• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సోము వీర్రాజు vs సుజనా చౌదరి - రాజధానిపై సంచలన వ్యాఖ్యలు - బీజేపీ చీఫ్‌తో ఎంపీ విభేదం

|

రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఏపీ రాజధాని బిల్లుల విషయంలో కాషాయ నేతల మధ్య ఇప్పటికే కొనసాగుతోన్న భేదాభిప్రాయాలు మరోసారి రచ్చకెక్కాయి. ఈసారి ఏకంగా కొత్త చీఫ్ సోము వీర్రాజు కు తొలిసారి కౌంటర్ పడటం గమనార్హం. సీనియర్ ఎంపీ సుజనా చౌదరి ఈ మేరకు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

జగన్ కూతురు చదివే చోటా అదే తీరు - ఏపీ సీఎం వల్లే కేంద్రం కొత్త విద్యా విధానం - ఎంపీ రఘురామ సంచలనంజగన్ కూతురు చదివే చోటా అదే తీరు - ఏపీ సీఎం వల్లే కేంద్రం కొత్త విద్యా విధానం - ఎంపీ రఘురామ సంచలనం

ఆట మళ్లీ మొదలైంది..

ఆట మళ్లీ మొదలైంది..

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన ‘పాలనా వికేంద్రీకరణ' బిల్లు పది రోజులుగా గవర్నర్ కోర్టులో ఉంది. దీనిపై ఇప్పటికే న్యాయ సలహాలు కూడా తీసుకున్న గవర్నర్.. ఒకటి రెండు రోజుల్లోనే తుది నిర్ణయం వెలువరిస్తారని సమాచారం. బుధవారం ఆర్థిక మంత్రి బుగ్గన.. గవర్నర్ తో భేటీ అయిన తర్వాత, బిల్లుల ఆమోదంపై అధికార వైసీపీ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యంపై తలో మాట చెబుతూ కావాల్సినంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన ఏపీ బీజేపీ నేతలు.. కొన్నాళ్లుగా వ్యూహాత్మక మౌనం పాటించారు. రాష్ట్ర సారధిగా సోము వీర్రాజు నియమితులైన రెండో రోజే మళ్లీ ఆట మొదలైందా? అనే స్థాయిలో వ్యాఖ్యానాలకు దిగారు. ఈ క్రమంలోనే సోము, సుజనా పరస్పరం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

కేంద్రం జోక్యం ఉండదన్న సోము..

కేంద్రం జోక్యం ఉండదన్న సోము..

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశంపై కేంద్రంలోని మోదీ సర్కార్ ఎలాంటి జోక్యం చేసుకోబోదని, అసలీ వ్యవహారంతో కేంద్రానికి సంబంధమే లేదని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు అన్నారు. ‘‘దేశంలో అనేక చోట్ల రాజధానులు పెడుతుంటారు. వాటిలో కేంద్రం ఎనాడూ జోక్యం చేసుకోలేదు. ఏపీలో గ‌తంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజధాని పేరుతో సింగపూర్, జపాన్, చైనా అని పలు రకాల కథలు చెప్పారు. నాడు కూడా కేంద్రం.. బాబు మాటలపై, నిర్ణయాలపై ఎటువంటి అభ్యంతరం వ్యక్తంచేయలేదు. ఇప్పుడు జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల‌ విషయంలోనూ కేంద్రం అదే వైఖరిని అనుసరిస్తుంది'' అని స్పష్టం చేశారు.

నాపై భయానక కుట్ర - జగన్ కు అపకీర్తి వద్దనే ముందుకొచ్చా - పేకాట వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవినాపై భయానక కుట్ర - జగన్ కు అపకీర్తి వద్దనే ముందుకొచ్చా - పేకాట వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

అదంతా చంద్రబాబు చదరంగం..

అదంతా చంద్రబాబు చదరంగం..


