విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్య‌మంత్రిగా తొలి రోజు ఇలా: వైయ‌స్‌ను ఇలా గుర్తు చేసారు: జ‌గ‌న్ బిజీ బిజీ..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌గ‌న్ తొలి రోజు అధికారిక కార్య‌క్ర‌మాల‌తో బిజీబిజీగా గ‌డిపారు. పూర్తిగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం ఎక్క‌డా అధికారుల‌కు నిరీక్షించే ప‌రిస్థితి లేకుండా స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. అదే విధంగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి సైతం ఓ స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఉద‌యం 10.30 గంట‌ల నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మాత్రమే ఉద్యోగుల‌తో ప‌ని చేయించుకోవాల‌ని స్ప‌ష్టం చేసారు. త‌న వ‌ద్ద సైతం రాత్రి 8 గంట‌ల త‌రువాత ఎటువంటి స‌మీక్ష‌లు ఉండ‌వ‌ని తేల్చి చెప్పారు.

తొలి రోజు సీఎంగా జ‌గ‌న్ ఏం చేసారంటే..

తొలి రోజు సీఎంగా జ‌గ‌న్ ఏం చేసారంటే..

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌రుస‌టి రోజు..అంటే అధికారికంగా తొలి రోజు ఆయ‌న ముందుగానే నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం న‌డుచుకున్నారు. అధికారిక అప్పాయింట్‌మెంట్లు ఉద‌యం 9 గంట‌ల‌కు మొద‌లు పెట్టారు. అందులో భాగంగా..తొలుత నూత‌న డీజీపీ..ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితో స‌మావేశ‌మ‌య్యారు..
* ఉదయం 9 గంటలకు : రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌తోపాటు.. పలువురు పోలీసు అధికారులతో తన నివాసంలో సమావేశం . శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో రాజీ లేద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌.
* ఉదయం 10 గంటలకు : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఆర్థికశాఖ అధికారులతో సమావేశం. టెండర్ల ప్రక్రియ ప్రక్షాళనపై చర్చ..అధికారులకు పలు సూచనల.. ప్రభుత్వోద్యోగులు తమ పని గంటలకు మించి ఎవరూ పనిచేయరాదని నిర్దిష్ట ఆదేశాలు. త‌న వ‌ద్ద సైతం రాత్రి 8 త‌రువాత స‌మీక్ష‌లు ఉండ‌వ‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌.
* 11 గంటలకు : పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో రాజకీయపరమైన అంశాలపై చర్చలు. కేబినెట్‌ విస్త‌ర‌ణ‌..స‌చివాల‌యంలో ఎంట్రీ..కేబినెట్ మీటింగ్ పైన చ‌ర్చ‌.

మ‌ధ్నాహ్నం లంచ్ బ్రేక్‌..ఆ త‌రువాత‌

మ‌ధ్నాహ్నం లంచ్ బ్రేక్‌..ఆ త‌రువాత‌

* 11.30 గంటలకు : మళ్లీ అధికారులతో సమావేశం. అధికారుల నియామ‌కాలు..బ‌దిలీల అంశం పైన చ‌ర్చ‌.
* మధ్యాహ్నం 1.30 గంటలకు : భోజన విరామం తర్వాత క్యాంపు కార్యాలయంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల మర్యాదపూర్వక భేటీలు. త‌న ప్రాధాన్య‌త‌ల వివ‌ర‌ణ‌.
*సాయంత్రం 4 గంటలకు : అక్షయపాత్ర ఫౌండేషన్‌ ప్రతినిధులతో సమావేశం. అది ముగిసిన వెంటనే పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమావేశం. విద్యాశాఖ‌లో మార్పుల‌కు సూచ‌న‌లు.
*సాయంత్రం 5 గంటలకు : సందర్శకులతో మ‌మేకం. జిల్లాల నుండి వ‌చ్చిన నేత‌ల‌కు స‌మ‌యం కేటాయింపు.
*రాత్రి 8 గంటలకు : తన అధికార కార్యక్రమాలన్నింటినీ ముగింపు. ప్ర‌తీ రోజు రాత్రి 8 గంటలకు ముగింపు.

 వైయ‌స్‌ను గుర్తు చేస్తూ...

వైయ‌స్‌ను గుర్తు చేస్తూ...

జ‌గ‌న్ త‌న తొలి రోజు స‌మీక్ష‌ల్లో తండ్రి వైయ‌స్సార్‌ను గుర్తు చేసారు. స‌మీక్ష‌ల స‌మ‌యంలో అధికారుల అభిప్రాయాల‌కు ప్రాధాన్య‌త‌. వైయస్సార్ సైతం అధికారుల‌కే స్వేచ్చ ఇచ్చేవారు. తాను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది చెప్పేసి ..అది ఏర‌కంగా అమ‌లు చేస్తారో అధికారుల‌కే వ‌దిలేసే వారు. ఇక‌, స‌మ‌య పాల‌న‌లో వైయ‌స్ ఖ‌చ్చితంగా ఉండేవారు. ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు స‌మ‌య పాల‌న ఖ‌చ్చితంగా పాటించే వారు. ఉద‌యం ఖ‌చ్చితంగా 10 .30 గంట‌ల‌కు స‌చివాల‌యానికి వ‌చ్చేవారు. అదే విధంగా సాయంత్రం 5 గంట‌ల‌కు అన్ని అధికారిక విధులు ముగించుకొని స‌చివాల‌యం నుండి వెళ్లి పోయేవారు. అప్పటికే అన్ని స‌మీక్ష‌లు..నిర్ణ‌యాలు పూర్త‌య్యేవి. ఇక‌, మ‌ధ్నాహ్నం ఖ‌చ్చితంగా 1.30 గంట‌ల‌కు లంచ్‌కు విరామం వ‌చ్చేవారు. సాయంత్రి క్యాంపు కార్యాల‌యంలో రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చేవారు. ఇక‌, రాత్రి 8 త‌రువాత అధికారుల‌ను సైతం ఇళ్ల‌కు వెళ్లిపోమ‌వ‌ని చెప్పేవారు. ఇప్పుడు, జ‌గ‌న్ సైతం త‌న తండ్రి విధానాల‌నే అనుస‌రిస్తున్నారు.

English summary
AP new CM Jagan first day official schedule was very busy. He started his work at 9 am and continued up to 8 pm. Jagan following his father timings as CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X