విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు .. కొనసాగుతున్న చివరి అంకం

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. జులై 11న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలలో పలు కీలక బిల్లులను క్యాబినెట్ ఆమోదించడంతో పాటు గా, వైసీపీ టీడీపీల మధ్య రోజుకొక యుద్ధంతో కొనసాగాయి. ఇక నేటితో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల పర్వానికి ఎండ్ కార్డు పడనుంది.

ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో శాసనసభ 16 బిల్లులను ఆమోదించింది. ఇక వాడీ వేడి చర్చలతో విమర్శలు, ప్రతి విమర్శలతో సభా పర్వం రసవత్తరంగా సాగింది.

 ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కుంటా అంటున్న జనసేనాని ... అందుకే సరికొత్త వ్యూహం ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కుంటా అంటున్న జనసేనాని ... అందుకే సరికొత్త వ్యూహం

 ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో 16 కీలక బిల్లులను ఆమోద ముద్ర

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో 16 కీలక బిల్లులను ఆమోద ముద్ర

జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుతో పాటు శాశ్వత బిసి కమిషన్ ఏర్పాటు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50% కేటాయింపు, 75% స్థానికులకే ఉద్యోగాలు, ద్రవ్య వినిమయ బిల్లు వంటి కీలక బిల్లులకు ఆమోదముద్ర లభించింది. కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ వ్యాఖ్యలు వైసిపి ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో కాపు రిజర్వేషన్ల అంశంపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు జగన్. ఇక ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ జగన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంద కృష్ణ మాదిగ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. నేడు అసెంబ్లీని ప్రయత్నం చేస్తున్న క్రమంలో భారీగా భద్రతా బలగాలు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 సభలో ప్రతిపక్ష పార్టీగా టీడీపీ జగన్ పాలనపై , ఎన్నికల హామీలపై ప్రశ్నల వర్షం

సభలో ప్రతిపక్ష పార్టీగా టీడీపీ జగన్ పాలనపై , ఎన్నికల హామీలపై ప్రశ్నల వర్షం

శాసనసభ సమావేశాలలో ఇప్పటివరకు గత ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీల విషయంలో టిడిపి పలు ప్రశ్నలను లేవనెత్తింది. అమరావతి భూముల వ్యవహారం, పోలవరం ప్రాజెక్టు పనులను రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలనే నిర్ణయం, అక్రమ భవనాల కూల్చివేత, రైతులకు విత్తనా కొరత , విద్యుత్ కోతలు వంటి అనేక అంశాలపై టీడీపీ వైసీపీ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒక దశలో టిడిపి నుండి తమ వాణిని గట్టిగా వినిపిస్తున్న ముగ్గురు నేతలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెండ్ చేశారు. నిమ్మల రామా నాయడు, అచ్చెన్నాయుడు , గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబుకు బాసటగా నిలిచి వైసీపీ విమర్శలను తిప్పికొట్టారు.

టీడీపీ టార్గెట్ గా వైసీపీ .. వైసీపీ టార్గెట్ గా టీడీపీ

టీడీపీ టార్గెట్ గా వైసీపీ .. వైసీపీ టార్గెట్ గా టీడీపీ

టిడిపిపై కక్షపూరిత చర్యల్లో భాగంగా వైసిపి ప్రభుత్వం పని చేస్తుందని అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసింది టిడిపి. ఇక టిడిపి హయాంలో అవినీతి రాజ్యమేలిందని, అవినీతిని ప్రక్షాళన చేయడానికి పని చేస్తున్నామని ప్రజలకు తెలియజేసేందుకు వైసిపి ప్రయత్నించింది.

మొత్తంగా సవాళ్లు ప్రతిసవాళ్లు తో, విమర్శలు, ప్రతి విమర్శలతో, ఆందోళనలు, నిరసనలతో సభాపర్వం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కింది. ఇక నేడు చివరి రోజు కాబట్టి ప్రశ్నోత్తరాల కు ఎక్కువ సమయం కేటాయించాలన్నారు ముఖ్యంగా నిరుద్యోగ భృతి, అన్న క్యాంటిన్లు మూసివేత, మంత్రులు అధికారులకు క్వార్టర్ ల నిర్మాణ పురోగతి వంటి అంశాలపై టిడిపి ప్రశ్నలను లేవనెత్తింది. నేడు ఉభయ సభలలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. ఇక నేటితో సభాపర్వం సమాప్తం అవుతుంది.

English summary
AP Assembly Budget Sessions are scheduled to end today. As the cabinet approved several key bills at its budget meetings beginning on July 11, the YCP continued with a day-to-day battle between the TDP. AP Assembly budget session will be the end card today. The Legislature passed 16 bills during the budget session in this Assembly. With the heated debate and criticism, Sabha Parvam has gone on a rampage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X