రెండు చోట్ల తాటతీసారుగా: కన్నబాబును గెలిపించారు..మిమ్మల్ని మాత్రం..: పవన్ పై అంబటి ఫైర్..!
జనసేన అధినేత పవన్ కళ్మాణ్ పై వైసీపీ నేతలు రాజకీయంగా మూకుమ్మడి దాడి చేస్తున్నారు. విశాఖ సభలో పవన్ చేసిన వ్యాఖ్మల మీద ఘటుగా స్పందిస్తున్నారు. పార్టీ నేత అంబటి రాంబాబు పవన్ పైన ఫైర్ అయ్యారు. మీరు తాటతీస్తామన్నారు. పవన్ రెండు చోట్ల నిలబడితే ప్రజలు తాటతీశారు...ఆయన మూలన కూర్చోబెట్టారన్నారే... మూలనకాదు... కూర్చోబెట్టారు...వంగోబెట్టారు...అంటూ వ్యాఖ్యానించారు.
తాటతీయడం అంటే ఆరునెలలకు ఒకసారి గడ్డం తీయడం కాదని.. రాజకీయంగా తాటలు తీస్తే తాటలు తీయించుకోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టే కాదు ఎవరూ సిద్దంగా లేరని స్పష్టం చేసారు. కాకినాడ వెళ్లి కన్నబాబును ఓడించండి అని పవన్ కోరితే.. తుక్కుతుక్కుగా పవన్ ను ఓడించి...కన్నబాబును గెలిపించారంటూ అంబటి సమాధానమిచ్చారు. జనసేన లాంగ్ మార్చ్ లో భవన నిర్మాణ కార్మికులు లేరని..టీడీపీ నేతలే కనిపించారని ఎద్దేవా చేసారు.
ఆ తర్వాతే పొత్తు వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ ఆగ్రహం వల్లే, బాబుతో పొత్తు కోసం ఎవరొస్తారు: వైసీపీ
ప్రజలే మీకు తాట తీస్తారు..
విశాఖలో లాంగ్ మార్చ్ తరువాత పవన్ చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ నేతలు వరుసగా రియాక్ట్ అవుతున్నారు. నదులు పొంగిప్రవహిస్తున్నాయని పదే పదే చెప్పాం.అందువల్లనే ఇసుక తీయలేకపోతున్నాం అని తెలియచేశామని అంబటి రాంబాబు వివరించారు. విశాఖ లాంగ్ మార్చ్ లో భవననిర్మాణకార్మికులు కనిపించలేదని.. అందులో జనసేన జెండాలుపట్టుకున్న టిడిపి కార్యకర్తలు కనిపించారని ఎద్దేవా చేసారు. ఆ రెండు కిలోమీటర్లు కూడా నడవలేక కారు ఎక్కారన్నారు. పవన్ కల్యాణ్ మీ రాజకీయాలు మీరు నడుపుకుంటే మాకు ఏ విధమైన అభ్యంతరం లేదుని చెబుతూనే.. డిఎన్ ఏ అంటే చంద్రబాబు,పవన్ కల్యాణ్ ల వ్యక్తిగతమైనది కాదుని..టిడిపి,జనసేన డిఎన్ ఏ ఒక్కటే అంటూ అంబటి వ్యాఖ్యానించారు. అదే సమయంలో పవన్ తాటతీస్తామన్నారు...ఆయన రెండు చోట్ల నిలబడితే ప్రజలు తాటతీశారు..మీరు మూలన కూర్చోబెట్టారన్నా..కాదు మూలనకాదు... కూర్చోబెట్టారు...వంగోబెట్టారు...అంటూ వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా.. తాటతీయడం అంటే ఆరునెలలకు ఒకసారి గడ్డం తీయడం కాదని..రాజకీయంగా తాటలు తీస్తే తాటలు తీయించుకోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టే కాదు ఎవరూ సిద్దంగా లేరని స్పష్టం చేసారు.

వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారా..
మీ నోరు పెద్దది మీ నోరు కన్నా వేయిరెట్లు పెద్దది మా నోరు గుర్తుపెట్టుకోండి అంటూ పవన్ కు అంబటి సూచించారు.-ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తానంటే ప్రజలే మిమ్మల్ని తాటతీస్తారు అని హెచ్చరించారు. రాజకీయాలలో విమర్శలు చేయండి అవి సద్విమర్శలు చేయాలిగాని వ్యక్తిగతంగా ఉండకూడదని హితవు పలికారు. కాకినాడ వెళ్లి కన్నబాబును ఓడించండి అని మీరు కోరితే తుక్కుతుక్కుగా మిమ్మల్ని ఓడించారు...కన్నబాబును గెలిపించారని అంబటి పేర్కొన్నారు. జగన్ పైన నమోదైన అక్రమ కేసులని తెలిసే ప్రజలు సీట్లలో గెలిపించారని వివరించారు. విజయసాయిరెడ్డిగారి గురించి అవాకులు చెవాకులు పేలడం మంచిది కాదని పేర్కొన్నారు. రాజకీయంగా వందవిమర్శలు చేయండి వాటికి సమాధానం చెబుతామన్నారు. చంద్రబాబు ఎజెండాను మోయడం కోసం పవన్ రాజకీయం నడుపుతున్నారుని దుయ్యబట్టారు. పవన్ అభిమానులు కూడా జగన్ గారికి ఎందుకు ఓట్లు వేశారంటే మీకు ఓట్లు వేస్తే సైకిల్ కు ఓటు వేసినట్లేనని భావించి మాకు వేశారని అంబటి చెప్పుకొచ్చారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!