విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీలోకి రావాల‌నుకుంటున్నారా.. అయితే: చ‌ంద్ర‌బాబుకు అవ‌కాశం ఇద్దాం: సీఎం జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు..

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పార్టీ పిరాయింపుల మీద మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. చంద్ర‌బాబు లాగా శాస‌న‌సభ‌లో ప్ర‌తి ప‌క్షానికి విలువ లేకుండా..ప్ర‌తిప‌క్ష నేత మాట్లాడ‌నీయ‌కుండా తాము చేయ‌మ‌ని..త‌న‌కు టీడీపీ అధినేత‌కు తేడా ఉంద ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. తాను చేయాల‌నుకుంటే చంద్ర‌బాబుకు ప్ర‌తిప‌క్ష నేత హోదా లేకుండా చేయ‌గ‌ల‌మ‌ని.. అలా చేయ‌న‌ని స్ప‌ష్టం చేసారు. వైసీపీలోకి రావాల‌నుకుంటున్నారా..అయితే అంటూ త‌న ష‌ర‌తు ఏంటో మ‌రోసారి స్ప‌ష్టంగా వివ‌రించారు. ఎమ్మెల్యేలు శాస‌న‌స‌భ‌లో యాక్టివ్ గా వ్య‌వ‌హ‌రించాల‌ని సీఎం సూచించారు.

వైసీపీలోకి రావాల‌న‌కుంటున్నారా..
ఏపీ అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో ఎమ్మెల్యేల‌కు శిక్ష‌ణా శిబిరం నిర్వ‌హించారు. స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం స‌భ్యుల‌కు సూచ‌న‌లు చేసారు. స‌భ‌లో స‌మ‌య పాల‌న ముఖ్య‌మ‌ని..ప్ర‌తీ స‌భ్యుడు స‌భా నియ‌మాల పైన అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని సూచించారు. అదే విధంగా అధికార పార్టీ అయినంత మాత్రాన స‌భ్యుల‌కు ప‌దేప‌దే అవ‌కాశాలు రావ‌ని.. నిర్ణీత ఫార్మాట‌ట్‌లో వ‌స్తేనే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని స్ప‌ష్టం చేసారు. ఈ స‌మావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు. శాస‌న మండ‌లి ఛైర్మ‌న్‌..పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌భ్యుల‌కు ప‌లు సూచ‌న‌లు చేసారు. స‌భ‌లో చ‌ర్చ జ‌రిగే ప్ర‌తీ అంశం మీద స‌భ్యుల‌కు అవ‌గాహ‌న ఉండాల‌న్నారు. దీని కోసం ముందు గానే సిద్దం కావాల‌ని..తాను స‌భ‌లో మాట్లాడే అంశాల పైన ఉద‌యం నాలుగు గంట‌ల‌కు లేచి సిద్దం అయ్యేవాడిన‌ని వివ‌రించారు. ఇక‌, వైసీపీలోకి రావాల‌నుకొనే ఇత‌ర స‌భ్యులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి రావాల‌ని మ‌రోసారి త‌న విధానం స్ప‌ష్టం చేసారు.

AP Assembly conducted training program for MLAs.. CM Jagan asked MLAs to prepare well before discussions..

చంద్ర‌బాబుకు హోదా లేకుండా ..
చంద్ర‌బాబుకు ప్ర‌తిప‌క్ష నేత హోదా లేకుండా చేద్దామ‌ని..ఇందుకోసం టీడీపీ నుండి ఏడుగురిని తీసుకుంటే సరి పోతుందంటూ కొంద‌రు సూచించినా తాను విన‌లేద‌న్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబుకు స‌భ‌లో త‌గిన స‌మ‌యం ఇద్దామ‌ని జ‌గ‌న్ ప్ర‌తిపాదించారు. స‌భ‌లో చ‌ర్చ జ‌రిగితేనే ఎవ‌రి స‌త్తా ఏంటో తెలుస్తుంద‌ని చెప్పుకొచ్చారు. వైసీపీ నుండి గెలిచిన కొత్త ఎమ్మెల్యేల‌కు ప్ర‌తీ ప‌ది మందికి ఒక సీనియ‌ర్‌ను అటాచ్ చేయాల‌ని సూచించారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను సైతం మాట్లాడ‌నీయ‌టం ద్వారా మ‌నం చెప్పేదీ..చేస్తుందీ ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంద‌ని వివ‌రించారు. స‌భ‌లో
అధికార, ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనిస్తూ ఉంటారన్నారు. ఈ నెల 11 నుండి శాస‌న‌స‌భా బడ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. 12వ తేదీన స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. రెండు రోజుల పాటు శాస‌న స‌భ్య‌ల శిక్ష‌ణా త‌ర‌గ‌తులు కొన‌సాగనున్నాయి.

English summary
AP Assembly conducted training program for MLA's for two days. CM Jagan asked MLA's to prepare well before participating discussion in house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X