విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణ జిల్లా రాజకీయాలను వణికిస్తున్న వల్లభనేని..! వైసీపిలో మొదలైన అలజడి..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : కృష్ణ జిల్లా రాజకీయాలను టీడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ కుదుపు కుదిపేస్తున్నారు. బందరు ఎమ్మెల్యే పేర్ని నాని, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తో కలిసి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలిశారు వంశీ. తెలుగుదేశం పార్టీలో బలమైన గొంతు వినిపించగల నేతల్లో ఒకరైన వంశీ సీఎం జగన్ ని కలవడం తెలుగుదేశం శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది. వాస్తవానికి ఆయన ఒక రోజు మందు తన అనుచరులతో సమావేశం అయినప్పుడే పలు అనుమానాలు కలిగాయి. కాకపోతే 24 గంటల్లోనే ఇలా ఏకంగా సీఎం జగన్ ను కలుస్తాడని ఎవరూ ఊహించలేదు. ఇదిలా ఉండగా పార్టీ మార్పు గురించి వల్లభనేని వంశీపై చాలా ఒత్తిడి ఉందని తెలుస్తోంది. దానికి తగినంత ప్రతిఫలం చేకూర్చడానికి కూడా వైసీపి అధ్యక్షుడు సిద్ధంగా ఉన్నట్టు వార్తలు భగ్గుమంటున్నాయి.

Amaravathi politics became hot by vallabhaneni Vamsi..!!

మరోవైపు ఏ ఇతర నాయకుడో టీడీపీని వదిలి వెళ్లిపోతున్నడంటే పరవాలేదు గాని, వల్లభనేని వంశీ వంటి వ్యక్తులు పార్టీని వీడటం అనేక ఇతర సంకేతాలకు కారణం అవుతుంది. అయితే ఈ పరిణామంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇప్పుడు ప్రకటించకపోయినా, వల్లభనేని వంశీ దీపావళి అనంతరం వైసీపిలో చేరనున్నారనేది స్పస్టమైంది. అందుకు కోసం ఓ సంలచన నిర్ణయానికి రెఢీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ వీడాలని జగన్ పెట్టిన షరుతుకు వల్లభనేని ఓకే అన్నట్టు తెలుస్తోంది. ఇదే అంవం పట్ల అమరావతిలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంటే అసెంబ్లీలో ఫిరాయింపులు చేయకుండానే టీడీపీ సీట్లు తగ్గించే ప్లాన్ లో ఉన్నారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు ఓ కేసు తనపై నమోదైన వెంటనే ఇలా జగన్ కు వల్లభనేని సరెండర్ కావడంపై ఆయన అభిమానులు అసమనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
One of the strongest voices in the Telugu Desam Party Vallabhaneni Vamsi is meeting ap cm ys Jagan and the Telugu Desam Cadre is disturbed. In fact, he had a lot of suspicions when he had a meeting with his followers one day. If not, no one would have imagined that this would meet the CM YS Jagan in 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X