విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి భూముల కుంభకోణం.... ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఈడీ కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులప్రకటన ఏపీలో రాజకీయ యుద్ధాలకు కారణం అయ్యింది. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలు ఏపీ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తుంది .రాజధాని ఏరియాలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని రంగంలోకి దిగిన సిఐడీ ఈడీకి లేఖ రాయటం ఒక సంచలనం కాగా తాజాగా అమరావతి భూ కుంభకోణంపై ఈడీ కేసు నమోదు చేయటం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు కారణం అవుతుంది .

 రాజధాని అమరావతిలో భూ కుంభకోణం .. వైసీపీ ఆరోపణ

రాజధాని అమరావతిలో భూ కుంభకోణం .. వైసీపీ ఆరోపణ

అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే పార్టీ నేతలకు లీక్ చేశారని, దాంతో టీడీపీ నేతలు అమరావతిలో భూములను కొని ఇన్‌సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు మొదట నుండి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు టీడీపీ నేతల పేర్లు ప్రకటించి మరీ ఎవరు ఎన్ని ఎకరాలు కొనుగోలు చేశారో ప్రకటించారు. టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు,పత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ళ నరేంద్ర, పరిటాల శ్రీరాం, నారాయణ, లోకేష్ వంటి వారికి భూములున్నట్లు పేర్కొన్నారు.

Recommended Video

AP 3 Capitals : Is Visakhapatanam Safe As Executive Capital ? Detailed Report
సిఐడీ లేఖతో రంగంలోకి ఈడీ

సిఐడీ లేఖతో రంగంలోకి ఈడీ

ఇక దీంతో ఈభూ కుంభకోణం వ్యవహారంలో సీబీసిఐడీ రంగంలోకి దిగింది. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణ తదితర నేతలపై కేసులు నమోదు చేశారు.అంతేకాదు అమరావతి కోర్ ఏరియాలో 720 ఎకరాలను 790 మంది తెల్లరేషన్ కార్డుదారులు భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ గుర్తించింది. ఈ భూములను పేదల పేరిట రాజకీయ నాయకులు భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ అనుమానం వ్యక్తం చేసింది.

మనీ ల్యాండరింగ్ కేసు నమోదు

మనీ ల్యాండరింగ్ కేసు నమోదు

అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంలో విచారణ జరిపించాలని సీఐడీ, ఈడీకి లేఖ రాసింది. ఇక ఈ లేఖపై స్పందించిన ఈడీ అమరావతి భూముల కుంభకోణంలో మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది.మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక ఈ నేపధ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
Allegations of insider trading in Amaravati in the capital warms AP political climate.The CID, which has entered into a raid on the issue of insider trading in the capital area, is a sensation. Now The E.D case has been registered in the Amaravati land scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X