విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స‌భ‌లో రోజా భావోద్వేగం..నాతోటే ప‌ద‌వులు ఆరంభం:జ‌గ‌న్‌కు ఆయ‌న కుమార్తే స్పూర్తి: కీల‌క బిల్లుల ఆమోదం

|
Google Oneindia TeluguNews

ఏపీ శాస‌న‌స‌భ చ‌రిత్రాత్మ‌క బిల్లుల‌ను ఆమోదించింది. నామినేటెడ్ ప‌ద‌వుల్లో..ప‌నుల్లో 50శాతం మ‌హిళ‌ల‌కు కేటాయి స్తూ ప్ర‌తిపాదించిన బిల్లుకు ఆమోదం ల‌భించింది. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు బిల్లు సైతం ఆమోదం పొంది చట్టరూపం దాల్చింది. మ‌హిళ‌ల‌కు 50 శాతం ప‌ద‌వుల‌ను రిజ‌ర్వ్ చేస్తూ బిల్లు ఆమోదం స‌మ‌యంలో వైసీపీ కీల‌క నేత రోజా మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యారు. రాష్ట్రంలో త‌న‌కు కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌టం ద్వారానే ఈ బిల్లును ముఖ్య‌మంత్రి ఆచ‌ర‌ణ రూపంలోకి తీసుకొచ్చారంటూ వివ‌రించారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు పైన రోజా విమ‌ర్శ లు చేసారు. ప్ర‌తిపక్షం వాకౌట్ చేయ‌టంతో వారు చ‌ర్చ‌లో పాల్గొన‌లేదు. దీంతో స‌భ‌లో ఈ బిల్లుల‌ను ఆమోదించారు.

మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు..

మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు..

చరిత్రాత్మక బిల్లులను ఏపీ శాసనసభ ఆమోదించింది. నామినేటెడ్‌ పదవుల్లో, నామినేషన్‌ పనుల్లో 50 శాతం రిజర్వేష న్లను మహిళలకు కల్పిస్తూ తీసుకువచ్చిన చరిత్రాత్మక మహిళా సాధికారిత బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం అన్ని కార్పొరేషన్లు, సొసైటీ పదవుల్లో, బోర్డులు, కమిటీల చైర్‌పర్సన్‌ పదవుల్లో మహిళలకు సగం పదవులు దక్కనున్నాయి. ఈ బిల్లు మీద ప‌లువురు మ‌హిళా ఎమ్మెల్యేలు మాట్లాడారు. అని న్ని రంగాల్లో మహిళలకు అవకాశం కల్పించేందుకే తమ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కొనియాడారు. కాంట్రాక్టు ల్లో కూడా మహిళలకు స్థానం కల్పించడం గొప్ప విషయమని జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయం పాటిస్తున్నారని కొనియాడారు.కాంట్రాక్టుల్లో కూడా మహిళలకు స్థానం కల్పించడం గొప్ప విషయ మన్నారు. గత ప్రభుత్వం డ్వాక్రా రుణామాఫీ పేరుతో మహిళలను నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తం చేశారు.

స‌భ‌లో రోజా భావోద్వేగం..

స‌భ‌లో రోజా భావోద్వేగం..

ఇదే అంశం మీద ఎమ్మెల్యే రోజా భావోద్వేగంతో ప్ర‌సంగించారు. గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌ను కేవ‌లం ఓట‌ర్లుగానే చూసార‌ని ఆరోపించారు. మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇస్తే ఎదిగి చూపిస్తార‌నటానికి జ‌గ‌న్ కుమార్తె ఉదాహ‌ర‌ణ అని రోజా వ్యాఖ్యానించారు. అతి కొద్ది మందికి అవ‌కాశం ద‌క్కే లండ‌న్ యూనివ‌ర్సిటీలో సీటు వ‌చ్చింద‌ని గుర్తు చేసా రు. మ‌హిళ‌ల‌కు 50 శాతం ప‌ద‌వుల్లో రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌టం అనేది చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌య‌మ‌ని..అందులో భాగంగా త‌న‌కు ఏపీఐఐసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చార‌ని ..త‌న‌తోటే ఈ బిల్లు ఆచ‌ర‌ణ ఆమోదం పొంద‌క ముందే అమ‌లు అవుతోంద‌ని రోజా చెప్పుకొచ్చారు. టీడీపీ హాయంలో వ‌న‌జాక్షి అంశాన్ని ప్ర‌స్తావించారు. ప్ర‌తీ మ‌హిళ‌లో త‌న సోద‌రిని చూసుకొనే సీఎం ఉండ‌టం త‌మ అదృష్ట‌మ‌ని చెప్పారు. వైసీపీ గౌర‌వాధ్య‌క్షురాలు సైతం మ‌హిళ విజ‌య‌మ్మ ఉన్నార‌ని వివ‌రించారు. ఈ బిల్లు ఇష్టం లేక‌నే టీడీపీ వాకౌట్ చేసింద‌ని రోజా విమ‌ర్శించారు.

టీడీపీ వాకౌట్‌..బీసీ క‌మిష‌న్ బిల్లు ఆమోదం..

టీడీపీ వాకౌట్‌..బీసీ క‌మిష‌న్ బిల్లు ఆమోదం..

ఈ బిల్లుల పైన చ‌ర్చించి ఆమోదించే స‌మ‌యంలో టీడీపీ వాకౌట్ చేసింది. అంత‌కు ముందు ముగ్గురు టీడీపీ ఎమ్మె ల్యేల‌ను స‌స్పెండ్ చేయ‌టంతో స‌భ‌లో ఆందోళ‌న చేసిన టీడీపీ త‌రువాత బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. వైసీపీ స‌భ్యుడు మేరుగ నాగార్జున చంద్ర‌బాబు గురించి తీవ్ర విమ‌ర్శ‌లు చేసారు. స‌భ‌లో శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న బీసీ క‌మీష‌న్ ఏర్పాటు బిల్లుకు ఏపీ శాస‌న‌స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదించింది.

English summary
AP Assembly passed key bill 50 percent reservation for women in posts and nomination works. At the same time another bill passed BC Commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X