విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపిలో కొత్త‌గా ఆంధ్రా రాష్ట్ర స‌మితి : కెసిఆర్ కు త్వ‌ర‌లో ఆహ్వానం..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితి మాదిరే..ఏపిలో ఆంధ్రా రాష్ట్ర స‌మితి ఏర్పాటు పై స‌మాలోచ‌న‌లు జ‌రుగుతున్నా యి. రాజ‌కీయంగా ప్ర‌భావం ఎలా ఉన్నా..ఏపిలోనూ కోసిఆర్ త‌ర‌హా నాయ‌కుడు అవ‌స‌ర‌మ‌నే చ‌ర్చ మొద‌లైంది. ఇందు కోసం తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఏపిలో కెసిఆర్ అభిమాన సంఘాలు..వెల‌మ యువ‌జ‌న సంఘాలు తెర మీద‌కు వ‌స్తున్నాయి. కొన్ని చోట్ల వైసిపి నేత‌లు ఓపెన్‌గానే కెసిఆర్ కు అభినంద‌న‌లు తెలుపుతూ ఫ్లెక్సీలు క‌డుతుంటే మ‌రి కొన్ని ప్రాంతాల్లో పార్టీల‌తో ప్ర‌మేయం లేని వ్య‌క్తులు కెసిఆర్ ను అభినందిస్తున్నాయి.

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను చూసిన త‌రువాత ప్ర‌ధానంగా విశాఖ జిల్లాలో కెసిఆర్ ప్ర‌భావం క‌నిపిస్తోంది. జిల్లాలోని న‌ర్సీప‌ట్నం లో వెల‌మ యువ‌జ‌న సంఘం విజ‌యోత్సవం నిర్వ‌హించింది. ప‌ట్ట‌ణానికి చెందిన పీడియాట్రిషియ‌న్ డాక్ట‌ర్ కిల్లాడ స‌త్య‌నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో ప‌లువురు సంఘ స‌భ్యులు ర్యాలీ నిర్వ‌హించారు. కొబ్బ‌రి కాయ‌లు కొట్టి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ప్ర‌జ‌ల‌కు స్వీట్లు పంపిణీ చేసారు. తెలంగాణ లోని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కెపీ వివేకానంద త‌న స్నేహితుద‌డ‌ని..ఆయ‌న తో పాటుగా ఉత్త‌రాంధ్ర‌లో కుటుంబ మూలాలు ఉన్న కెసిఆర్ తిరిగి తెలంగాణ సీయంగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తుండ‌టంతో సంబ‌రాలు నిర్వ‌హిస్తున్నామ‌ని నిర్వాహ‌కులు చెబుతున్నారు.

Andhra Rashtra Samithi starting in AP : inviting KCR to AP..

ఇక‌, త్వ‌ర‌లో కెసిఆర్ ను ఏపికి ఆహ్వానించాల‌ని సంఘం నిర్ణ‌యించింది. ఎంత‌మంది ఏక‌మైనా అత్య‌ధిక సీట్లు సాధించ టం ద్వారా కెసిఆర్ దేశంలోనే ద‌మ్మున్న రాజ‌కీయ నాయుడుగా గుర్తింపు పొందార‌ని స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు. త్వ‌ర లోనే ఆంధ్రా రాష్ట్ర స‌మితిని ఏపిలో...టిఆర్‌య‌స్ త‌ర‌హాలో ఏర్పాటుకు కృషి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. రెండు రోజులుగా కెసిఆర్ తాను ఏపిలో ప‌ర్య‌టిస్తాన‌ని..చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌ని గ‌ట్టిగా చెబుతున్నారు. ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర బాబు సైతం కెసిఆర్ ఏపికి రావ‌చ్చ‌ని పేర్కొన్నారు. దీంతో..ఏపిలో ఎన్నిక‌ల‌కు ముందే తెలంగాణ నేత‌ల జోక్యం ఎలా ఉంటుంది..ఎవ‌రి పై ప్ర‌భావం ఉంటుంద‌నే చ‌ర్చ సాగుతోంది. ఇదే స‌మ‌యంలో కెసిఆర్ అభిమానులు ఏపిలోనూ వెలుగు లోకి వ‌స్తున్నారు. మ‌రి , వీరి ఆహ్వానాన్ని కెసిఆర్ ఎంత వ‌ర‌కు ఆమోదిస్తారో చూడాలి..

English summary
After victory of Telangana fans of KCR becoming huge in AP. some residents of Visaka district are appreciating KCR leader ship skills and decided to start Andhra Rashtra Samithi in AP. They inviting KCR to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X