• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టోల్‌ గేట్ వద్ద స్కూటర్‌కు టోల్ ఫీజా? సీఎం జగన్‌పై చంద్రబాబు సెటైర్లు.. నన్ను అవమానిస్తే..

|
  AP Assembly Winter Sessions 2019 : స్కూటర్‌కు టోల్ ఫీజు అంట, ఏమండోయ్ ఇది విన్నారా ? | Oneindia

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య బుధవారం మాటల యుద్ధం భారీగానే జరిగింది. ఉల్లిధర, రైతు, ఇతర సమస్యలపై సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది. ఓ దశలో తనపై చేసిన ఆరోపణలపై చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్‌కు టోల్ ఫీజ్‌పై కూడా అవగాహన లేదని, ఏదైనా మాట్లాడటప్పుడు తప్పులు దొర్లడం సహజం.. అంతమాత్రాన అవమానించే విధంగా మాట్లాడటం తగదని ఘాటుగా స్పందించారు. సభలో చంద్రబాబు మాట్లాడుతూ..

  హెరిటేజ్‌తో సంబంధం లేదు

  హెరిటేజ్‌తో సంబంధం లేదు

  హెరిటేజ్‌లో ఉల్లి ధర అంశంపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. హెరిటేజ్ సంస్థ తనదేనంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న ఆరోపణలపై చంద్రబాబు స్పందిస్తూ.. తాము ఫ్యూచర్ గ్రూప్‌కు అమ్ముకొన్నట్టు వివరణ ఇచ్చినా దానిపై సభలో రాద్దాంతం చేస్తున్నారని, దానిని రికార్డుల నుంచి తొలగించాలని సూచించారు. తాను చెప్పినా మంత్రి బుగ్గన రీసెర్చ్ చేసి హెరిటేజ్ తమదేనని చెప్పడంపై అభ్యంతరం తెలిపారు. ఫ్యూచర్ గ్రూప్‌కు అమ్మిన తర్వాత తమ ప్రమోటర్ వాటాలకు ఏప్రిల్ వరకు లాకింగ్ పిరియడ్ ఉందనే విషయాన్ని వెల్లడించారు.

  టోల్ గేట్ వద్ద స్కూటర్ ఫీజా?

  టోల్ గేట్ వద్ద స్కూటర్ ఫీజా?

  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు దేనికి టోల్ కడుతారో తెలియదని ఎద్దేవా చేశారు. తన ప్రసంగంలో ఈనాడుకు బదులు సాక్షి అని తప్పుగా మాట్లాడితే.. తనను కించ పరిచే విధంగా మంత్రి కన్నబాబు మాట్లాడటం తగదని అన్నారు. అదే వైఎస్ జగన్ సోమవారం సభలో మాట్లాడుతూ.. దిశ టోల్ గేట్ వద్దకు వెళ్లి స్కూటర్‌కు టోల్ ఫీజు కడుతుంటే అని మాట్లాడారు. స్కూటర్‌కు టోల్ ఫీజు కట్టరనే విషయం తెలియకుండా ముఖ్యమంత్రిగా ఉన్నారు అని చంద్రబాబు వ్యాంగ్యాస్త్రాలు వదిలారు.

  తన కుమారుడి విషయం ప్రస్తావించొద్దు

  తన కుమారుడి విషయం ప్రస్తావించొద్దు

  సభలో తన కుమారుడు లోకేష్ విషయాన్ని ప్రస్తావించడంపై ప్రతిపక్షనేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తన కుమారుడి గురించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ వ్యాఖ్యలు చేస్తే స్పష్టంగా చెప్పానని.. అమెరికాలో నా కొడుకు చదువుకొన్నాడు.. నీ కుమారుడిని అమెరికాకు పంపిస్తే తిరుగు టాపాలో వెనకకు వచ్చారనే విషయాన్ని సభలో చంద్రబాబు వెల్లడించారు.

  మీ కార్యకర్తలకే 4 లక్షల ఉద్యోగాలు

  మీ కార్యకర్తలకే 4 లక్షల ఉద్యోగాలు

  బాబు పోతే జాబు అనే వైసీపీ చేస్తున్న విమర్శలపై చంద్రబాబు స్పందిస్తూ.. వైసీసీ ప్రభుత్వం 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ప్రచారం చేసుకొంటున్నారని.. అవన్నీ తమ కార్యకర్తలకే ఇచ్చారు అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి కియా మోటార్స్ తెచ్చానని, ఆ ఘనత మాదేనని, దాంతో ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. చివరకు నీవు కూడా కియో మోటార్స్‌కు వెళ్లి ఫోటో దిగావు చంద్రబాబు అన్నారు.

  రైతులను ఆదుకోండి.. మడమ తిప్పొద్దు

  రైతులను ఆదుకోండి.. మడమ తిప్పొద్దు

  మాట తప్పను.. మడమ తిప్పను అని అనడం కాదు.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకోవాలని సీఎం వైస్ జగన్‌కు సూచించారు. రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే మడమ తిప్పడం లేదా రెండు చేతులు తిప్పడమో చేయాలని చంద్రబాబు సెటైర్లు వేశాడు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra pradesh assembly sessions 2019: TDP leader Chandra Babu satires on YS Jagan Mohan Reddy over Toll gate fee.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more