విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

19న ఏపీ కేబినెట్: కీలకాంశాలు చర్చకు: జల వివాదాలపై ఫోకస్: కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా వ్యూహం

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 19వ తేదీన సమావేశ కాబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో గల సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఏర్పాటవుతుందని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గం సమావేశం అయ్యే వేదిక మారొచ్చనీ అంటున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

Recommended Video

AP Cabinet Meeting on 19th August తెలంగాణతో వివాదాలు, హైకోర్టు స్టేటస్ కో పై చర్చ ! || Oneindia

 మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశం: స్టేట్ కో పొడిగింపు: ఎప్పటివరకంటే? గవర్నర్ గెజిట్‌పై మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశం: స్టేట్ కో పొడిగింపు: ఎప్పటివరకంటే? గవర్నర్ గెజిట్‌పై

కేబినెట్‌లో కీలక అంశాలపై చర్చ..

కేబినెట్‌లో కీలక అంశాలపై చర్చ..


పొరుగు రాష్ట్రం తెలంగాణతో జల వివాదాలు.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై న్యాయపరమైన చిక్కులు.. మూడు రాజధానుల ఏర్పాటు..రాజధాని శంకుస్థాపనకు ముహూర్తాన్ని ఖరారు చేయడం..గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జారీ చేసిన మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు స్టేటస్ కోను పొడిగించడం వంటి పరిణామాల మధ్య కేబినెట్ సమావేశం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రత్యేకించి- తెలంగాణతో ఏర్పడిన జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రివర్గంలో చర్చిస్తారని అంటున్నారు.

 జల వివాదాలను పరిష్కరించుకోవడానికి

జల వివాదాలను పరిష్కరించుకోవడానికి

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విస్తరణలో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించ తల పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సహా ఇతర ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తోన్న అభ్యంతరాలను త్వరలో జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తేల్చుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. దీనికి అనుసరించాల్సిన వ్యూహాలపై కేబినెట్‌లో చర్చిస్తారని చెబుతున్నారు.

పోతిరెడ్డి పాడు విస్తరణ కొత్త ప్రాజెక్టు కాదంటూ..

పోతిరెడ్డి పాడు విస్తరణ కొత్త ప్రాజెక్టు కాదంటూ..


పోతిరెడ్డి పాడు విస్తరణలో భాగంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్తది కాదనే విషయాన్ని బలంగా వినిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త ప్రాజెక్టు కాకపోవడం వల్లే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ప్రారంభ దశ పనులను చేపట్టడానికి అనుమతి ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తోంది. సముద్రం పాలయ్యే కృష్ణా జలాలపై మాత్రమే ఈ లిఫ్ట్ ఇరిగేషన్‌ను నిర్మించదలిచామని, అదనపు నీటిని వినియోగించుకుంటామంటూ తాము చేసిన వాదనలతో ఎన్జీటీ సైతం అంగీకరించిందనే విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావిస్తోంది.

 మూడు రాజధానుల తరలింపుపైనా..

మూడు రాజధానుల తరలింపుపైనా..

దీనితో పాటు మూడు రాజధానులను తరలించే అంశంపైనా మంత్రివర్గం చర్చిస్తుందని అంటున్నారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించాలని ఇదివరకు నిర్ణయించుకున్నప్పటికీ.. దాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం.. ఈ అంశం హైకోర్టులో విచారణలో ఉండటమే. గవర్నర్ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం, దాన్ని పొడిగించడం వంటి పరిణామాల నేపథ్యంలో.. నిర్దేశిత సమయానికి శంకుస్థాపన పనులను చేపట్టకపోవచ్చని ప్రభుత్వం భావించింది. తరువాతి ముహూర్తం ఎప్పుడనే విషయంపైనా మంత్రివర్గం చర్చిస్తుందని చెబుతున్నారు.

English summary
Andhra Pradesh Cabinet to meet on 19th August. The Cabinet meeting, chaired by Chief Minister YS Jagan Mohan Reddy, likely to discuss on Water disputes along with Telangana government and othe issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X