విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మ‌రో న‌లుగురి టీడీపీ స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌: కేసీఆర్ మంచివాడ‌న్న సీఎం..టీడీపీ అభ్యంత‌రం..ర‌భ‌స‌..!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాస‌న‌స‌భ‌లో మ‌రో సారి టీడీపీ స‌భ్యుల మీద స‌స్పెన్ష‌న్ వేటు ప‌డంది. తెలంగాణ‌తో ఏపీ ప్ర‌భుత్వం ప్రాజెక్టుల నిర్మాణం ..ప‌ర‌స్ప‌ర నీటి వినియోగం పైన చ‌ర్చ జ‌రిగింది. దీనికి ముఖ్య‌మంత్రి స‌మాధానం ఇచ్చే స‌మ‌యంలో టీడీపీ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు చేరి నినాదాలు చేసారు. స్పీక‌ర్‌..ముఖ్య‌మంత్రి..అసెంబ్లీ వ్య‌వ హారాల శాఖ మంత్రి అభ్య‌ర్దించినా విన‌లేదు. దీంతో..వారి పైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు. అసెంబ్లీ వ్య‌వ‌హారా శాఖ మంత్రి న‌లుగురి స‌భ్యుల మీద సస్పెన్ష‌న్ తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. స్సీక‌ర్ ఆమోదించి..న‌లుగురు టీడీపీ స‌భ్యుల మీద సస్పెన్ష‌న్ వేటు వేసారు.

మ‌రో సస్పెన్ష‌న్ వేటు..

మ‌రో సస్పెన్ష‌న్ వేటు..

ఏపి శాస‌న‌స‌భ‌లో మ‌రోసారి టీడీపీ స‌భ్యుల పైన స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. ఇప్ప‌టికే టీడీపీ శాస‌న‌స‌భా ఉప‌నేత‌లు ముగ్గురి పైన ఈ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కూ స్పీక‌ర్ స‌స్పెన్ష‌న్ వేటు వేసారు. తాజాగా.. మ‌రో న‌లుగురి స‌భ్యుల మీద స్పీక‌ర్ స‌స్పెన్ష‌న్ వేటు వేస్తూ నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో తెలంగాణ ప్ర‌భుత్వంతో తాము జ‌రుపుతున్న చర్చ‌లు..నీటి పంప‌కాల మీద చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు..ప‌య్యావుల కేశ‌వ్ సైతం ఈ చ‌ర్చ‌లో పాల్గొన్నారు. దీనికి ఇరిగేష‌న్ మంత్రి స‌మాధానం ఇచ్చిన త‌రువాత‌..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సైతం ప్ర‌భుత్వ ఉద్దేశం స్ప‌ష్టం చేసారు. ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నించ‌గా..జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. కేసీఆర్ మీద త‌న‌కు ప్ర‌త్యేకంగా ప్రేమ లేద‌ని..కేసీఆర్ మంచివాడ‌ని కితాబిచ్చారు. దీంతో.. టీడీపీ స‌భ్యుల స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు వ‌చ్చి ఆందోళ‌న‌కు దిగారు. ముఖ్య‌మంత్రికి వ్య‌తిరేకంగా నినాదాలు చేసారు. వారి నినాదాల మ‌ధ్య‌నే ముఖ్య‌మంత్రి త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు.

 కౌలు రైతుల బిల్లు ప్ర‌వేశ పెట్టే స‌మ‌యంలో..

కౌలు రైతుల బిల్లు ప్ర‌వేశ పెట్టే స‌మ‌యంలో..

ముఖ్య‌మంత్రి స‌మాధానం ముగిసిన త‌రువాత డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ కౌలు రైతుల‌కు మేలు చేసే అంశాల పైన బిల్లును చ‌ర్చ‌కు ప్ర‌తిపాదించారు. అయ‌న మాట్లాడుతున్న స‌మ‌యంలో టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. సీఎం జోక్యం చేసుకొని కౌలు రైతుల‌కు మేలు చేసే బిల్లును ప్ర‌వేశ పెడుతున్నార‌ని.. టీడీపీ నేత‌లు స‌హ‌క‌రించ‌టానికి సిద్దంగా లేరంటూ ఫైర్ అయ్యారు. వారి మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసారు. ఆ వెంట‌నే అసెంబ్లీ వ్య‌వ‌హారాల శాఖా మంత్రి బుగ్గ‌న వెంట‌నే న‌లుగురి స‌భ్యులను ఒక్క రోజు శాస‌న‌స‌భ నుండి స‌స్పెండ్ చేయాల‌ని ప్ర‌తిపాదించారు. దీంతో..స్పీక‌ర్ వెంట‌నే ఆ న‌లుగురిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఆ న‌లుగురు స‌భ్యుల‌ను స‌భ నుండి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని ఆదేశించారు. వారు వెళ్ల‌క‌పోవ‌టంతో మార్ష‌ల్స్ ద్వారా వారిని బ‌య‌ట‌కు పంపించారు.

మొన్న ముగ్గురు..నేడు న‌లుగురు..

మొన్న ముగ్గురు..నేడు న‌లుగురు..

రెండు రోజుల క్రితం టీడీఎల్పీ ఉప నేత‌లు అచ్చెన్నాయుడు..బుచ్చ‌య్య చౌద‌రి..రామానాయుడును ఈ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కూ స్పీక‌ర్ సస్పెండ్ చేసారు. తిరిగి ఈ రోజు కీల‌క బిల్లులు ప్ర‌వేశ పెట్టే స‌మ‌యంలో టీడీపీ నేత‌లు స్సీక‌ర్ పోడియం మీద‌కు వెళ్లి ఆందోళ‌న‌కు దిగారు. ముఖ్య‌మంత్రి మాట్లాడే అంశాలు వినప‌డ‌కుండా మైకుల‌కు అడ్డు ప‌డ్డార ని వైసీపీ ఆరోపించింది. దీంతో..టీడీపీ స‌భ్యులు అశోక్‌..బాల వీరాంజ‌నేయ‌లు, వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు, వాసుప‌ల్లి గ‌ణేష్‌ను శాస‌న‌స‌భ నుండి ఈ రోజు స‌మావేశాలు ముగిసే వ‌ర‌కూ స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు.

English summary
AP Assembly Speaker once again suspended four members from TDP for one day. At The time time of discussion on Relations with Telangana Govt Cm answering the discussion TDP members started protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X