విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అటు రాజ్యసభ.. ఇటు రాజ్‌భవన్: టాప్‌గేర్‌లో వైసీపీ: నేతల్లో ఫుల్ జోష్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టాప్‌గేర్‌లో కొనసాగుతోంది. పార్టీ నేతల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. రాజ్యసభకు ఎన్నికైన నలుగురు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రమాణ స్వీకారం.. కీలకమైన మంత్రివర్గ విస్తరణ ఒకేరోజు చోటు చేసుకోవడమే దీనికి కారణం. వైఎస్ఆర్సీపీ సభ్యులతో పాటు దేశవ్యాప్తంగా రాజ్యసభకు ఎన్నికైన 51 మంది నూతన సభ్యులు కాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే రాజ్‌భవన్‌లో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ప్రారంభమౌతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లోకి కొత్త మంత్రులు రానున్నారు.

వైఎస్ జగన్ ఫార్ములాను ఫాలో అవుతోన్న కేజ్రీవాల్: ఢిల్లీలో ఆ పథకం అమలు: కేబినెట్‌లో ఆమోదం వైఎస్ జగన్ ఫార్ములాను ఫాలో అవుతోన్న కేజ్రీవాల్: ఢిల్లీలో ఆ పథకం అమలు: కేబినెట్‌లో ఆమోదం

 10 గంటలకు రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం..

10 గంటలకు రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం..


వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన నలుగురు సభ్యులు ఈ ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ నలుగురూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికోసం వారంతా మంగళవారం సాయంత్రానికే ఢిల్లీకి చేరుకున్నారు. పార్లమెంట్ హౌస్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణం..

రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణం..

ఈ కార్యక్రమం ముగిసే సమయానికి విజయవాడలోని రాజ్‌భవన్‌లో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఆరంభమౌతుంది. ఈ మధ్యాహ్నం 1:29 నిమిషాలకు మంత్రివర్గ విస్తరణను చేపట్టారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయబోతున్నారు వైఎస్ జగన్. శ్రీకాకళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం శాసనసభ్యుడు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Recommended Video

YSRCP MP Raghurama Krishnam Raju met JP Nadda రఘురామరాజు ను లోక్ సభలో వెనక సీటుకు పంపేసిన YCP
జగన్ షెడ్యూల్ ఇదీ..

జగన్ షెడ్యూల్ ఇదీ..

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి వైఎస్ జగన్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. మధ్యాహ్నం 12:50 నిమిషాలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైఎస్ జగన్ రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్తారు. ఒంటిగంటకు రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. ప్రమాణ స్వీకార కార్యక్రామానికి హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే జగన్ మళ్లీ తన అధికారిక నివాసానికి బయలుదేరి వెళ్తారు. అనంతరం ఆయన శాఖల సమీక్షల్లో పాల్గొంటారు. శాంతిభద్రతల విషయంపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో సమీక్షిస్తారని తెలుస్తోంది.

English summary
Andhra Pradesh cabinet expansion and Ruling YSR Congress Party's newly elected Rajya Sabhe member oath take program held on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X