• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్..చంద్రబాబు నువ్వా నేనా సై: రాజధాని బిల్లు ఆమోదానికి గండం: సీఎం కొత్త స్కెచ్..!

|

మూడు రాజధానుల ప్రతిపాదను ఆచరణలోకి తీసుకురావాలని సీఎం జగన్. ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఇదే సమయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా శాసన ప్రక్రియ పూర్తి చేసేలా ముఖ్యమంత్రి జగన్ కసరత్తు. తమ వద్ద ఉన్న అస్త్రాలకు పదును పెడుతున్న చంద్రబాబు. ఈ నెల 20న ఉదయం కేబినెట్ సమావేశం..అందులో మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం..వెంటనే అసెంబ్లీ ఏర్పాటు..సభలో బిల్లు ప్రతిపాదన..అదే రోజు రాత్రికి బిల్లు ఆమోదం. అంత వరకూ ప్రభుత్వ వ్యూహం అమల్లో ఎక్కడా ఇబ్బంది లేదు. ఆ తరువాత ఈ బిల్లు మండలికి వెళ్లాల్సి ఉంది. అక్కడే అసలు గండం పొంచి ఉంది. చంద్రబాబు తన వ్యూహాల అమలుకు మండలిని కేంద్రంగా చేసుకుంటున్నారు. బిల్లు అక్కడ ఆమోదం పొందటం అంత సులువైన విషయం కాదు. ఒక వేళ తీర్మానం పెడితే..అది చట్టంగా నిలుస్తుందా.. మరి..ముఖ్యమంత్రి దీనికి కౌంటర్ గా ఎటువంటి స్కెచ్ సిద్దం చేస్తున్నారు..ప్రభుత్వంలో ఏం జరుగుతోంది..

బిల్లా..తీర్మానమా..అసెంబ్లీలో ఓకే..

బిల్లా..తీర్మానమా..అసెంబ్లీలో ఓకే..

మూడు రాజధానుల నిర్ణయం అమలు దిశగా ప్రభుత్వం ఈ నెల 20న శాసనసభా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మూడు రాజధానులు.. అమరావతి నుండి విశాఖకు పరిపాలనా రాజధాని విధుల తరలింపు పైన బిల్లు ప్రవేవ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సీఆర్డీఏ చట్టం రద్దు లేదా..సవరణలు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అసెంబ్లీ ముందుకు రానున్నాయి. . రాజధానిని విశాఖకు మార్చడం, మూడు రాజధానుల అంశం ఈ బిల్లులోనే పెడతారా లేక సీఆర్డీయే చట్టం సవరణకే పరిమితమవుతారా అన్నదానిపై స్పష్టత లేదు. బిల్లు ఎలా పెట్టినా అసెంబ్లీలో వైసీపీకి మెజారిటీ ఉండటంతో అక్కడ తేలికగా ఆమోదం పొందే అవకాశం ఉంది. అయితే, అసెంబ్లీలో ఏ పద్దతి అనుసరించినా.. అధికార పక్షానికి 151 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పాటుగా టీడీపీ నుండి బయటకు వచ్చిన వంశీ..జనసేన ఎమ్మెల్యే మద్దతు సైతం లభించే అవకాశాలు ఉన్నాయి.

మండలిలో పొంచి ఉన్న గండం..

మండలిలో పొంచి ఉన్న గండం..

ప్రభుత్వ ప్రతిపాదించే బిల్లు ఏదైనా అసెంబ్లీలో ఆమోదం పొందనుంది. ఆ తరువాత ఆ బిల్లు మండలికి వెళ్లాల్సి ఉంటుంది. శాసన మండలిలో టీడీపీకి భారీ మెజారిటీ ఉంది. మొత్తం 55మంది కౌన్సిల్‌ సభ్యుల్లో వైసీపీకి కేవలం తొమ్మిది మందే ఉన్నారు. టీడీపీతో పాటు పీడీఎఫ్‌, బీజేపీ కూడా రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల అక్కడ బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదు. శాసన మండలిలో టీడీపీకి భారీ మెజారిటీ ఉంది. మొత్తం 55మంది కౌన్సిల్‌ సభ్యుల్లో వైసీపీకి కేవలం తొమ్మిది మందే ఉన్నారు. టీడీపీతో పాటు పీడీఎఫ్‌, బీజేపీ కూడా రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల అక్కడ బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదు. దీంతో..ఉమ్మడి సమావేశాల ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. యితే ఈ అవకాశం పార్లమెంటులోనే ఉందని, రాజ్యాంగం ప్రకారం సంయుక్త సమావేశం అవకాశం రాష్ట్రాల్లో లేదని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల్లో బిల్లులు తప్పనిసరిగా రెండు సభల మధ్య తిరగాల్సిందేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

  High Power Committee Meeting Ends Today With CM Jagan || Oneindia Telugu
  ప్రభుత్వం ఏం చేయబోతోంది..

  ప్రభుత్వం ఏం చేయబోతోంది..

  అసెంబ్లీలో బిల్లు పెట్టకపోతే ప్రభుత్వం ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాజధాని మార్పుపై కేవలం ఒక తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రతిపాదించి అంతటితో ముగించవచ్చని.. సీఆర్డీయే చట్టంలో మార్పులపై మాత్రం విడిగా ఒక బిల్లును ప్రతిపాదించి రెండు సభలకు పంపవచ్చని చెబుతున్నారు. దీనివల్ల మండలి గండం నుంచి బయటపడొచ్చన్నది వారి అభిప్రాయం. కానీ రాజధాని మార్పు వంటి పెద్ద అంశంపై కేవలం ఒక తీర్మానం ద్వారా ముందుకెళ్తే అది న్యాయపరంగా నిలవకపోవచ్చని మరికొందరి విశ్లేషణ. అసెంబ్లీలో తీర్మానం చేస్తే దాన్ని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపాలని.. ఆ తీర్మానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా వ్యవహరించలేదనే అభిప్రాయాలు తెర మీదకు వస్తున్నాయి. అసెంబ్లీ చేసిన ప్రతి తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలన్న నియమం లేదని.. చాలావాటిపై కేంద్రం ఏ స్పందనా వ్యక్తం చేయకుండా పక్కన పడేసిన సందర్భాలు ఉన్నాయి. తీర్మానం చేయకుండా ప్రభుత్వం అసెంబ్లీలో ఒక ప్రకటన చేసి దానిపై చర్చ నిర్వహించి సరిపుచ్చడం మరో ప్రత్యామ్నాయం. కానీ అదీ న్యాయపరంగా నిలవదని, ఒట్టి ప్రకటన చేస్తే దానిపై కోర్టుల్లో వెంటనే స్టే పొందే వీలుంటుంది. అయితే, అధికార పార్టీ మాత్రం తమ వ్యూహాలు తమకు ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  AP Capital issue is on a boil with AP govt working out its strategies to pass the capital related bill.The bill will be passed in the Assembly as YCP which has majority while in Council the govt may face a hurdle. In this back drop Opposition leader Chandra Babu is working out his strategies to stop the passage of bill.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X