విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని నిర్మాణంపై ప్రజలకు స్పష్టత ఉంది... చంద్రబాబుకే లేదు: బోత్స

|
Google Oneindia TeluguNews

అయిదు కోట్ల ఆంధ్ర ప్రజలకు అమోదయోగ్యమైన రాజధానిని వైఎస్ఆర్‌సీపీ హాయంలోనే నిర్మించి తీరుతామని మున్సిపల్ శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ ప్రకటించారు. రాజధాని పక్కనే చంద్రబాబు వియ్యంకుడికి అయిదువేల ఎకరాల భూమిని కేటాయించారని ఆరోపణలు చేశారు. అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడ చంద్రబాబు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‌మోహన్ రెడ్డి హయాంలో అవినీతికి, దోపిడికి తావు లేకుండా పరిపాలన కొనసాగిస్తుందని మరోసారి ఉద్ఘటించారు.

రాజధాని నిర్మాణం పై నిపుణుల కమిటీ పర్యటిస్తుంది : బోత్స రాజధాని నిర్మాణం పై నిపుణుల కమిటీ పర్యటిస్తుంది : బోత్స

చంద్రబాబు చిత్తుగా ఓడినా మార్పు రాలేదు.

చంద్రబాబు చిత్తుగా ఓడినా మార్పు రాలేదు.

ఈ సంధర్భంగా ఏపీ రాజధాని నిర్మాణంతోపాటు ఇతర పరిపాలన అంశాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై బోత్స మరోసారి ఫైర్ అయ్యారు. ప్రజలు చీత్కరించిన ఆయనలో మార్పు రాలేదని తీవ్రంగా దుయ్యపట్టారు. చిత్తుగా ఆయన ఎన్నికల్లో ఓడిపోయినా చంద్రబాబు తీరు మారడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల మయం చేశాడని ఆయన పలు ఆరోపణలు చేశాడు.చంద్రబాబు హయాంలో ఒక లక్షా 65వేల కోట్ల రుపాయల అప్పులు చేశారని అని దుయ్యబట్టారు. ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరికి న్యాయం చేశావని ఆయన్ను ప్రశ్నించారు.

నిపుణుల కమిటీ మేరకే రాజధాని

నిపుణుల కమిటీ మేరకే రాజధాని

మరోవైపు నిపుణుల కమిటి ఎక్కడ రాజధాని నిర్మాణానికి సూచిస్తే అక్కడే ఏపీ రాజధాని నిర్మాణం కొనసాగుతుందని చెప్పారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే దానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈనేపథ్యంలోనే రాజధాని నిర్మాణంపై చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిన ప్రశ్నించే హక్కు లేదని అన్నారు. రాష్ట్ర విభజన కంటే చంద్రబాబు పరిపాలన వల్లే రాష్ట్రం ఎక్కువగా నష్టోయిందని విమర్శించారు. రాజధాని నిర్మాణంపై చంద్రబాబుకు పేరు వస్తుందనే ఆపారని చేస్తున్న వ్యాఖ్యలు హస్యస్పదమని పేర్కన్న ఆయన రాజధానిలో ఏం నిర్మించారని చంద్రబాబుకు పేరు వస్తుందని ఆయన ప్రశ్నించారు.రాజధాని నిర్మాణంపై ప్రజల్లో క్లారీటి ఉందని లేనిది చంద్రబాబు నాయుడుకే అని చెప్పారు.

ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన పీటర్ కమిటీ

ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన పీటర్ కమిటీ

మరోవైపు రాజధాని నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం వేసిన పీటర్ కమిటి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాజధాని నిర్మాణంలో ముప్పై వేల కోట్ల రుపాయాలు దుబారా ఖర్చు చేశారని నివేదికలో తెలిపినట్టు సమాచారం.దీంతోపాటు రాజధాని నిర్మాణాలు నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని కమిటి తెల్చింది. అక్కడ నిర్మిస్తున్న ప్రతి ప్రాజెక్టు, నిర్మాణాలను పున: సమీక్షించాలని నివేదికలో పేర్కోన్నారు.

English summary
Municipal Minister Botsa Satyanarayana has announced that the YSRCP will build a capital for the 5 crore Andhra people where like
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X