‘‘ఏపీలో రాజధాని ఎక్కడ పెట్టుకుంటారనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. ఈ విషయంలో బీజేపీని ఇరుకున పెట్టడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మా ఆందోళనల్లా ఒక్కటే.. అమరావతికి భూములిచ్చిన రైతులకు కచ్చితంగా న్యాయం జరగాలి. అందుకోసం బీజేపీ పోరాడుతుంది. వైసీపీ తప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము. ఏపీ రాజకీయాలు ఇకపై చాలా సీరియస్ గా ఉండబోతున్నాయి. చంద్రబాబు తాను బీజేపీకి దగ్గరవుతానంటూ సంకేతాలు ఇస్తున్నారు. అదంతా ఆయన ఆడే రాజకీయ చదరంగం. బాబుకు ధీటుగా మేం కూడా కొత్త ఎత్తుగడలు వేస్తాం'' అని వీర్రాజు పేర్కొన్నారు. గురువారం పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయనీ కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే..

ఎంపీ తీవ్ర స్సందన..

ఎంపీ తీవ్ర స్సందన..

ఏపీ రాజధాని అంశంపై బీజేపీకే చెందిన సీనియర్ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానితో కేంద్రానికి సంబంధం లేదన్న రాష్ట్ర చీఫ్ వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా.. ‘‘బిల్లులపై నిర్ణయం తీసుకోబోయేది కేంద్రమే''అని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఈ విషయాన్ని ఘంటాపథంగా చెప్పగలననంటూ సుజనా.. సోముతో విభేదించడం గమనార్హం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కమార్ పునర్నియామకం అంశంపైనా ఘాటుగా స్పందించిన సుజనా.. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం..

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం..

ఏపీ రాజకీయ వ్యవహారాలపై గురువారం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ సుజనా.. ఎస్ఈసీ వ్యవహారంలో జగన్ సర్కారు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నట్టుగా ఉందన్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి చట్టాలు మారిపోవని, అలా మార్చాలనుకోవడం కూడా సరికాదన్నారు. సీఎం జగన్ అనాలోచిత తీరు వల్ల రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా ముందుకు కదల్లేదని, భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ ఇకనైనా అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని సుజనా సూచించారు.

  APSRTC To Run Limited Services అవసరం లేని రూట్లలో APSRTC సర్వీసులు నిలిపివేత!! || Oneindia Telugu
  సోముతో సుజనా విభేదం..

  సోముతో సుజనా విభేదం..

  ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదంపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యక్తపరిచిన అభిప్రాయాలకు పూర్తి భిన్నంగా ఎంపీ సుజనా వ్యాఖ్యలు చేశారు. ‘‘అసెంబ్లీలో మెజార్టీ ఉందికదాని రాజధానులు పెంచుకుంటూ పోవడం సరికాదు. శాసనమండలి ఆమోదించకుండా రాజధాని బిల్లును గవర్నర్ వద్దకు పంపడం రాజ్యాంగ విరుద్ధం. అసలింతకీ ఆ బిల్లులు ఎక్కడున్నాయి? వాటికి సెలెక్ట్ కమిటీ ఆమోదం ఉందా? లేదా? అన్ని తెలియదు. ఎవరెన్ని చెప్పినా.. రాజ్యాంగం ప్రకారం.. రాష్ట్ర రాజధాని వ్యవహారంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే. ఒక రాజ్యసభ సభ్యుడిగా నేను కచ్చితంగా చెబుతున్నాను.. ఏపీ రాజధానిపై కేంద్రం సరైన సమయంలో, సరైన విధంగా జోక్యం చేసుకుంటుంది''అని సుజనా కుండబద్దలు కొట్టారు. ఎంపీ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు స్పందించాల్సి ఉంది.

  English summary
  andhra pradesh bjp leaders once differs each other on three capitals issue. when state party new president somu veerraju said that center would not interfere, mp sujana chowdary says center only will take a call. the mp also slams cm jagan on nimmagadda issue.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X