విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్‌..చంద్ర‌బాబు మ‌ధ్య తేడా అదే: దూషించిన వారంతా ఏరి..అచ్చెన్న పొర‌పాటున‌: స‌భ‌లో అంబటి..!

|
Google Oneindia TeluguNews

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ సంఖ్య 13కి త‌గ్గిపోతుంద‌ని వైసీపీ సీనియ‌ర్ నేత అంబ‌టి రాంబాబు జోస్యం చెప్పారు. శాస‌న స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాల తీర్మానం పైన చర్చ‌లో భాగంగా అంబటి మాట్లాడారు. ముఖ్య‌మంత్రిగా 14 ఏళ్ల చంద్ర‌బాబు రికార్డును జ‌గ‌న్ బ‌ద్ద‌లుకొడ‌తార‌ని రాంబాబు వ్యాఖ్యానించారు. దీంతో..టీడీపీ ఎమ్మెల్యేలు స‌భ‌లో అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. ఆ స‌మ‌యంలో స‌భ‌లో చంద్ర‌బాబు..అచ్చంనాయుడు స‌భ‌లో లేక‌పోవ‌టాన్ని అంబ‌టి ప్ర‌స్తావించారు. స‌భ‌లో అంబ‌టి స్పీచ్‌తో వైసీపీ స‌భ్యుల నవ్వులే..నవ్వులే..

అదే చంద్ర‌బాబు..జ‌గ‌న్‌కు మ‌ధ్య తేడా
శాస‌న‌స‌భ‌లో వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు చేసిన ప్ర‌సంగం పైనే లాబీల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఎన్నిక‌ల్లో గెలుపు పైన చంద్ర‌బాబు ధీమా చూసి త‌న‌కు భ‌యం వేసింద‌ని గుర్తు చేసారు. వంద‌కు వెయ్యి శాతం గెలుస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు చెప్పిన స‌మ‌యంలో..తాను జ‌గ‌న్‌తో మాట్లాడితే ఖ‌చ్చితంగా 130 ప్ల‌స్ సీట్లు వ‌స్తాయ‌ని జ‌గ‌న్ చెప్పార‌ని వివ‌రించారు.ఇక‌, పాల‌న‌లో నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..నేటి జ‌గ‌న్ పాల‌నలో ఉన్న తేడాను ప్ర‌జ‌లు గ‌ర్తించార‌ని పేర్కొన్నారు. చంద్ర‌బాబు ప‌ద‌వీ స్వీకారం చేసిన స‌మ‌యంలో తొలి సంత‌కం బెల్టు షాపుల ర‌ద్దు ఫైల్ పైన సంత‌కం చేసార‌ని..అది అమ‌లు చేయ‌లేద‌ని..ఇప్పుడు జ‌గ‌న్ దీనిని అమ‌లు చేస్తున్నార‌ని వివ‌రించారు. ఇప్ప‌టికైనా టీడీపీ వాస్త‌వాలు తెలుసుకొని స‌రిదిద్దుకోక పోతే టీడీపీ సంఖ్య 23 నుండి 13 అక్క‌డి నుండి 3కి ప‌డిపోతుంద‌ని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Ambati Rambabu target TDP in Assemblly. .serious comments on Chandra babu..

దేవినేని ఉమా పైన సెటైర్లు..
పోల‌వ‌రం గురించి సైతం అంబ‌టి రాంబాబు ప్ర‌స్తావించారు. నాటి స‌భ‌లో పోల‌వ‌రం 2018 నాటికి పూర్తి చేస్తామంటూ బ‌ల్ల‌లు చరిచి..రాసుకో జ‌గ‌న్ అంటూ పెద్ద మాట‌లు చెప్పిన వారు ఏమ‌య్యార‌ని అంబ‌టి రాంబాబు ప‌రోక్షంగా మాజీ మంత్రి దేవినేని ఉమా గురించి ప్ర‌శ్నించారు. జ‌గ‌న్‌ను ఇష్టానుసారం దూషించిన వారంతా ఓట‌మి చెందార‌ని.. ఒక్క అచ్చంనాయుడు మాత్రం పొర‌పాటున గెలిచార‌ని..వ‌చ్చే సారి ఆయ‌న గెల‌వ‌ర‌ని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన అచ్చంనాయుడు స్పందిస్తూ ఓడియినంత మాత్రన వారు అస‌మ‌ర్ధులు కార‌ని..అంబి సైతం ప‌లుమార్లు ఓడార‌నే విష‌యాన్ని గుర్తు చేసారు. అచ్చంనాయుడు చెబుతున్న మంచిని స్వీక‌రించ‌క‌పోతే టీడీపీని ఎవ‌రూ బాగుచేయ‌లేర‌ని అంబ‌టి రాంబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ దుస్థితి అంచ‌నా వేయాల‌ని సూచించారు. జ‌గ‌న్ కేబినెట్‌లో సామాజిక స‌మీక‌ర‌ణాల గురించి అంబ‌టి వివ‌రించారు. రాంబాబు ప్ర‌సంగిస్తున్నంత సేపు స‌భ‌లో వైసీపీ స‌భ్యులు న‌వ్వుల్లో మునిగిపోయారు.

English summary
YCP Senior leader Ambati Rambabu target TDP in Assemblly. He appreciated Jagan Administration and serious comments on Chandra babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X