విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మండలి రద్దుకు కేబినెట్ ఆమోదం: కాసేపట్లో సభలో తీర్మానం: కేంద్రానికి సిఫార్సు..!

|
Google Oneindia TeluguNews

ఊహించిందే జరిగింది. ముందు నుండి చెబుతున్నట్లుగా ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశమే ప్రధానం అజెండాగా సమావేశమైన కేబినెట్ తొలి అంశంగా దీని పైనే చర్చ చేసింది. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే మండలి పరిణామాల పైన ముఖ్యమంత్రి మంత్రుల అభిప్రాయాలు సేకరించారు. ప్రజా మేలు కోసం తీసుకొనే నిర్ణయాలకు అడ్డు చెప్పే మండలి అవసరం లేదని పలువురు మంత్రులు సూచించారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్దతు ప్రకటించారు.

దీంతో..కేబినెట్ ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నిర్ణయం మేరకు కాసేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి తీర్మానం ప్రతిపాదిస్తారు. ప్రతిపక్షం టీడీపీ గైర్హాజరు కావాలని నిర్ణయించింది. అయినా.. ప్రభుత్వం దీనిపైన చర్చించి..ప్రతిపక్షం అభిప్రాయంగా జనసేన ఎమ్మెల్యే చెప్పే అంశాలను రికార్డు చేయనున్నారు. దీని పైన చర్చ తరువాత మండలి రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీ
ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది.

AP Cabinet Approved decision on Abolish of Council..

Recommended Video

Abolish Of AP Legislative Council Resolution In Assembly After AP Cabinet Passes || Oneindia Telugu

కేబినెట్ ఆమోదం..ఇక సభ ముందుకు
ప్రభుత్వం అనుకున్న విధంగానే ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. తొలుత సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవ టం వెనుక కారణాలను సహచర మంత్రులకు వివరించారు. మండలిలో సభ్యులుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న డిప్యూటీ సీఎం బోస్..మోపిదేవి ముందుగా మండలి రద్దుకు తమ మద్దతు ఉంటుందని కేబినెట్ లో ముఖ్యమంత్రికి స్పష్టం చేసారు. మిగిలిన మంత్రులు సైతం సీఎం నిర్ణయం సరైనదేనంటూ మద్దతిచ్చారు. దీంతో..తొలి అంశంగానే మండలి రద్దుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనికి అనుగుణంగానే ఇదే రోజు అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. దీని ద్వారా 2007లో వైయస్సార్ ప్రభుత్వంలో పునరుద్దరించిన ఏపీ శాసనమండలి ఆయన తనయుడి ప్రభుత్వంలో రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక, కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం వెళ్లనుంది. కేంద్రం ఎప్పటి లోగా దీని పైన తుది నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కర అంశం. అప్పటి వరకు మండలి సమావేశాలు..సెలెక్ట్ కమిటీ తమ విధులు తాము కొనసాగిస్తాయి.

English summary
AP Cabinet apporved abolish of legislative council. To day itself govt introduce resolution on this. After state govt reccomandation central govt have to take final decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X