విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ త‌గ్గే ప్ర‌సక్తే లేదు..బ‌దులివ్వాల్సిందే: రెండో రోజే అర్ద‌మైపోయింది: సీఎం టార్గెట్ టీడీపీ..!

|
Google Oneindia TeluguNews

అంతం కాదిది..ఆరంభం. వైసీపీ నేత‌లు చెబుతున్న డైలాగ్ ఇది. ఏపీ అసెంబ్లీ స‌మావేశాల రెండో రోజే నాటి టీడీపీ ప్ర‌భుత్వ తీరు..చంద్ర‌బాబు ల‌క్ష్యంగా వైసీపీ మూకుమ్మ‌డి దాడి చేసింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో స‌హా ఎమ్మెల్యేలంతా ఫిరాయింపుల విష‌యంలో చంద్ర‌బాబును నిల‌దీసారు. ప్ర‌శ్నించారు. ఫైర్ అయ్యారు. అయినా..చంద్ర‌బాబు మాత్రం నిస్స‌హాయంగా ఉండిపోయారు. వైయ‌స్ నాడు అలా చేసార‌న‌టం మిన‌హా ఏం చెప్ప‌లేక పోయారు. అయితే, ఇప్పుడు వైసీపీ నేత‌లు స్ప‌ష్టంగా చెబుతున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్‌..పార్టీగా వైసీపీని నాడు టీడీపీ అవ‌మానించింది. దీనికి బ‌దులివ్వాల్సిందే. త‌గ్గే ప్ర‌సక్తే లేద‌ని తేల్చి చెబుతున్నారు.

కొత్త త‌ర‌హా రాజ‌కీయాల‌కు కేరాఫ్‌.. వైఎస్ జ‌గ‌న్‌! కొత్త త‌ర‌హా రాజ‌కీయాల‌కు కేరాఫ్‌.. వైఎస్ జ‌గ‌న్‌!

బదులివ్వాల్సిందేనంటున్న జ‌గ‌న్..

బదులివ్వాల్సిందేనంటున్న జ‌గ‌న్..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బ‌దులివ్వాల్సిందేన‌ని నిర్ణ‌యించారు. ఆ విష‌యం శాన‌స‌భ స‌మా వేశాల్లో రెండో రోజునే స్ప‌ష్టం చేసారు. వాస్త‌వంగా కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఆరు నెల‌ల వ‌ర‌కు ప్ర‌భుత్వానికి స‌మ‌యం ఇస్తామ‌ని..అప్ప‌టి వ‌ర‌కు సంయ‌మ‌నంతో ఉంటామ‌ని ప్ర‌తిప‌క్ష టీడీపీ ప్ర‌క‌టించింది. అయితే, టీడీపీకి ఆ అవ‌కాశం లేకుండా అధికార ప‌క్ష‌మే రంగంలోకి దిగింది. అయిదేళ్ల పాటు తాము స‌భ‌లోనూ..బ‌యటా ఇబ్బందుల‌కు కార‌ణ‌మైన నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరును అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తీ చోట నిల‌దీయ‌టం..అదే స‌మ‌యంలో త‌మ విధానం స్ప‌ష్టం చేయ‌టం ల‌క్ష్యంగా జ‌గ‌న్ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా..శాన‌స‌భ‌లో ఫిరాయింపుల అంశం లో ప్ర‌తిప‌క్షం స‌మాధానం చెప్పుకోలేని ప‌రిస్థితుల్లోకి నెట్టేసిన వైసీపీ..మిగిలిన అంశాల్లోనూ అదే స్థాయిలో ఎదురు దాడి చేయాల‌ని నిర్ణ‌యించింది.

ఇక‌..అవినీతి ల‌క్ష్యంగా..

ఇక‌..అవినీతి ల‌క్ష్యంగా..

