విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజల కష్టాలు వినరా.. సీఎం ఇంటి దగ్గర 144 సెక్షన్ ఎందుకు.. చంద్రబాబు ట్వీట్ల యుద్దం

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మాటలతో పరోక్ష యుద్ద వాతావరణం కనిపిస్తోంది. ఆ క్రమంలో తాజాగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ల యుద్దం హీట్ పుట్టిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్‌గా ఆయన సంధించిన మాటల తూటాలు చర్చానీయాంశంగా మారాయి.

ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను తీసేసి, కొత్తవాళ్ళను తెచ్చుకోవడం, వాటికే ఉద్యోగాల కల్పన అని పేరుపెట్టుకోవడం ఏం పిచ్చిపనో నాకర్థం కావడం లేదు. అలాంటప్పుడు ఔట్ సోర్సింగ్ వాళ్ళను పర్మినెంట్ చేస్తామని హామీలు ఎందుకిచ్చినట్టు అంటూ కడిగిపారేశారు. అంతేకాదు మీ మాటలు నమ్మి, మిమ్మల్ని గెలిపించి, ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే మహిళలని కూడా చూడకుండా ఇంత దారుణంగా, కర్కశంగా వ్యవహరిస్తారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఒక్క ఉద్యోగం ఊడగొట్టకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని టీడీపీ డిమాండ్ చేస్తోందంటూ మరో ట్వీట్ చేశారు.

andhrapradesh ex cm chandrababu naidu questioned cm ys jaganmohan reddy

అక్బరుద్దీన్ కామెంట్స్‌.. హోంమంత్రి కీలక వ్యాఖ్యలు.. ఛార్జ్ షీట్ ఎప్పుడో మరి?అక్బరుద్దీన్ కామెంట్స్‌.. హోంమంత్రి కీలక వ్యాఖ్యలు.. ఛార్జ్ షీట్ ఎప్పుడో మరి?

ప్రజలు కష్టాలు చెప్పుకోడానికి సీఎం దగ్గరికి వస్తుంటే ముఖ్యమంత్రి నివాసం చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుంటారా? ఇది ముఖ్యమంత్రి ఇల్లా? లోటస్ పాండ్ లాంటి ప్రైవేటు రాజభవనమా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరుస ట్వీట్లతో ధ్వజమెత్తిన చంద్రబాబుకు దీటైన సమాధానం చెప్పేందుకు అటు వైసీపీ లీడర్లు సన్నద్దమవుతున్నారు. ఇదివరకే వైసీపీ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేశ్‌పై ట్వీట్ల యుద్దం చేస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Andhra Pradesh politics is heating up with the words of the TDP and YCP leaders, the indirect war atmosphere looks. To this end, the heat of the latest tweets made by former CM Chandrababu Naidu on present Chief Minister YS Jaganmohan Reddy's talk as a target has become a subject of debate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X