విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడలో మంత్రి కొడాలి నానీపై మరో ఫిర్యాదు .. ఆ వ్యాఖ్యలే కారణం

|
Google Oneindia TeluguNews

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ టీటీడీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల కి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, తిరుమల తిరుపతి దేవస్థానం ఎవడి అమ్మ మొగుడు కట్టాడు అని తీవ్రపదజాలంతో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నానికి పెద్ద తలనొప్పిగా మారాయి.

మంత్రి కొడాలి నానీ నోటిదురద ఎఫెక్ట్ ... తలనొప్పిగా మారిన రెండు వివాదాలుమంత్రి కొడాలి నానీ నోటిదురద ఎఫెక్ట్ ... తలనొప్పిగా మారిన రెండు వివాదాలు

ఇక ఈ వ్యాఖ్యలపై అటు తిరుమలలో బిజెపి నేత సూర్యప్రకాష్ రావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, విష్ణువర్ధన్ రెడ్డి సైతం మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక తాజాగా విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో మంత్రి కొడాలి నానిపై వేమూరి ఆనంద సూర్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మంత్రి కొడాలి నాని హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా టీటీడీపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Another complaint against Minister Kodali Nani in Vijayawada ..

Recommended Video

Kanna Lakshmi Narayana Comments On YS Jagan || ఏపీలో మత మార్పిడులు జరుగుతున్నాయి || Oneindia Telugu

కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. వెంటనే కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై కొడాలి నాని ఇప్పటివరకు స్పందించలేదు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్న మంత్రి కొడాలి నాని పై సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్య తీసుకోవాలని, దానిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో నాని తీవ్రంగా మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీల నాయకులకు, హిందూ సంఘాలకు ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి.

English summary
Vemuri Ananda Surya complained on Minister Kodali Nani at Vijayawada Suryaraoopet police station. The complaint stated that he had made inappropriate comments on the TTD to hurt the sentiments of Hindus . He said Kodali Nani's comments were provocative. He demanded that a case be registered against Kodali Nani immediately
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X