శాస‌న‌స‌భ‌లో రెండో రోజు ఫిరాయింపుల పైన విరుచుకుప‌డిన అధికార పక్షం..ప్ర‌తిప‌క్షానికి ఏ మాత్రం అవ‌కాశం లేకుండా చేయాల‌ని నిర్ణ‌యించింది. అందులో భాగంగా..ఇప్ప‌టికే త‌మ ప్ర‌భుత్వం తీసుకున్న అనేక నిర్ణ‌యాల‌తో టీడీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింద‌నే అభిప్రాయంతో ఉంది. ఇక‌, శాస‌న‌స‌భ‌లోనూ..బ‌యటా నాటి ప్ర‌భుత్వ హయాంలో అనేక మార్గాల్లో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపిస్తున్న వైసీపీ..ఇక నుండి అంశాల వారీగా అవినీతిని బ‌య‌ట పెట్ట‌ట‌మే లక్ష్యంగా ప‌ని చేయ‌నుంది. అందులో భాగంగా..రాజ‌ధాని..పోల‌వ‌రంతో పాటుగా అగ్రిగోల్డ్ అంశాల పైన పార్టీలోని ఎమ్మెల్యేల‌ను ఎంపిక చేసి వారికి పూర్తి స‌మాచారం అందుబాటులో ఉంచుతున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం జ‌గ‌న్ ఇప్ప‌టికే 1150 కోట్లు మంజూరు చేసారు. గ‌త ప్ర‌భుత్వం అయిదేళ్ల కాలంలో ఏం చేసిందీ..తాము 15 రోజుల పాల‌న‌లో ఎటువంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నామ‌ని చెబుతూ..పూర్తిగా టీడీపీని డామినేటె్ చేయ‌ట‌మే ల‌క్ష్యంగా నిర్ణ‌యించారు.

Recommended Video

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.. -మంత్రి కురసాల కన్నబాబు
చంద్రబాబే అస‌లు టార్గెట్...

చంద్రబాబే అస‌లు టార్గెట్...

గ‌త ప్ర‌భుత్వ హయాంలో అనేక ర‌కాలు జ‌న‌గ్ పైన స‌భ‌లోనూ..బ‌య‌టా వ్య‌క్తిగా ఆరోప‌ణ‌లు చేసి జ‌గ‌న్ వ్య‌క్తిత్వాన్ని కించ ప‌రిచేలా టీడీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రించార‌ని ఇప్పుడు వైసీపీ గుర్తు చేస్తోంది. అందులో భాగంగానే..నాడు ప్రతిప‌క్ష నేత హోదాలో అవ‌మానాలు ఎదుర్కొన్న జ‌గ‌న్‌..ప్ర‌తీ దానికి ఇప్పుడు బ‌ద‌లు చెప్పాల‌నే క‌సితో ఉన్నార‌ని పార్టీ సీనియ‌ర్లు వివ‌రిస్తున్నారు. చంద్ర‌బాబు డొల్ల త‌నం బ‌య‌ట పెడుతామంటూ వ్యాఖ్యానిస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ద‌న్య‌వాదా ల తీర్మానం పైన చ‌ర్చ స‌మయంలో అంటే ఈనెల 17, 18వ తేదీల్లో టీడీపీ పైన మరింత అటాకింగ్ విధానంలోనే త‌మ వ్యూహాలు ఉంటాయంటున్నారు. టీడీపీని పూర్తిగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టేసి జ‌గ‌న్ త‌న సామ‌ర్ధ్యం ఏంటో నిరూపించాల‌నే క‌సితో ఉన్నార‌ని పార్టీ సీనియ‌ర్లు చెబుతున్నారు. దీంతో..రానున్న రోజుల్లో వైసీపీ పొలిటిక‌ల్ గేం పూర్తిగా టీడీపీ ల‌క్ష్యం గా సాగ‌నుంది.

English summary
AP Cm Jagan decided to target TDP in all angles in Assembly. In coming days YCP Planing to come out with corruption taken place in TDP tenure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X