విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్ బిస్వభూషణ్ హరి చందన్ తో భేటీలో జగన్ కీలకంగా ప్రస్తావించింది ఇవే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ హరిచందన్ తో భేటీ అయ్యారు . సాయంత్రం నాలుగు గంటలకు జరిగిన భేటీలో పలు కీలక విషయాలపై గవర్నర్ తో మాట్లాడారు సీఎం జగన్.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టటం వెనుక బలమైన కారణం ఉంది ... అదేంటో తెలుసా ?పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టటం వెనుక బలమైన కారణం ఉంది ... అదేంటో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్‌ను విజయవాడలోని రాజ్‌భవన్‌లో కలిశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసిన తరువాత సిఎం జగన్ గవర్నర్‌ను కలిసిన జగన్ పలు కీలక అంశాలపైనే చర్చించారు . అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తిన అన్ని అంశాలపై, అసెంబ్లీ సెషన్‌లో 14 రోజుల్లో ఆమోదించిన బిల్లులపై సిఎం వైయస్ జగన్ గవర్నర్‌కు తెలియజేశారు. ఎపి సిఎం జగన్ గవర్నర్‌కు విభజన సమస్యల గురించి, తన ప్రభుత్వం నవరత్నాలు పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.

AP CM Jagan met AP Governor Biswabhusan Harichandan .. The main discussion is ..

సుమారు గంటపాటు వీరి మధ్య జరిగిన సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు, చేసిన తీర్మానాలపైన సీఎం జగన్ గవర్నర్ తో చర్చించారు. ప్రజాసంక్షేమానికి సంబంధించి తమ ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలపైన కూడా ఆయన గవర్నర్ కు వివరించారు . రాష్ట్ర విభజన సమస్యలు, తాజా రాజకీయ పరిస్థితులతో పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై గవర్నర్‌కు నిశితంగా వివరించిన జగన్ రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలపై, పలు కీలక అంశాలపై గవర్నర్ కు వివరించారు . ఇకపోతే ఏపీ అసెంబ్లీలో 21బిల్లులు ప్రవేశపెట్టగా 20 బిల్లులుకు ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్రవేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు చట్టం చేసే అంశంపై కీలకంగా చర్చిస్తున్నారు సీఎం జగన్. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది .

English summary
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy met state governor Biswabhusan Harichandan at Rajbhavan in Vijayawada. CM Jagan met the Governor after Andhra Pradesh Assembly has been postponed indefinitely on Tuesday. CM YS Jagan has made the Governor known on all the subjects raised during the Assembly session and the number of bills that were passed during 14 days of the Assembly Session. AP CM Jagan has made Governor know about the problems of bifurcation and his government implementing the Navaratnalu schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X