విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరుద్యోగులకు పండుగ లాంటి వార్త .. 15,971 ఉద్యోగాలు భర్తీ చెయ్యాలని సీఎం వై ఎస్ జగన్ ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి సర్కార్ నిరుద్యోగ యువతకు మరోమారు శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ ముందు పండుగ లాంటి వార్త చెప్పింది. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలను కల్పించిన వైసీపీ సర్కార్ మరో నోటిఫికేషన్ కు రంగం సిద్ధం చేసుకుంటుంది. సీఎం జగన్ అధికారులకు ఆ దిశగా ఆదేశాలు జారీ చేశారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్షలో గుడ్ న్యూస్ చెప్పిన జగన్

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్షలో గుడ్ న్యూస్ చెప్పిన జగన్

ఏపీలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో వారందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటానికి కంకణం కట్టుకున్న వైసీపీ ప్రభుత్వం మరో మారు నిరుద్యోగులకు బంపర్ ఛాన్స్ ఇవ్వనుంది. జగన్ సీఎంగా వచ్చిన నాటి నుండి నిరుద్యోగం తగ్గించటానికి తీసుకుంటున్న చర్యలు, విడుదల చేస్తున్న నోటిఫికేషన్లతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రోజు అమరావతిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.

సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 15,971 ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 15,971 ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

ముఖ్యంగా గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీ చెయ్యాలని అధికారులను ఆదేశించారు. గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగాల భర్తీ చెయ్యనుంది .సచివాలయాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 15,971 ఉద్యోగాలు భర్తీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జనవరిలో భారీగానే ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్న వైసీపీ సర్కార్

జనవరిలో భారీగానే ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్న వైసీపీ సర్కార్


కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు నిర్మించాలని అందులో మరో 3,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. మినీ గోడౌన్ల నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించిన సీఎం జగన్ ఉపాధిహామీ నిధులతో స్కూళ్లకు ప్రహారీ గోడలను నిర్మించాలన్నారు.
ఇక, ఫిబ్రవరి నుంచి ఇంటి దగ్గరకే పెన్షన్లు వస్తాయని చెప్పారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందించాలన్న సీఎం జగన్ పెన్షన్ల కోసం ఎదురుచూపులు లేకుండా చెయ్యాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇక ఇది ఇలా ఉంటే ఏపీ సర్కార్ జనవరిలో భారీగానే ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. 44,941 పోస్టుల భర్తీకి ఈ దఫా శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది.

English summary
The state government, which had previously filled the jobs the village secretariats and now again they are going to fill the pending posts with notification, will once again planning to give the village secretariat jobs for 15,971 posts . CM Jagan Mohan Reddy has given orders to the Panchayati Raj and Rural Development Department officials
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X