్..

గన్నవరం విమానాశ్రయం టెర్మినల్ నుంచి పవన్ కల్యాణ్.. కాస్త డిఫరెంట్ లుక్‌తో కనిపించారు. బ్లాక్ షర్ట్‌తో దర్శనమిచ్చారు. పవన్ కల్యాణ్ నల్లరంగు జుబ్బాను ధరించిన సందర్భాలు చాలా తక్కువ. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ దాన్ని ధరించలేదాయన. సాధారణంగా పవన్ కల్యాణ్ తెలుపు లేదా లేత, ముదురు నీలం రంగు దుస్తులతో కనిపిస్తుంటారు. ఈ సారి దానికి భిన్నంగా నల్లరంగు జుబ్బాను ధరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నిరసన కార్యక్రమాలకు నిదర్శనంగా..

నిరసన కార్యక్రమాలకు నిదర్శనంగా..

పవన్ కల్యాణ్ నల్లరంగు దుస్తులను ధరించడం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తోంది. నిరసన తెలియజేయడానికి ఈ రంగు దుస్తులను ధరిస్తుంటారు నాయకులు. చేతికి రిబ్బన్లను కట్టుకుని నిరసన ప్రదర్శనలను చేస్తుంటారు. ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరిని నిరసిస్తూ ఇదివరకు- మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం నల్లరంగు చొక్కా ధరించిన విషయాన్ని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తుకు తెస్తోన్నారు. పవన్ కల్యాణ్.. తన భవిష్యత్ కార్యక్రమాలన్నీ నిరసనలను తెలియజేసేవిగా ఉండటం వల్లే.. దానికి సంకేతంగా ఈ రంగు దుస్తులను ధరించారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

 జగన్ సర్కార్‌పై

జగన్ సర్కార్‌పై

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీతోనూ భేటీ కానున్నారు. జగన్ సర్కార్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను ఆధారంగా చేసుకుని యువతను చైతన్యవంతులను చేసే కార్యక్రమాలను చేపట్టబోతోన్నారు. పలువురు నిరుద్యోగ యువతను ఆయన కలుస్తారు. భవన నిర్మాణ కార్మికులనూ పవన్ కలవనున్నారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ రంగం కుప్పకూలిందంటూ ఇప్పటికే పలుమార్లు జనసేన పార్టీ నిరసన కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఏకంగా పవన్ కల్యాణే బరిలోకి దిగారు.

  Dr. Lasya Sai Sindhu, ENT and neurologist, said that doctors work hard to save the lives of patients
   సమకాలీన అంశాలపై..

  సమకాలీన అంశాలపై..

  నిరసన కార్యక్రమాలతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించనున్నారు. దాని తరువాతే- భవిష్యత్ ప్రణాళికను రూపొందించనున్నారు. ఇన్ని రోజుల పాటు హైదరాబాద్‌‌కే పరిమితమైన పవన్ కల్యాణ్.. ఇక క్రియాశీలక రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం ఆసక్తిగా మారింది. మిత్రపక్షం భారతీయ జనతా పార్టీతో కలిసి వరుస ఉద్యమాలకు శ్రీకారం చుట్టడానికి పవన్ కల్యాణ్ సమాయాత్తమౌతోన్నారనే సంకేతాన్ని పంపించినట్టయిందనే విశ్లేషణలు వినిపిస్తోన్నాయి. ఇందులో భాగంగా- లాంగ్‌మార్చ్‌ను కూడా చేపట్టే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

  English summary
  After a long gap Janasena chief Pawan Kalyan steps into Vijayawada, to speak to jobless youth. He arrived Gannavaram airport this morning and wear black shirt.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X