విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ- అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ, ఫోన్ ట్యాపింగ్‌ సహా కీలక అంశాలపై చర్చ..

|
Google Oneindia TeluguNews

అమరావతిలో భూముల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, గోదావరి వరదలపై ప్రధాన అజెండాగా కాసేపట్లో ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. కొత్త పారిశ్రామిక విధానం,టూరిజం పాలసీలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది..కరోనా నియంత్రణ చర్యలు, మూడు రాజధానుల ఏర్పాటు, ఇళ్లపట్టాల పంపిణీలో చట్టపరమైన సమస్యలపైనా క్యాబినెట్ చర్చించనుంది.. ఈ నెల 25న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై క్యాబినెనాట్ లో చర్చ జరగనుంది..

ఇవాళ కేబినెట్‌ భేటీ

ఇవాళ కేబినెట్‌ భేటీ


ఏపీ మంత్రివర్గ సమావేశం ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనుంది..ఇటీవల రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పారిశ్రామిక విధానానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేయనుంది..అన్ని వర్గాలను ప్రోత్సహించేలా కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళలకు, చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఇటీవల మంత్రి గౌతమ్ రెడ్డి కొత్త పాలసీని ఆవిష్కరించారు..ఈ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలపనుంది...ఇక రేపు కొత్త టూరిజం పాలసీని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు..కొత్త పాలసీ ద్వారా పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులు ఆకర్శించాలి అనేది ప్రభుత్వం ఆలోచన..ఇవాళ్టి క్యాబినెట్ లో కొత్త పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది..

రాజధాని, ఫోన్ ట్యాపింగ్, అపెక్స్‌ భేటీ..

రాజధాని, ఫోన్ ట్యాపింగ్, అపెక్స్‌ భేటీ..


ఇక రాజధాని అమరావతిలో భూముల కుంభకోణంపైనా క్యాబినెట్ చర్చించనుంది..గత ప్రభుత్వం హయాంలో రాజధాని భూముల్లో భారీ కుంభకోణం జరిగిందని చెప్తున్న ప్రభుత్వం...సీఐడీ విచారణ జరుపుతోంది..విచారణ కూడా కొలిక్కి వచ్చినట్లు సమాచారం..విచారణకు సంబంధించిన నివేదిక పై క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది..రాష్ట్రంలో ప్రముఖుల ఫోన్ లు ట్యాపింగ్ జరుగుతుందంటూ చంద్రబాబు ప్రధానికి లేఖ రాయడంపై కూడా చర్చ జరగనుంది...ఇక రెండు తెలుగురాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలు, ఈనెల 25న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశం పై క్యాబినెట్ చర్చించనుంది..

 కేబినెట్లో ఇతర అజెండా...

కేబినెట్లో ఇతర అజెండా...

తాజా గోదావరి వరదలపైనా క్యాబినెట్ చర్చ జర్చించనుంది. .నిన్న ఉభయగోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే ద్వారా వరద పరిస్థితి ని సీఎం సమీక్షించారు..ముంపు ప్రాంతాల ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం చెప్పారు...ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలపై క్యాబినెట్ చర్చించనుంది..కరోనా వ్యాప్తి నివారణ,ప్రభుత్వం టీసుకుంటున్న చర్యలపైన క్యాబినెట్ చర్చించనుంది. పాఠశాలలు,ఆసుపత్రుల్లో చేపట్టిన నాడు నేడు పథకం పై క్యాబినెట్ చర్చించనుంది..పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ,మొక్కడు రాజధానులు బిల్లులపై నెలకొన్న చట్టపరమైన సమస్యలను ఎలా అధిగమించాలనే దానిపై క్యాబినెట్ చర్చించే అవకాశం ఉంది..

English summary
andhra pradesh cabinet meeting is scheduled at 11am in velagapudi secretariat today. cabinet to discuss key issues like apex council meet, phone tapping, amaravati lands scam etc,;
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X