విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్యమంత్రా.. మజాకా..!ఒకే పార్టీలో ఉండాలని దగ్గుబాటికి జగన్ ఆదేశం..!!పురంధేశ్వరి ఏంచేయబోతున్నారు..!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : రాజకీయాలు ఎన్నికల ముందు ఒక లెక్క.. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక లెక్క అన్నట్టు సాగుతుంటాయి. ఎన్నికల ముందు అన్ని వర్గాల ప్రజలను, వ్యక్తులను చేరదీస్తుంటారు రాజకీయ నేతలు. ఎవరిలో ఏ సత్తా ఉందో, ఎవరి సామర్థ్యం ఎంతవరకు పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తుందో స్పష్టత లేక అందరితో సఖ్యతగా ముందుకు వెళ్తుంటారు ముఖ్య నేతలు. అదే ఎన్నికలు ముగిసిన తర్వాత, ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. ఎన్నికల ముందు ఒకటికి పదిసార్లు భేటీ అయిన నేతలకు ఎన్నికల తర్వాత అసలు గేటులోపలికి రానివ్వని పరిస్ధితులు కూడా తలెత్తుతాయి. ప్రస్తుతం ఏపి రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి.

గెలిచి ఉంటే కీలక పదవి దక్కేది..! ప్రత్యర్ధులను సైతం బాదిస్తున్న దగ్గుబాటి ఓటమి..!!గెలిచి ఉంటే కీలక పదవి దక్కేది..! ప్రత్యర్ధులను సైతం బాదిస్తున్న దగ్గుబాటి ఓటమి..!!

భార్యాభర్తలు ఒకే పార్టీలో ఉండాలి..! లేదంటే కష్టమే అంటున్న వైసీపి..!!

భార్యాభర్తలు ఒకే పార్టీలో ఉండాలి..! లేదంటే కష్టమే అంటున్న వైసీపి..!!

దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ పేర్లకు పెద్దగా ఉపోద్ఘాతాలు అవసరం లేదు. కొన్ని ఏళ్ల నుంచి రాజకీయాలను శాసిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన దంపతులు వీరు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం రెండు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్న దంపతులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరిలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పురందేశ్వరి బీజేపీలో కొనసాగుతుండగా ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో ఉన్నారు. ఇద్దరూ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరుచూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఆయన భార్య పురందేశ్వరి విశాఖ నుంచి ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

పురంధేశ్వరిని పార్టీ మార్పించండి..! ఆమె భర్తకు వైసీపి ముఖ్య నేతల సూచన

దగ్గుబాటికి జగన్ దూరం! మాటల్లేవ్ అంటున్న ఏపి సీఎం..!!

దగ్గుబాటికి జగన్ దూరం! మాటల్లేవ్ అంటున్న ఏపి సీఎం..!!

అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతోంది. ఎన్నికలకు ముందు భార్యాభర్తలు చెరో పార్టీలో కొనసాగేందుకు అభ్యంతరం చెప్పని వైసీపీ, ఇప్పుడు ఏదో ఒక పార్టీని ఎంచుకోవాలని, పురందేశ్వరితో బీజేపీకి రాజీనామా చేయించాలని దగ్గుబాటిపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. కొద్ది కాలంగా బీజేపీ ఏపీలో జగన్ సర్కారును టార్గెట్ చేసి విమర్శలు చేస్తోంది. ఆ క్రమంలోనే పురంధేశ్వరి కూడా వైసీపీ ప్రబుత్వంపైన, జగన్ పైన విరుచుకు పడుతున్నారు.

ప్రకాశం జిల్లాలో చర్చ

ప్రకాశం జిల్లాలో చర్చ

దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యవహారం పార్టీలో, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో చర్చనీయమవుతోంది. దీనిపై వివరణ ఇచ్చుకోవడానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొద్దికాలంగా జగన్‌ను కలవాలనుకుంటున్నట్టు చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరుచూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఆయన భార్య పురందేశ్వరి విశాఖ నుంచి ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

దగ్గుబాటి చివరి ప్రయత్నాలు..!ససేమిరా అంటున్న జగన్..!!

దగ్గుబాటి చివరి ప్రయత్నాలు..!ససేమిరా అంటున్న జగన్..!!

గతంలో పరుచూరులో వైసీపీ ఇన్ చార్జ్ గా ఉండి, దగ్గుబాటి చేరిక తరువాత, టీడీపీలోకి వెళ్లిపోయిన రావి రామనాథం బాబు, ఎన్నికల తరువాత తిరిగి వైసీపీలో చేరారు. ఆపై ఆయనే నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పార్టీ పనులన్నీ ఆయనకే అప్పగిస్తున్నారు కూడా. దాదాపు ఇప్పుడు దగ్గుబాటికి పార్టీలో నామమాత్రపు గుర్తింపు కూడా లేదని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న దగ్గుబాటి, తన అనుచరులతో మొత్తం పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

సీఎం అపాయింట్‌మెంట్ లభిస్తే..

సీఎం అపాయింట్‌మెంట్ లభిస్తే..

ఏపీ సీఎం వైఎస్ జగన్ అపాయింట్ మెంట్ లభిస్తే ఆయనతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారట. జగన్ ఒప్పుకుంటే సరేసరి లేదంటే తానే పార్టీని వీడాలని భావిస్తున్నట్టు దగ్గుబాటి అనుచరులు చెప్పుకొస్తున్నారు. పురంధేశ్వరి మాత్రం పార్టీ మారేందుకు ససేమిరా అంటున్న అంశం పట్ల మాత్రం స్పష్టత వచ్చినట్టు చర్చ జరుగుతోంది.

English summary
In AP politics, there are currently two different parties in the ongoing couple Daggubati Venkateswara Rao and Purandeshwari are facing difficult situations. Purandeshwari continues in the BJP while her husband Daggubati Venkateswara Rao is in the YSRCP.The YCP, who did not object to the husband and wife before the elections, now has to pick up a party and put pressure on Daggubati to resign the BJP with Purandeshwari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X